హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC: ఐఆర్‌సీటీసీ జ్యోతిర్లింగ యాత్ర టూర్ ప్యాకేజీ లాంచ్.. బుకింగ్ చేసుకోండిలా...

IRCTC: ఐఆర్‌సీటీసీ జ్యోతిర్లింగ యాత్ర టూర్ ప్యాకేజీ లాంచ్.. బుకింగ్ చేసుకోండిలా...

ద్వాదశ జ్యోతిర్లింగాలు

ద్వాదశ జ్యోతిర్లింగాలు

IRCTC: జ్యోతిర్లింగాలను సందర్శించాలనుకునే యాత్రికుల కోసం IRCTC స్పెషల్ ట్రావెల్ ప్యాకేజీ ట్రిప్‌ను ప్రకటించింది. జ్యోతిర్లింగ యాత్ర టూర్ ప్యాకేజీ పేరుతో అందించే ఈ ట్రిప్‌ కాస్ట్, టికెట్ బుకింగ్ ప్రాసెస్, ఇతర వివరాలు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రయాణికుల అభిరుచులకు తగ్గట్టు ఇండియన్ రైల్వేస్ (Indian Railways) ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంది. సీజన్‌, పండుగలు, సెలవుల ఆధారంగా స్పెషల్ టూర్ ప్యాకేజీలతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి టూర్ ప్యాకేజీలతో.. యాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని రకాల వసతులను ఐఆర్‌సీటీసీ (IRCTC) కల్పిస్తుంటుంది. తాజాగా జ్యోతిర్లింగాల (Jyotirlingas)ను సందర్శించాలనుకునే యాత్రికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్పెషల్ ట్రావెల్ ప్యాకేజీ ట్రిప్‌ను ప్రకటించింది. జ్యోతిర్లింగ యాత్ర టూర్ ప్యాకేజీ (Jyotirlinga Yatra Tour Package) పేరుతో అందించే ఈ ట్రిప్‌ కాస్ట్, టికెట్ బుకింగ్ ప్రాసెస్, ఇతర వివరాలు తెలుసుకుందాం.

జ్యోతిర్లింగ యాత్ర టూర్ ప్యాకేజీలో భాగంగా ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, భేట్ ద్వారక వంటి పుణ్యక్షేత్రాలతో పాటు శివరాజ్‌పూర్ బీచ్‌ను కుడా సందర్శించవచ్చు. ఆన్‌బోర్డింగ్, డీ-బోర్డింగ్ స్టేషన్లలో గోరఖ్‌పూర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్ సంగం, లక్నో, విరంగనా లక్ష్మీ బాయి లోకేషన్స్‌ ఉన్నాయి.

ఈ యాత్ర మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లుగా ఉంటుంది. టూర్ ప్యాకేజీ కోడ్ NZSD07. 2022 అక్టోబర్ 15న గోరఖ్‌పూర్ నుంచి టూర్ మొదలవుతుంది. ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, భేట్ ద్వారక వంటి పుణ్యక్షేత్రాలను టూరిస్టులు దర్శించుకోనున్నారు.

* బుకింగ్ చేసుకోండిలా...

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ www.irctctourism.comలో ద్వారా ఈ యాత్ర కోసం టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ ఆఫీసులు, ఇతర ప్రాంతీయ ఆఫీసులను సంప్రదించి కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/pacakage_description?packageCode=NZSD07 ను చెక్ చేసుకోవచ్చు.

* ఒక్కొ టూరిస్ట్ ఎంత చెల్లించాలంటే?

టూర్‌లో భాగంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక టూరిస్ట్ రైలును ఏర్పాటు చేయనున్నారు. ఈ యాత్ర 2022 అక్టోబర్ 15 నుంచి ప్రారంభమవుతుంది. ఒక్కో టూరిస్ట్ రూ.15,150 చెల్లించాల్సి ఉంటుంది. జ్యోతిర్లింగ్ యాత్ర ఎక్స్ గోరఖ్‌పూర్ టూర్ ప్యాకేజీలో భాగంగా స్లీపర్ క్లాస్ ప్రయాణం, వసతి, సైట్‌ల మధ్య బదిలీలు, టూర్ ఎస్కార్ట్, రైలులో భద్రత, వెజిటబుల్ మీల్స్‌తో పాటు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఉంటాయి.

ఇది కూడా చదవండి : ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకు కొత్త రూల్స్ ఇవే..

* మరో టూర్ ప్యాకేజీ..

దేశంలోని వివిధ మతపరమైన ప్రదేశాలను సందర్శించాలనుకునే వారిక కోసం ఐఆర్‌సీటీసీ స్వదేశ్ దర్శన్ టూరిస్ట్ రైళ్లను ఏర్పాటు చేస్తోంది. సరసమైన ధరలకే ఈ టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. తమిళనాడులోని రామేశ్వరం సందర్శించాలనే వారి కోసం ప్రస్తుతం మరో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో మధురై, రామేశ్వరం కవర్ అవుతాయి. 2022, సెప్టెంబర్30న ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం టూర్ 4 రాత్రులు, 5 పగళ్లు ఉంటుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8,300, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11,200 చెల్లించాల్సి ఉంటుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Indian Railways, IRCTC, IRCTC Tourism, Lord Shiva

ఉత్తమ కథలు