మన దేశంలో ఆధార్ ఇప్పుడు ప్రతీ ప్రభుత్వ పనికి తప్పనిసరిగా మారింది. చివరికి కరోనా పరీక్షలకు, వ్యాక్సినేషన్ కు కూడా ఆధార్ నే గుర్తింపు కార్డుగా వినియోగిస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో UIDAI సైతం అనేక రకాల ఆధార్ సేవలను చాలా సులభతరం చేసింది. చాలా సేవలను ఆన్లైన్లోనే అందిస్తోంది. తాజాగా మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది యూఐడీఏఐ(UIDAI). అదే మాస్క్ ఆధార్. ఏంటి ఈ మాస్క్ ఆధార్ అని అనుకుంటున్నారా?. మాస్క్ ఆధార్ అంటే.. ఆధార్ నంబర్ పూర్తిగా కార్డుపై కనిపించదు. మొత్తం 12 అంకెల ఆధార్ నంబర్ పై మొదటి 8 నంబర్లు ఆధార్ కార్డుపై కనిపించవు. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఇతర వివరాలు అంటే పేరు, డేట్ ఆఫ్ బర్త్, చిరునామా, క్యూఆర్ కోడ్ తదితర వివరాలు ఎప్పటిలాగే కనిపిస్తాయి. అయితే ఈ మాస్క్ ఆధార్ కార్డును ఎవరైనా చూసినా.. వారికి నంబర్ తెలియకుండా ఉంటుంది. ఈ ఫీచర్ కార్డును మరింత సురక్షితంగా మారుస్తుంది.
ఈ ఆధార్ కార్డును ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..
-మాస్క్ ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలంటే మొదటగా https://eaadhaar.uidai.gov.in/ లింక్ పై క్లిక్ చేయాలి.
-లేదా https://uidai.gov.in/ ని ఓపెన్ చేసి.. అందులో ని ‘My Aadhaar’ విభాగం కింద, ‘Download Aadhar’ లింక్ పై క్లిక్ చేయాలి.
-అనంతరం Aadhaar Number, Enrolment ID(EID), Virtual ID(VID) ఏదో ఒక ఆప్షన్ ఎంచుకుని వివరాలు నమోదు చేయాలి.
#AadhaarTutorials
You can download your Masked Aadhaar or Regular Aadhaar online from:https://t.co/C190bWfd0U
You can use either: Aadhaar number, Your EID (enrolment ID), or Your Virtual ID (VID) to download your Aadhaar pdf.
To know more click:https://t.co/blaLymhhAk
- అనంతరం I want a masked aadhaar అనే ఆప్షన్ ను సెలక్ట్ చేయండి
-తర్వాత ‘‘Send OTP’’ ఆప్షన్ పై క్లిక్ చేయండి, అనంతరం మొబైల్ కు ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని నమోదు చేయాలి.
-అనంతరం Download Aadhaar పై క్లిక్ చేసి ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
-ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ masked aadhaarను డౌన్ లోడ్ చేసుకోండి.
-ఏమైనా సందేహాలుంటే పైన ఇచ్చిన వీడియోను చూసి నివృత్తి చేసుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.