హోమ్ /వార్తలు /బిజినెస్ /

Keerthi Reddy: ఫోర్బ్స్ ఇండియా జాబితాలో టీఆర్‌ఎస్ ఎంపీ కుమార్తెకు చోటు..

Keerthi Reddy: ఫోర్బ్స్ ఇండియా జాబితాలో టీఆర్‌ఎస్ ఎంపీ కుమార్తెకు చోటు..

ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన జాబితాలో తెలంగాణకు చెందిన కీర్తిరెడ్డి చోటు సంపాదించుకున్నారు. పోర్బ్స్‌ ఇండియా అండర్‌-30 జాబితాలో ఈమె స్థానం సంపాదించారు.

  ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన జాబితాలో తెలంగాణకు చెందిన కీర్తిరెడ్డి చోటు సంపాదించుకున్నారు. పోర్బ్స్‌ ఇండియా అండర్‌-30 జాబితాలో ఈమె స్థానం సంపాదించారు. కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ కోసం చేస్తున్న సేవలకు గానూ ఆమెకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం సంపాదించిన మొత్తం 13 మంది మహిళల్లో కీర్తిరెడ్డి ఒకరు. 24 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన కీర్తిరెడ్డి మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కూతురు. పదో తరగతి వరకు హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివిన ఆమె.. ఇంటర్‌ చిరెక్‌ కళాశాలలో పూర్తిచేశారు. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాల నుంచి బీబీఎం పట్టా పొందారు. అలాగే ఆమె లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌ మేనేజ్‌మెంట్‌లో గ్లోబల్‌ మాస్టర్‌ పట్టాను పొందారు. స్టాట్విగ్‌ అనే వ్యాక్సిన్‌ ట్రాకింగ్‌ కంపెనీకి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

  ఫార్మా కంపెనీల్లో తయారైన వ్యాక్సిన్‌ గమ్యస్థానాలకు చేరేదాకా నిరంతరం పర్యవేక్షించేలా వ్యాక్సిన్‌ ట్రాకింగ్‌ విభాగాన్ని కీర్తి నిర్వహించి సత్ఫలితాలను సాధించారు. తన తండ్రి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి తనకు స్ఫూర్తి అని తెలిపారు. లండన్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసిన తర్వాత సింగపూర్‌కు చెందిన సైప్లె చైన్‌ కంపెనీ క్యూనికస్‌తో కొంతకాలం పనిచేసినట్లు వెల్లడించారు. కొద్దికాలంలోనే గొప్ప పేరు గడిచిన కీర్తిరెడ్డి ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. తన పనితనంతో కుమార్తె తనను గర్వించేలా చేసిందని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

  ఇక,  మొత్తం 30 మందితో కూడిన ఈ జాబితాలో మరో 12 మంది మహిళలు కూడా చోటు దక్కించుకున్నారు. వారిలో ప్రముఖ సినీ నటి కీర్తి సురేశ్‌ కూడా ఉన్నారు.

  First published:

  Tags: Forbes india, Telangana

  ఉత్తమ కథలు