హోమ్ /వార్తలు /బిజినెస్ /

India Leadership Awards 2023: GenNext ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డును అందుకున్న ఇషా అంబానీ..

India Leadership Awards 2023: GenNext ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డును అందుకున్న ఇషా అంబానీ..

India Leadership Awards 2023: GenNext ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డును అందుకున్న ఇషా అంబానీ..

India Leadership Awards 2023: GenNext ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డును అందుకున్న ఇషా అంబానీ..

ముంబైలోని గ్రాండ్ హయత్‌లో నిర్వహించిన 12వ ఫోర్బ్స్ ఇండియా లీడర్‌షిప్ అవార్డుల్లో రిలయన్స్ రిటైల్ బిజినెస్ లీడర్ ఇషా అంబానీ జెన్‌నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డును గెలుచుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ముంబైలోని గ్రాండ్ హయత్‌లో నిర్వహించిన 12వ ఫోర్బ్స్ ఇండియా లీడర్‌షిప్ అవార్డుల్లో(India Leadership Awards) రిలయన్స్ రిటైల్ బిజినెస్ లీడర్ ఇషా అంబానీ జెన్‌నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డు గెలుచుకున్న ఇషా అంబానీ తనకు సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.  ఇషా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కుమార్తె కాగా.. పిరమల్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్‌ను(Anand) వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం.. డిసెంబర్ 12, 2018న ముంబైలోని అంబానీ అల్టామౌంట్ రోడ్ నివాసం, యాంటిలియాలో జరిగింది.  వీరి వివాహానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ విదేశాంగ కార్యదర్శి, అమెరికా ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రతన్ టాటా, బచ్చన్‌లు, రజనీకాంత్, అమీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్ తదితరులు హాజరయ్యారు. గత నెలలో అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో ఈశా అంబానీ కవల పిల్లలకు జన్మనిచ్చారు. వారిలో ఒకరు మగ పిల్లవాడు కాగా, మరొకరు అమ్మాయి. పాప పేరును ఆదియా అని, బాబు పేరును కృష్ణ అని పెట్టారు.

Jobs In IGNOU: ఇగ్నోలో ఉద్యోగాలు .. 12వ తరగతి ఉత్తీర్ణత..

ఇదిలా ఉండగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క 45వ వార్షిక సాధారణ సమావేశం ఆగస్టు 2022న నిర్వహించగా.. ముఖేష్ అంబానీ ఇషాను రిలయన్స్ రిటైల్ వ్యాపారానికి లీడర్‌గా పరిచయం చేశారు.

గత సంవత్సరం ఇషా అంబానీ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో కళల రంగంలో మొట్టమొదటిసారిగా కల్చరల్ సెంటర్ (NMACC)ని ప్రారంభిచారు. ఆమె దీనిని తన తల్లి నీతా అంబానీకి అంకితం చేశారు. నీతా ముఖేష్ అంబానీ (Nita Mukesh Ambani)కల్చరల్ సెంటర్ స్థలం కంటే చాలా ఎక్కువ అని ఇషా అంబానీ (Isha Ambani) అన్నారు. ఇది కళలు, సంస్కృతి పట్ల తన తల్లికి ఉన్న అభిరుచి, భారతదేశం పట్ల ఆమెకున్న ప్రేమకు ఓ నిదర్శనమని అన్నారు. ఇందుకోసం ఆమె ఎప్పుడూ ఒక వేదికను సృష్టించాలని కలలు కనేవారని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులు, కళాకారులు, ప్రదర్శకులు, సృజనాత్మకతలకు స్వాగతమని అన్నారు.

భారతదేశం ప్రపంచానికి అందించే వాటిలో అత్యుత్తమమైన వాటిని ప్రదర్శించడం, ప్రపంచాన్ని భారతదేశానికి తీసుకురావడం NMACC కోసం నీతా అంబానీ దృష్టి పెట్టారని ఇషా అంబానీ పేర్కొన్నారు. NMACC జియో వరల్డ్ సెంటర్‌లో ఉంది. ఇది దేశంలో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్. రిటైల్, హాస్పిటాలిటీ అవుట్‌లెట్‌లు అన్నీ భారతదేశ ఆర్థిక, వినోద రాజధాని ముంబై నడిబొడ్డున ఉన్నాయి.

First published:

Tags: Isha Ambani, Mukesh Ambani, Reliance