ఫోర్బ్స్ ఇండియా 'డబ్ల్యూ-పవర్ ట్రయల్‌బ్లేజర్స్-2019' జాబితాను విడుదల చేసింది. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలతో ఫోర్బ్స్ ఇండియా రూపొందించిన జాబితా ఇది. ఇందులో అందరికీ తెలిసిన సెలబ్రిటీల దగ్గర్నుంచి ఇప్పటివరకు అంతగా ప్రచారాన్ని పొందలేకపోయిన మహిళల్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఫోర్బ్స్ ఇండియా. మూసధోరణులు, లింగ వివక్ష, పురుషాధిక్యతను దాటుకొని తాము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్న మహిళలే వీళ్లంతా. ఈ జాబితాను రూపొందించేందుకు ఫోర్బ్స్ ఇండియా బృందం ఎన్నో అంశాలను పరిశీలించింది. పరిశోధించింది. మేథోమథనం చేసింది.
Read this: పవర్ బ్యాంక్ కొంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు
సామాజిక కార్యకర్తలు, ఆర్కిటెక్ట్స్, క్రీడాకారులు, టెక్నాలజీ లీడర్స్, న్యాయవాదులు, ఆంట్రప్రెన్యూర్స్... ఇలా వేర్వేరు రంగాలకు చెందిన 23 మంది మహిళలతో 'డబ్ల్యూ-పవర్ ట్రయల్‌బ్లేజర్స్-2019' జాబితాను రూపొందించింది ఫోర్బ్స్ ఇండియా. మార్చి 8న వుమెన్స్ డే జరుపుకోవడానికి ముందే ఈ జాబితా రావడం విశేషం. "ఈ మహిళలంతా మార్పు కోరుకుంటున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అనుకున్నది సాధిస్తున్నారు" అని ఫోర్బ్స్ ఇండియా ఎడిటర్ బ్రియాన్ కార్వాల్హో అభిప్రాయ పడ్డారు.
Read this: Link PAN: బ్యాంక్ అకౌంట్‌కి పాన్ లింక్ చేస్తేనే ఐటీఆర్ రీఫండ్
ఫోర్బ్స్ ఇండియా 'డబ్ల్యూ-పవర్ ట్రయల్‌బ్లేజర్స్-2019' జాబితాలో ఉన్న మహిళలు వీళ్లే...
1. ప్రియాంక చోప్రా జొనాస్, సినీ నటి, ఆంట్రప్రెన్యూర్.
2. మేరీ కామ్, బాక్సర్.
3. భక్తి శర్మ, ఓపెన్ వాటర్ స్విమ్మర్.
4. గీతాంజలి రాధాక్రిష్ణన్, ఫౌండర్ అండ్ డైరెక్టర్, అడియువో డయాగ్నస్టిక్స్.
5. రాజలక్ష్మి బోర్‌ఠాకూర్, ఫౌండర్ అండ్ సీఈఓ, టెర్రాబ్లూ ఎక్స్‌టీ.
6. సుభద్ర ద్రవిడ, ఫౌండర్ అండ్ సీఈఓ, ట్రాన్స్‌సెల్ బయోలాజిక్స్.
7. సీమా రావు, కాంబాట్ ట్రైనర్.
8. కోమల్ మంగ్తని, హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్, ఊబెర్.
9. వినతి సరాఫ్ ముత్రేజా, ఎండీ అండ్ సీఈఓ, వినతి ఆర్గానిక్స్.
10. హర్ష్‌బీనా జవేరీ, ఎండీ, ఎన్‌ఆర్‌బీ బేరింగ్స్.
11. షకా, సిపికా, సీమాభట్, కో ఫౌండర్స్, హోమ్‌ల్యాండ్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్స్.
12. బీనా కన్నన్, సీఈఓ, లీడ్ డిజైనర్, సీమాట్టి.
13. రేవతీ కాంత్, చీఫ్ డిజైన్ ఆఫీసర్, టైటాన్ కంపెనీ లిమిటెడ్.
14. అభా నరాయిన్ లంభా, కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్.
15. కేయా వస్వానీ, నిధి కామత్, కో-ఫౌండర్స్, మేనేజింగ్ పార్ట్‌నర్స్, స్టోరీలూమ్ ఫిలిమ్స్.
16. శిఖా మిట్టల్, ఆంట్రప్రెన్యూర్.
17. మేనకా గురుస్వామి, లాయర్.
18. రీతూపర్ణ ఛటర్జీ, మహిమా కుక్రేజా, సంధ్యా మీనన్, #MeToo పోరాటయోధులు, రచయితలు.
Forbes India: 'డబ్ల్యూ-పవర్ ట్రయల్‌బ్లేజర్స్-2019' జాబితాలోని మహిళలు వీళ్లే...
ఇవి కూడా చదవండి:
PM-Kisan scheme: ఏప్రిల్ 1న రైతుల అకౌంట్‌లోకి మరో రూ.2,000... ఆధార్ తప్పనిసరి కాదు
LIC-IDBI: ఇక ఐడీబీఐ బ్యాంకుల్లో ఎల్ఐసీ పాలసీలు, ప్రీమియం చెల్లింపులు
FAME II Scheme: ఎలక్ట్రిక్ కార్లు, బైకులకు భారీ సబ్సిడీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Forbes india, Mary Kom, Priyanka Chopra, Women's day