• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • FOLLOW THESE TO AVOID PENALTY ON PREMATURE WITHDRAWAL OF FIXED DEPOSITS NS GH

Fixed Deposits: ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి గమనిక.. ఈ నిపుణుల సూచనలు పాటిస్తే లాభం.. తెలుసుకోండి

Fixed Deposits: ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి గమనిక.. ఈ నిపుణుల సూచనలు పాటిస్తే లాభం.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

కాలపరిమితి ముగియక ముందే ఫిక్స్డ్ డిపాజిట్లను విత్ డ్రా చేస్తే పెనాల్టీ చెల్లించక తప్పదు. కానీ ఈ పెనాల్టీ నుంచి తప్పించుకోవటానికి మార్గాలున్నాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 

  • Share this:
కాలపరిమితి ముగియక ముందే ఫిక్స్డ్ డిపాజిట్లను విత్ డ్రా చేస్తే పెనాల్టీ చెల్లించక తప్పదు. కానీ ఈ పెనాల్టీ నుంచి తప్పించుకోవటానికి మార్గాలున్నాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అసలు FD అంటేనే కనీసం 7 రోజల నుంచి 10 ఏళ్ల వరకు బ్యాంకులో దాచాల్సి రావటంతో అత్యవసర పరిస్థితుల్లో ఈ ఎఫ్డీని విత్ డ్రా చేసేందుకు మీరు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఇలా ఎఫ్డీలను బ్రేక్ చేసి ప్రీమెచ్యూర్ గా విత్ డ్రా చేసి పెనాల్టీ చెల్లించటం కంటే ఇదే ఎఫ్డీ డిపాజిట్ పై లోన్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇలా ఎఫ్డీ బ్రేక్ చేసి మీరు ఆ డబ్బును అవసరాలకు ఉపయోగించుకున్న తరువాత కొంత కాలానికి మీ చేతిలో డబ్బు ఉన్నప్పటికీ ఆ సమయంలో వడ్డీ రేట్లు మారి ఉండవచ్చు. కాబట్టి బ్యాంకులు కల్పించిన లోన్ల సదుపాయాన్ని ఉపయోగించటం స్మార్ట్ చాయిస్ గా నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎఫ్డీలపై చెల్లించే వడ్డీ కంటే ఈ రుణంపై వసూలు చేసే రుణం ఒకటి లేదా రెండు శాతం ఎక్కువ ఉండవచ్చు. అయితే ఇది ఒక్కో బ్యాంకులో ఒక్కో వడ్డీ రేటు ఉంటుంది కనుక మారుతూ ఉంటుంది.

మరోవైపు పర్సనల్ లోన్ కు బదులు ఇలా ఎఫ్డీపై తీసుకునే రుణంపై మీరు కట్టే వడ్డీ రేటు చాలా తక్కువ కనుక ఇది అత్యుత్తమ మార్గం. వ్యక్తిగత రుణంపై వసూలు చేసే వడ్డీ రేట్లు ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఈ వడ్డీ రేటును ఎఫ్డీలపై తీసుకునే రుణంపై వసూలు చేసే వడ్డీతో పోల్చితే మరీ ఎక్కువ. అలాంటప్పుడు వ్యక్తిగత రుణాలు తీసుకోవటం, ఎఫ్డీలను లిక్విడేట్ చేయటం ఎందుకు.. మీరు దాచుకున్న ఎఫ్డీపైనే రుణం తీసుకుంటే సరిపోతుంది.

స్వీప్ ఇన్ ఎఫ్డీ అకౌంట్..
స్వీప్ ఇన్ ఎఫ్డీ అకౌంట్ నే 2-ఇన్-1 అకౌంట్ అంటారు. దీన్నే మనీ మల్టిప్లయర్ అని కూడా అంటారు. ఈ అకౌంట్ తో ఎఫ్డీపై చెల్లించే వడ్డీతో పాటు మీకు అవసరమైన లిక్విడ్ చేతికి అందుతుంది. సేవింగ్స్ అకౌంట్ వల్ల లిక్విడిటీ బెనిఫిట్స్ కూడా ఇన్వెస్టర్లు పొందాలంటే ఈ స్వీప్ ఇన్ ఎఫ్డీ ఉత్తమ ఎంపిక. ప్రీమెచ్యూర్ విత్ డ్రాయల్ వల్ల మీరు పెనాల్టీ చెల్లించకుండా, మీ అసరాలు తీర్చుకునేందుకు చేతికి డబ్బు సకాలంలో అందేలా చేస్తుంది.

స్మార్ట్ గా ఆప్ట్ చేసుకోండి..
మరో మార్గం ఏమిటంటే మీరు ఎఫ్డీ చేసేప్పుడు ఒకే అకౌంట్ లో మొత్తం అమౌంట్ ను జమ చేయకుండా వివిధ రకాల కాలపరిమితులను ఎంచుకోవడం మరో ప్రత్యామ్నాయ మార్గం. అంటే 1, 3, 5 ఏళ్ల కాలపరిమితి ఉన్న ఎఫ్డీలను ఎంచుకుని మీరు చేయాలనుకున్న పొదుపును ఇలా వేర్వేరు టెన్యూర్లలో చేస్తే రుణం తీసుకునే అవసరాలే తలెత్తవు. చాలామంది తమ వద్ద ఓ 5 లక్షల రూపాయలు ఉంటే దాన్ని మొత్తం ఓ ఐదేళ్ల పాటు ఎప్డీ చేసి దాచుతారు. దీని బదులు ఓ లక్షను ఏడాది ఎఫ్డీగా, మరో 2 లక్షల రూపాయలను 3 ఏళ్ల ఎఫ్డీగా, ఇంకో 2 లక్షల రూపాయలను 5 ఏళ్ల ఎఫ్డీగా జమచేస్తే అవసరాలకు లిక్విడ్ మీకు అందుతూ పోతుంది. కాబట్టి డిపాజిటర్లు తమ డబ్బును డిపాజిట్ చేసే సమయంలో కేవలం వడ్డీ రేటు మాత్రమే కాకుండా ఈ టెన్యూర్ ను స్మార్ట్ గా ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఇక మీకు మెచ్యూర్ అయిన మొత్తంతో అవసరం లేదనుకుంటే మళ్లీ రెన్యువల్ చేస్తే సరిపోతుంది.

SBI..
ఫిక్డ్స్ డిపాజిట్ లోన్లపై ప్రాసెసింగ్ ఫీ అసలు లేకుండానే, ప్రీ పేమెంట్ పెనాల్టీస్ లేకుండా ..డైలీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీను స్టేట్ బ్యాంక్ State Bank of India (SBI) వసూలు చేస్తుంది. ఫిక్డ్స్ డిపాజిట్లపై ఈ బ్యాంకు ఒకశాతం వడ్డీ లేదా అంతకంటే కాస్త ఎక్కువ వడ్డీ వసూలు చేస్తోంది. ఇక మరికొన్ని బ్యాంకుల్లో మీరు ఎఫ్డీ చేసిన మొత్తంలో 90శాతం మొత్తాన్ని లోనుగా ఇస్తాయి.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు