Forbes India Rich List 2019: వరుసగా 12వ సారి ముకేష్ అంబానీ టాప్

Forbes India Rich List 2019 | రిలయెన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయెన్స్ జియో కారణంగా ఆయన సంపద 4.1 బిలియన్ డాలర్లు పెరిగిందని ఫోర్బ్స్ అభిప్రాయపడింది.

news18-telugu
Updated: October 11, 2019, 1:48 PM IST
Forbes India Rich List 2019: వరుసగా 12వ సారి ముకేష్ అంబానీ టాప్
Forbes India Rich List 2019: వరుసగా 12వ సారి ముకేష్ అంబానీ టాప్ (File Photo)
news18-telugu
Updated: October 11, 2019, 1:48 PM IST
ఫోర్బ్స్ రూపొందించిన భారతదేశంలో సంపన్నుల జాబితాలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ రిచ్చెస్ట్ ఇండియన్స్ జాబితాలో ముకేష్ అంబానీ మొదటి స్థానంలో నిలవడం వరుసగా ఇది 12వ సారి. ఆయన సంపద 51.4 బిలియన్ డాలర్లని తేలింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయెన్స్ జియో కారణంగా ఆయన సంపద 4.1 బిలియన్ డాలర్లు పెరిగిందని ఫోర్బ్స్ అభిప్రాయపడింది. ఏడాదిగా ఆర్థిక మందగమనం ఉండటంతో 2019 సంపన్నుల జాబితాలో ఉన్నవారి సంపద 8 శాతం అంటే 452 డాలర్లు తగ్గిందని ఫోర్బ్స్ వివరించింది. ఇక వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఏకంగా ఎనిమిది స్థానాలను మెరుగుపర్చుకొని రెండో స్థానానికి చేరడం విశేషం. 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్ రూపొందించిన 2019 రిచ్చెస్ట్ ఇండియన్స్‌ జాబితాలో టాప్-10 స్థానాల్లో ఉన్నది వీరే.








Loading...










































































 ర్యాంక్  పేరు  సంపద కంపెనీ  వయస్సు
 1  ముకేష్ అంబానీ 51.4  బిలియన్ డాలర్లు  రిలయెన్స్ ఇండస్ట్రీస్  62
 2  గౌతమ్ అదానీ  15.7 బిలియన్ డాలర్లు  అదానీ పోర్ట్స్ & ఎస్ఈజెడ్  57
 3  హిందూజా బ్రదర్స్ 15.6  బిలియన్ డాలర్లు  అశోక్ లీల్యాండ్  83, 78, 73, 68
 4  పల్లోంజీ మిస్త్రీ 15  బిలియన్ డాలర్లు  షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్  90
 5  ఉదయ్ కొటక్ 14.8  బిలియన్ డాలర్లు  కొటక్ మహీంద్రా బ్యాంక్  60
 6  శివ్ నాడార్ 14.4  బిలియన్ డాలర్లు  హెచ్‌సీఎల్ టెక్నాలజీస్  74
 7  రాధాక్రిష్ణ దమానీ 14.3 బిలియన్ డాలర్లు  అవెన్యూ సూపర్‌మార్ట్స్  64
 8  గోద్రేజ్ కుటుంబం  12 బిలియన్ డాలర్లు  గోద్రెజ్ గ్రూప్  -
 9  లక్ష్మీ మిట్టల్  10.5 బిలియన్ డాలర్లు  ఏర్సెలార్ మిట్టల్  69
 10  కుమార్ మంగళం బిర్లా  9.6 బిలియన్ డాలర్లు  ఆదిత్య బిర్లా గ్రూప్  52

 

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Card Lost: మీ క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డు పోయిందా? ఇలా చేయండి

Gold Price Today: తగ్గిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే

SBI: కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ... మళ్లీ ప్రాసెసింగ్ ఫీజు వసూలు
First published: October 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...