ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా: 13వ స్థానంలో ముఖేష్ అంబానీ

Forbes World's Billionaire list | ఇప్పటికే భారతదేశంలో ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ 2018లో ఫోర్బ్స్ జాబితాలో 19వ స్థానంలో ఉన్నారు. అప్పుడు ఆయన సంపద 40.1 బిలియన్ డాలర్లు. 2019లో 50 బిలియన్ డాలర్లతో 13వ ర్యాంకు సాధించడం విశేషం.

news18-telugu
Updated: March 6, 2019, 11:52 AM IST
ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా: 13వ స్థానంలో ముఖేష్ అంబానీ
ముకేశ్ అంబానీ (File)
  • Share this:
రిచెస్ట్ ఇండియన్‌గా పేరుతెచ్చుకున్న ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 13వ స్థానం సంపాదించారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో గతంతో పోలిస్తే ఆయన ఆరు ర్యాంకుల్ని మెరుగుపర్చుకొని 13వ స్థానంలో నిలవడం విశేషం. మంగళవారం ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ మరోసారి మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం. 55 ఏళ్ల జెఫ్ బెజోస్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలవగా, ఆయన తర్వాతి స్థానాల్లో బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ఉన్నారు. ఇక ఇప్పటికే భారతదేశంలో ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ 2018లో ఫోర్బ్స్ జాబితాలో 19వ స్థానంలో ఉన్నారు. అప్పుడు ఆయన సంపద 40.1 బిలియన్ డాలర్లు. 2019లో 50 బిలియన్ డాలర్లతో 13వ ర్యాంకు సాధించడం విశేషం.

భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన రిలయెన్స్ ఇండస్ట్రీస్ ద్వారా 60 బిలియన్ డాలర్ల విలువైన ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారాన్ని ముఖేష్ అంబానీ నిర్వహిస్తున్నారు. 2016లో 4జీ ఫోన్ సర్వీస్ జియో లాంఛ్ చేసి తీవ్రమైన పోటీ ఉండే ఇండియన్ టెలికామ్ మార్కెట్‌లో ధరల యుద్ధానికి శ్రీకారం చుట్టారు.

ఫోర్బ్స్


జియో ద్వారా అత్యంత తక్కువ ధరకే వాయిస్ కాల్స్, డేటా సర్వీసులు వస్తుండటంతో 28 కోట్ల మంది కస్టమర్లను దక్కించుకుందని ఫోర్బ్స్ అభిప్రాయపడింది. ఇక ఫోర్బ్స్ లిస్ట్‌లో మొత్తం 106 మంది బిలియనీర్లు ఉంటే వారందరికంటే ముందు స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు. ఆ తర్వాత విప్రో అజీం ప్రేమ్‌జీ(36), హెచ్‌సీఎల్ కో-ఫౌండర్ శివ్ నాడార్(82), ఆర్సెలార్ మిట్టల్ ఛైర్మన్, సీఈఓ లక్ష్మీ మిట్టల్(91), ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ బిర్లా(122), అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ(167), భారతీ ఎయిర్‌టెల్ హెడ్ సునీల్ మిట్టల్(244), పతంజలి ఆయుర్వేద ఆచార్య బాలక్రిష్ణ(365), పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ అజయ్ పిరమల్(436), బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్-షా(617), ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి(962), ఆర్‌కామ్ ఛైర్మన్ అనిల్ అంబానీ(1349) ఫోర్బ్స్ జాబితాలో ఉన్నారు.

Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:IRCTC: ఇక ఆన్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్ చార్టులు... ఖాళీ బెర్తులు మీరే చూసుకోవచ్చు

Paytm First: అమెజాన్ ప్రైమ్‌లా 'పేటీఎం ఫస్ట్'... రూ.750 చెల్లిస్తే వచ్చే లాభాలివే

LIC Home Loan: ఇక 75 ఏళ్ల వరకు ఎల్ఐసీ హోమ్ లోన్ చెల్లించొచ్చు
First published: March 6, 2019, 11:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading