సామాన్యులకు మరో గుడ్ న్యూస్. త్వరలో వంట నూనెల ధరలు (Cooking Oil Prices) మరింత తగ్గబోతున్నాయి. రెండు వారాల్లో వంటనూనెల ధరల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్స్ కంపెనీలను ఆదేశించింది. రెండు వారాల్లో లీటర్ నూనెపై రూ.10 నుంచి రూ.12 మధ్య తగ్గించాలని తెలిపింది. గత నెలలో అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో రీటైల్ మార్కెట్‌లో వంట నూనెల ధరల్ని మరింత తగ్గించే అవకాశాలపై చర్చించడానికి ఆహార మంత్రిత్వ శాఖ వంట నూనెల తయారీ కంపెనీలు, వర్తక సంఘాలతో గురువారం చర్చలు జరిపింది. వంట నూనెల ధరల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఏడాది మే నుంచి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సమావేశాలు నిర్వహించడం ఇది మూడోసారి. పామాయిల్ ఎగుమతిదారులో అతిపెద్ద దేశమైన ఇండోనేషియా ఎగుమతులపై నిషేధాన్ని తొలగించడం, పొద్దుతిరుగుడు, సోయా నూనెల సరఫరాను సడలించడం లాంటి పరిణామాల తర్వాత గ్లోబల్ ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గాయి. గ్లోబల్ మార్కెట్‌లో తగ్గిన ధరల్ని వినియోగదారులకు బదిలీ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రీటైల్ వంటనూనెల ధరల్ని మరింత తగ్గించే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలతో చర్చలు జరిపి తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
Credit Card: ఇక క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించే తేదీని మీరే నిర్ణయించుకోవచ్చు
గత నెలలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. లీటర్ నూనెపై రూ.15 తగ్గించాలని ఆదేశించడంతో కంపెనీలు ధరల్ని తగ్గించాయి. ఇప్పుడు మరోసారి రూ.10 నుంచి రూ.12 మధ్య ధర తగ్గబోతోంది. భారతదేశం వార్షికంగా వినియోగించే వంటనూనెల్లో 56 శాతం దిగుమతుల ద్వారానే వస్తోంది. ట్రేడ్ డేటా ప్రకారం, పామాయిల్ ధరలు తగ్గాయి. గత నెల రోజుల్లో చూస్తే జూలై 29 నాటికి పామాయిల్ టన్నుకు 14 శాతం తగ్గి 1,170 డాలర్లకు పడిపోయింది. అలాగే సోయాబీనన్ ఆయిల్ ధర 4 శాతం తగ్గి టన్నుకు 1,460 డాలర్లకు చేరుకోగా, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర 14 శాతం తగ్గి టన్నుకు 1,550 డాలర్లకు చేరుకుంది.
Pension Scheme: నెలకు రూ.50,000 పెన్షన్ కావాలంటే ఎంత పొదుపు చేయాలో తెలుసా?
ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర తగ్గడంతో భారతదేశంలో వంటనూనెల ధరల్ని తగ్గించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గురువారం ఆయిల్ కంపెనీలతో జరగబోయే సమావేశంలో వంటనూనెల ధరల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cooking oil, Edible Oil, Mustard Oil, Oil prices, Sunflower oil