హోమ్ /వార్తలు /బిజినెస్ /

Forbes 2020: అమెరికా ధనవంతుల జాబితాలో ఏడుగురు మనోళ్లే..

Forbes 2020: అమెరికా ధనవంతుల జాబితాలో ఏడుగురు మనోళ్లే..

ప్రతీకాత్మ చిత్రం

ప్రతీకాత్మ చిత్రం

అమెరికా కుబేరుల జాబితాలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (2.5 బిలియన్‌ డాలర్లు) 339వ స్థానంలో నిలిచారు. ఈ లిస్టులో లిస్టులో భారత సంతతికి చెందిన ఏడుగురికి చోటుదక్కింది.

2020 సంవత్సరానికి గాను అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. 400 మంది శ్రీమంతులతో జాబితాను విడుదల చేసింది. ఆ లిస్టులో భారత సంతతికి చెందిన ఏడుగురికి చోటుదక్కింది. అమెరికాలో అత్యంత ధనవంతుడిగా అమెజాన్‌ సీఈవో జెఫ్ బెజోస్‌ వరుసగా మూడో సంవత్సరం మొదటి స్థానంలో నిలిచారు. సంపాదించారు. జెఫ్ బెజోస్ నికర సంపద 179 బిలియన్‌ డాలర్లు. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ రెండో స్థానంలో నిలిచారు. ఆయన నికర సంపద 111 బిలియన్‌ డాలర్లు. ఇక ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ (85 బిలియన్‌ డాలర్లు) మూడో స్థానం, బెర్క్‌షైర్‌ హాథ్‌వే సీఈఓ వారెన్‌ బఫెట్‌ (73.5 బిలియన్‌ డాలర్లు) నాలుగో స్థానం, ఒరాకిల్‌ సహవ్యవస్థాపకుడు లారీ ఎలిసన్‌ (72 బిలియన్‌ డాలర్ల) ఐదో ర్యాంకు సాధించారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (2.5 బిలియన్‌ డాలర్లు) 339వ స్థానంలో నిలిచారు.

ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన భారత సంతతి వ్యాపారుల్లో జెడ్‌స్కేలర్‌ సీఈఓ జై చౌదరీ, సింపనీ టెక్నాలజీ గ్రూపు ఛైర్మన్‌ రమేశ్‌ వాద్వాని, వేఫెయిర్‌ సీఈఓ నీరజ్‌ షా, కోశ్లా వెంచర్స్‌ వ్యవస్థాపకుడు వినోద్‌ కోశ్లా, షేర్‌పాలో వెంచర్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ కవిటర్క్‌ రామ్‌ శ్రీరామ్‌, రాకేశ్‌ గాంగ్వాల్‌, వర్క్‌డే సీఈఓ అనిల్‌ భూశ్రీ ఉన్నారు.

అమెరికా కబేరుల్లో భారత సంతతి వారు:

జై చౌదరీ -85వ స్థానం (6.9 బిలియన్‌ డాలర్లు)

రమేశ్‌ వాద్వాని -238వ స్థానం (3.4 బిలియన్ డాలర్లు)

నీరజ్‌ షా -299వ స్థానం (2.8 బిలియన్ డాలర్లు)

వినోద్‌ కోశ్లా -353వ స్థానం (2.4 బిలియన్ డాలర్లు)

కవిటర్క్‌ రామ్‌ -359వ స్థానం (2.3 బిలియన్ డాలర్లు)

రాకేశ్‌ గాంగ్వాల్‌ -359వ స్థానం (2.3 బిలియన్ డాలర్లు)

అనిల్‌ భూశ్రీ -359వ స్థానం (2.3 బిలియన్ డాలర్లు)

First published:

Tags: America, Donald trump, Forbes, Us news

ఉత్తమ కథలు