Bike Mileage: మీ బైక్ తక్కువ మైలేజీ ఇస్తుందా? అయితే, ఈ టిప్స్ పాటించి మైలేజీ పెంచుకోండి

ప్రతీకాత్మక చిత్రం

పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సమయంలో బైక్ మైలేజీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ద్వారా పెట్రోల్ ఖర్చును తగ్గించుకోవచ్చు. ఈ నేపథ్యంలో మీ బైక్ తక్కువ మైలేజ్ ఇస్తే ఈ టిప్స్ పాటించడం ద్వారా మైలేజ్ పెంచుకోవచ్చు.

  • Share this:
కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు ఎవరికైనా సరే ఈ రోజుల్లో బైక్​ వాడకం సర్వ సాధారణమైపోయింది. మధ్య తరగతి ప్రజలకు బైక్​ను మించిన వాహనం లేదు. అందుకే ఆటోమొబైల్​ మార్కెట్​లో బైక్​ల వాటా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు, కారుతో పోలిస్తే బైక్​ ఎక్కువ మైలేజీ ఇస్తుంది కనుక బైక్​ కొనడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, కొనుగోలు సమయంలో బైక్ లీటర్​కు 70 నుంచి 80 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీలు చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉండటం గమనార్హం. చాలా బైక్​లు లీటర్​కు కనీసం 40 కిలోమీటర్ల మైలేజీని కూడా ఇవ్వడం లేదని వినియోగదారులు వాపోతుంటారు. మరి ఈ మైలేజీ సమస్యను అరికట్టడం ఎలా? మైలేజీని పెంచేందుకు ఏం చేయాలి? అసలు ఏవైనా పరిష్కార మార్గాలున్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.
Amazon Smartphone Upgrade Days Sale: అమెజాన్ లో ఈ ఐదు ఫోన్లపై సూపర్ ఆఫర్లు.. ఈ ఒక్కరోజే ఛాన్స్.. వివరాలివే

ఇంజిన్ ఆయిల్​
ఇంజిన్​ బాగా పనిచేసేందుకు ఇంజినాయిల్​ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మంచి బ్రాండెడ్​ ఇంజిన్ ఆయిల్​నే వాడాలి. మార్కెట్​లో తక్కువ ధరకే లభిస్తుందని నాణ్యత లేని వాటిని వాడితే అది మీ బైక్ ఇంజిన్​ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.

రెగ్యులర్ సర్వీసింగ్
బైక్​ మైలేజీ తగ్గడానికి ప్రధాన కారణం రెగ్యులర్​గా సర్వీసింగ్ చేయించకపోవడం. చాలా మంది బిజీ వర్క్​లో పడి ఈ విషయాన్ని మర్చిపోతుంటారు. బైక్​లో ఏదైనా సమస్య తలెత్తితే తప్ప సర్వీసింగ్ చేయించరు. అలా కాకుండా రెగ్యులర్​గా సర్వీసింగ్​ చేయించాలి. తద్వారా ఇంజిన్​ సక్రమంగా పనిచేయడమే కాకుండా.. ఇంజిన్​ లైఫ్​ టైమ్​ కూడా పెరుగుతుంది. ఫలితంగా ఎక్కువ మైలేజీ ఇస్తుంది.

వేగాన్ని అదుపులో ఉంచాలి
కొన్ని ప్రత్యేక పరిస్థితులు, ప్రాంతాల్లో పరిమిత వేగంతో వెళ్లాలి. ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు వంటి జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తక్కువ స్పీడ్​తోనే వెళ్లాలి. మెట్రో నగరాలు, పట్టణాల్లో గంటకు 40 కిలోమీటర్లు మించి వెళ్లకూడదు. 40లోపు వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాలు తగ్గడమే కాకుండా మైలేజీ కూడా పెరుగుతుంది.

కార్బురేటర్​ మెయింటెనెన్స్​
ఒకవేళ, మీరు రెగ్యులర్​ సర్వీసింగ్​ చేయిస్తున్నప్పటికీ బైక్​ సరైన మైలేజీ ఇవ్వకపోతే.. కార్బురేటర్​ సెట్టింగ్స్​ చెక్​ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కార్బురేటర్ పనితీరును గమనిస్తూ రీ ట్యూనింగ్​ చేయించాలి. ఇది మీ ఇంజిన్​ పనితీరును మెరుగుపర్చి బైక్​ మైలేజీని పెంచుతుంది.

టైర్ ప్రెజర్
మీ బైక్​ టైర్లలో గాలి సరిగ్గా ఉందో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ముఖ్యంగా లాంగ్​ రైడ్​లకు వెళ్తున్నప్పుడు, దూర ప్రయాణాలు చేసేముందు టైర్​ ప్రెజర్​ను గమనించాలి. పెట్రోల్​ కొట్టించేముందు టైర్​ ప్రెజర్​ను చెక్​ చేసుకోవాలి.

రాష్ డ్రైవింగ్
చాలా మంది కొత్తగా బైక్​ తీసుకున్న కొన్ని రోజుల పాటు వేగంగా డ్రైవ్​ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ర్యాష్​ డ్రైవ్​ ధోరణి యువతలో ఎక్కువగా ఉంటుంది. ర్యాష్​ డ్రైవింగ్​ అనేది మీకు ప్రమాదకరమే కాకుండా మీ బైక్​కు కూడా నష్టాన్ని కలుగజేస్తుంది. దీర్ఘకాలంలో ఇంజిన్​ ప్రదర్శనపై ఇది ప్రభావం చూపిస్తుంది. అందువల్ల, ర్యాష్​ డ్రైవ్​కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

బైక్​ విడిభాగాలు మార్చడం
ఎంతో అవసరమైతే తప్ప బైక్​ విడి భాగాలను మార్చకూడదు. ఎందుకంటే వాహనం కొన్నప్పుడు ఒరిజినల్​ ప్రొడక్ట్స్ ను ఇంజిన్​కు తగినట్లుగా అమరుస్తారు. కానీ, చాలా మంది స్టైల్​ కోసం, కంఫర్ట్​ కోసం బండి డిజైన్​ను మార్చేస్తారు. ఇది ఇంజిన్​ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. పైన పేర్కొన్న విషయాలను తప్పకుండా పాటిస్తే మీ బైక్​ మైలేజీ పెరగడమే కాదు.. ఎక్కువ కాలం పనిచేస్తుంది.

ఇంజిన్​ ఆపాలి
నగరాల్లో నివసించేవారు ట్రాఫిక్​ సిగ్నల్స్​ వద్ద ఎక్కువ సేపు వేచి ఉండాల్సి రావచ్చు. అలాంటి సమయాల్లో ఇంజిన్​ ఆపేయాలి. తద్వారా మైలేజీ పెరుగుతుంది. 30 సెకన్ల కంటే ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వచ్చినప్పుడు ఇంజిన్​ ఆపేయడమే మంచిది. దీని వల్ల ఇంజిన్​కు విశ్రాంతి దొరకడంతో పాటు ఆయిల్​ ఆదా అవుతుంది. బైక్​ను కూడా ఎక్కువ సేపు ఎండలో పార్క్​ చేస్తే.. పెట్రోల్​, డీజిల్ లాంటి ఇంధనాలు ఆవిరైపోతాయి. తద్వారా, ఇంజిన్​ కెపాసిటీతో పాటు మైలేజీ తగ్గే అవకాశం ఉంది.
Published by:Nikhil Kumar S
First published: