Home /News /business /

FORBES INDIA RICH LIST 2021 MUKESH AMBANI IS IN TOP SEE WHO IS AFTER HIM GH SK

Top 10 richest Indians: భారత్‌లో అత్యంత ధనవంతుడుగా ముఖేష్ అంబానీ.. ఆ తర్వాతి స్థానాల్లో ఎవరంటే..

International Climate Summit: క్లీన్ ఎనర్జీ రంగంలో రూ.75,000 కోట్ల పెట్టుబడులు: ముకేష్ అంబానీ
(image: File Photo)

International Climate Summit: క్లీన్ ఎనర్జీ రంగంలో రూ.75,000 కోట్ల పెట్టుబడులు: ముకేష్ అంబానీ (image: File Photo)

Forbes Richest Indians List 2021: భారత్‌లోని అత్యంత ధనవంతుల జాబితాను రూపొందించింది ఫోర్బ్స్ ఇండియా. ఇందులో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. మరి ఆయన తర్వాతి స్థానాల్లో ఎవరున్నారో తెలుసా?

భారత్‌లోని అత్యంత ధనవంతుల జాబితాను రూపొందించింది ఫోర్బ్స్ ఇండియా (Forbes India). ఇటీవల ఈ సంస్థ భారత కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఇందులో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. మరో బడా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేపథ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ పూనవాలా అనూహ్యంగా ఐదో స్థానానికి చేరుకున్నారు. 18 బిలియన్ డాలర్ల సంపదతో సావిత్రి జిందాల్ మరోసారి టాప్- 10 క్లబ్‌లో స్థానం దక్కించుకున్నారు.

* టాప్- 10 భారత కుబేరుల జాబితా..

1. ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మొత్తం సంపద నికర విలువ 92.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2008 నుంచి వరుసగా 14వ సంవత్సరం ఆయన తొలి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ ఏడాది ముఖేష్ సంపద నాలుగు బిలియన్ డాలర్లు పెరిగింది.

2. గౌతమ్ అదానీ
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ గ్రూపుల అధినేత గౌతమ్ అదానీకి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి. ఆయన మొత్తం సంపద నికర విలువ 74.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో అదానీకి రెండో ర్యాంకు దక్కింది.

పోస్టాఫీస్ లో అద్భుత పథకం.. రూ.2 లక్షలు పెట్టుబడితో.. రూ.4 లక్షలు తీసుకోవచ్చు.. వివరాలివే

3. శివ్ నాడార్
HCL టెక్నాలజీస్ అధినేత శివ్ నాడార్ సంపద నికర విలువ 31 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత కుబేరుల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు.

4. రాధాకిషన్ దమాని
అవెన్యూ సూపర్‌మార్కెట్స్ పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తున్న రాధాకిషన్ దమాని సంపద నికర విలువ 29.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత ధనవంతుల జాబితాలో ఆయనకు నాలుగో స్థానం దక్కింది.

పన్ను చెల్లిస్తున్నారా? అయితే సకాలంలో పన్ను చెల్లిస్తే కలిగే టాప్ 5 బెనిఫిట్స్ ఏమిటంటే..?

5. సైరస్ పూనవాలా
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా గ్రూపునకు చెందిన సైరస్ పూనవాలా మొత్తం సంపద నికర విలువ 19 బిలియన్ డాలర్లు ఉన్నట్లు ఫోర్బ్స్ గుర్తించింది. భారత ధనవంతుల జాబితాలో ఆయనకు ఐదో స్థానం దక్కింది.

6. లక్ష్మీ మిట్టల్
ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్‌ల అధిపతి అయిన లక్ష్మీ మిట్టల్ సంపద నికర విలువ 18.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. జాబితాలో ఆయనకు ఆరో స్థానం దక్కింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు గుడ్​న్యూస్​.. అతి తక్కువ వడ్డీకే హోమ్​లోన్

7. సావిత్రి జిందాల్
O.P జిందాల్ గ్రూప్‌నకు చెందిన సావిత్రి జిందాల్ ఈ జాబితాలో ఏడో ర్యాంకులో నిలిచారు. ఆమె మొత్తం సంపద నికర విలువ 18 బిలియన్ డాలర్లుగా ఉంది.

8. ఉదయ్ కొటక్
కొటక్ మహీంద్రా బ్యాంక్ అధినేత అయిన ఉదయ్ కొటక్.. ఫోర్బ్స్ భారత ధనవంతుల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఆయన సంపద నికర విలువ 16.5 బిలియన్ డాలర్లుగా ఉంది.

9. పల్లోంజీ మిస్త్రీ
షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ సంస్థల అధిపతి పల్లోంజీ మిస్త్రీ మొత్తం సంపద నికర విలువ 16.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అత్యంత ధనవంతుల జాబితాలో ఆయనకు 9వ ర్యాంకు దక్కింది.

10. కుమార మంగళం బిర్లా
టాప్-10 భారత కుబేరుల జాబితాలో పదో స్థానంలో నిలిచారు ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థల అధినేత కుమార మంగళం బిర్లా. ఆయన సంపద నికర విలువ 15.8 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.

మహమ్మారి సమయంలో సైతం భారతదేశ ధనవంతుల సంపద 50 శాతం పెరిగిందని ఫోర్బ్స్ గుర్తించింది. కుటుంబాలు, వ్యక్తులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, విశ్లేషకులు, భారతదేశ నియంత్రణ సంస్థల నుంచి అందిన ఆర్థిక సమాచారాన్ని ఉపయోగించి ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్ పేర్కొంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Business, Forbes, Forbes india, Mukesh Ambani, Richest Indians

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు