పడిపోతున్న ఫుడ్ డెలివరీ మార్కెట్... ఇవీ కారణాలు

Food Delivery : ఈ రోజుల్లో ఇళ్లలో వండుకునే వాళ్ల సంఖ్య తగ్గిపోయిందనీ... ఫుడ్ డెలివరీ మార్కెట్ పంట పండుతోందనీ అనుకోకండి. అంత సీన్ లేదని తేలింది.

news18-telugu
Updated: December 1, 2019, 6:42 AM IST
పడిపోతున్న ఫుడ్ డెలివరీ మార్కెట్... ఇవీ కారణాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Food Delivery : స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్... ఇలా ఫుడ్ డెలివరీ యాప్స్‌ బోలెడున్నాయి. ఇలా ఆర్డర్ ఇవ్వగానే... అలా ఫుడ్ తెచ్చి ఇస్తూ... ఈ యాప్స్ చక్కటి బిజినెస్ చేశాయి. ఐతే... ఆఫర్లు ఇచ్చినంతకాలం ఆర్డర్లు బాగానే వచ్చినా... ఇప్పుడు ఆఫర్లు తీసేయడంతో... ప్రజలు కూడా ఫుడ్ డెలివరీకి గుడ్ బై చెబుతున్నారు. ఇళ్ల నుంచీ తెచ్చుకోవడమో లేదంటే... చుట్టుపక్కల రెస్టారెంట్లకు వారే స్వయంగా వెళ్లడమో చేస్తున్నారు. ఫలితంగా ఫుడ్ డెలివరీ మార్కెట్... ప్రతీ నెలా 1 నుంచీ 2 శాతం పడిపోతోంది. ఆర్డర్ల సంఖ్య మాగ్జిమం 30 లక్షలకు మించట్లేదు. ఎంత ట్రై చేస్తున్నా ఆర్డర్ల సంఖ్య తగ్గిపోతోందే తప్ప పెరగట్లేదట. 18 నెలలుగా ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఆగస్ట్ నుంచీ అక్టోబర్ మధ్య మరింత ఎక్కువగా పడిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా ప్రజలు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డరిచ్చి కొనుక్కునేంత సాహసం చెయ్యట్లేదు. బయటకు వెళ్లి తింటే... తక్కువ ఖర్చుకే పనైపోతుందన్న భావనతో ఉంటున్నారు. అదే యాప్స్ ద్వారా ఆర్డర్ ఇస్తే... డెలివరీ ఛార్జీల మోత ఎక్కువైపోతోందని ఫీలవుతున్నారు. మొదట్లో డిస్కౌంట్లూ, ప్రమోషన్ కోడ్లూ ఇచ్చిన యాప్స్... ఇప్పుడు ఇవ్వట్లేదని కస్టమర్లు ఆసక్తి తగ్గించేసుకున్నారు. బయట తినడం కంటే... ఇంటి నుంచీ వండి తెచ్చుకోవడం బెటరనే ఫీలింగ్ కూడా వచ్చేస్తోంది చాలా మందిలో.

మిగతా యాప్స్ సంగతి ఎలా ఉన్నా తాము మాత్రం నెల నెలా కస్టమర్ల సంఖ్య పెంచుకుంటున్నామనీ, ఆర్డర్లు పెరుగుతున్నాయనీ స్విగ్గీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇదే విషయంపై జొమాటో, ఉబర్ ఈట్స్ మాత్రం స్పందించట్లేదు. సమస్యేంటంటే... కొత్త కస్టమర్లకు ఆఫర్లు వర్తిస్తున్నాయి. వాళ్లు ఆర్డర్లు ఇస్తున్నారు. పాత కస్టమర్లకు ఆఫర్లు లేకపోవడంతో... వాళ్లు డ్రాప్ అవుతున్నారు. కొత్త కస్టమర్లను సంపాదించుకోవడంలో స్విగ్గీ జోరుగా ఉంటున్నా... పాత కస్టమర్లను ఆపడం మాత్రం ఆ సంస్థకూ సాధ్యం కావట్లేదని తెలిసింది. త్వరలో అమెజాన్ కూడా ఫుడ్ డెలివరీ ప్రారంభిస్తామంటోంది. అసలే ఆ సంస్థ ఏం చేసినా భారీగా చేస్తుంది. అలాంటి సంస్థ ఎంటరైతే... మిగతా ఫుడ్ డెలివరీ సంస్థలకు మరిన్ని కష్టాలు తప్పవన్న వాదన వినిపిస్తోంది.

 

Pics : క్యూట్ సింగర్ షిర్లీ సెషియా అందాలు


ఇవి కూడా చదవండి :

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా... ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలుహైదరాబాద్‌లో మరో దారుణం... సాప్ట్‌వేర్ ఉద్యోగినిపై రేప్?

నేడు ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ సమావేశం, ఆర్టీసీపై చర్చ

Health Tips : పొట్ట తగ్గాలా... చెరుకు రసాన్ని ఇలా తాగితే సరి...

Health Tips : బరువు తగ్గాలా... అల్లంతో ఇలా చెయ్యండి
First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు