హోమ్ /వార్తలు /బిజినెస్ /

Goa: కుటుంబ విహారయాత్రలకు టాప్ డొమెస్టిక్‌ డెస్టినేషన్ గోవా.. టాప్ 5 లిస్ట్ ఇదే!

Goa: కుటుంబ విహారయాత్రలకు టాప్ డొమెస్టిక్‌ డెస్టినేషన్ గోవా.. టాప్ 5 లిస్ట్ ఇదే!

Goa: కుటుంబ విహారయాత్రలకు టాప్ డొమెస్టిక్‌ డెస్టినేషన్ గోవా.. టాప్ 5 లిస్ట్ ఇదే!

Goa: కుటుంబ విహారయాత్రలకు టాప్ డొమెస్టిక్‌ డెస్టినేషన్ గోవా.. టాప్ 5 లిస్ట్ ఇదే!

Goa: ఇండియాలో పర్యాటక ఆకర్షణలు చాలా ఉన్నాయి. అత్యధిక శాతం మంది చుట్టివస్తున్న లిస్ట్‌లో గోవా టాప్‌లో ఉంది. అందమైన బీచ్‌లకు నెలవైన గోవా ప్రపంచ వ్యాప్తంగా టూరిస్ట్‌లను ఆకర్షిస్తోంది. డిజిటల్ ట్రావెల్ ప్లాట్‌ఫారం ‘అగోడా’ సెర్చ్ డేటా ప్రకారం.. భారతీయ కుటుంబాలకు గోవా అత్యంత కామన్ సెర్చ్ డొమెస్టిక్ డిస్టినేషన్‌గా మారింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియా (India)లో పర్యాటక ఆకర్షణలు చాలా ఉన్నాయి. అత్యధిక శాతం మంది చుట్టివస్తున్న లిస్ట్‌లో గోవా (Goa) టాప్‌లో ఉంది. అందమైన బీచ్‌లకు నెలవైన గోవా ప్రపంచ వ్యాప్తంగా టూరిస్ట్‌లను ఆకర్షిస్తోంది. డిజిటల్ ట్రావెల్ ప్లాట్‌ఫారం ‘అగోడా’ సెర్చ్ డేటా ప్రకారం.. భారతీయ కుటుంబాలకు గోవా అత్యంత కామన్ సెర్చ్ డొమెస్టిక్ డిస్టినేషన్‌గా మారింది. ఇక దుబాయ్ అత్యంత ప్రజాదరణ పొందిన అంతర్జాతీయ గమ్యస్థానంగా ఉంది. డిజిటల్ ట్రావెల్ ప్లాట్‌ఫారం ‘అగోడా’ సెర్చ్ డేటా ప్రకారం.. గోవా, న్యూఢిల్లీ NCR, ముంబై, పాండిచ్చేరి, జైపూర్ నగరాలు టూరిస్ట్‌లు ఎక్కువ‌గా విజిట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అంతర్జాతీయ సెగ్మెంట్‌లో దుబాయ్, సింగపూర్, మాల్దీవులు, బాలి (ఇండోనేషియా), ఫుకెట్ (థాయ్‌లాండ్) సెర్చ్ చార్ట్స్‌లో ముందువరుసలో ఉన్నాయి.

* దుబాయ్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాలకు

ఇండియన్ టూరిస్ట్‌లు హాలిడేస్‌లో విజిట్ చేయడానికి దుబాయ్‌తో పాటు, ఆగ్నేయాసియా దేశాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారని సెర్చ్ డేటా బట్టి అర్థమవుతోంది. ఈ ప్రదేశాల్లో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. పైగా అద్భుతమైన బీచ్‌ల కారణంగా పిల్లలతో కలిసి మొత్తం కుటుంబం ట్రిప్‌ను ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. బోర్డింగ్ కోసం వివిధ రకాల లాడ్జింగ్స్ ఫెసిలిటీస్ పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది భారతీయులు ఈ ప్రదేశాలను విజిట్ చేయాలని అనుకుంటున్నారు.

* టాప్ 5 నగరాల ప్రత్యేకత

డొమెస్టిక్‌ ట్రిప్‌కు వెళ్లినప్పుడు సిటీల్లో బస చేయడం సర్వసాధారణం. సెర్చ్‌లో టాప్ ఐదు స్థానాల్లో ఉన్న నగరాలు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. గోవా ఆహ్లాదకర బీచ్‌లకు ప్రసిద్ధి చెందగా, న్యూ ఢిల్లీ NCR, ముంబయిలో అనేక చారిత్రాత్మక ప్రదేశాలు, ఆలయాలు, టూరిస్ట్‌ అట్రాక్షన్‌లు ఉన్నాయి. పాండిచ్చేరి ప్రకృతి సౌందర్యానికి, జైపూర్ గొప్ప చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలకు నిలయంగా ఉన్నాయి.

ఈ ప్రదేశాలు అగోడా ఫ్యామిలీ ట్రావెల్ ట్రెండ్ సర్వే సెర్చ్‌లకు అనుగుణంగా ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా 12 మార్కెట్ల నుంచి 14,000 మంది కుటుంబ ప్రయాణికులను సర్వే చేసింది. మొదటి మూడు కుటుంబాలు.. ల్యాండ్‌మార్క్‌లను చూడటం, ఒడ్డున విశ్రాంతి తీసుకోవడం, థీమ్ లేదా వినోద ఉద్యానవనాల్లో మంచి సమయం గడపడం వంటివి ఆసక్తులుగా ఉన్నాయని సర్వే వెల్లడించింది.

ఇది కూాడా చదవండి : హాంకాంగ్‌కు 500,000 ఫ్రీ టిక్కెట్లు.. ఫ్రీ ఫ్లైట్‌ టిక్కెట్ గెలవాలంటే మీరు చేయాల్సింది ఇదే!

* ఒక్క క్లిక్‌తో అన్ని సౌకర్యాలు

అగోడా ఇండియా కంట్రీ డైరెక్టర్ కృష్ణ రాఠి మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు నాణ్యమైన సమయాన్ని గడపడానికి, పాఠశాల సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. భారతీయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేందుకు బీచ్‌లను గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు. అన్ని వయస్సులకు చెందిన వారితో బడ్జెట్‌లో ట్రిప్ ప్లాన్ చేయడం సవాలుగా ఉంటుంది. అగోడాలో ఒక బటన్‌ క్లిక్‌తో వసతి, విమాన కార్యకలాపాలతో బుకింగ్ ప్రయాణాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం.’ అని కృష్ణ రాఠి పేర్కొన్నారు.

First published:

Tags: Goa, India, Travel

ఉత్తమ కథలు