ఇండియాలో చాలా మందికి జీవితంలో ఒక సొంత ఇంటికి యజమాని (Dream House) కావాలనే కల ఉంటుంది. ఇంతకు ముందు తరాలలో చాలా ఆలస్యంగా ఈ కోరిక తీరేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గృహ రుణాల (Home Loans) సాయంతో ఇప్పటి తరం చాలా త్వరగా సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. కానీ సమస్య ఏమిటంటే.. చాలా మంది తెలిసో.. తెలియకో ఇంటిని కొనుగోలు చేసేసి ఇబ్బందుల్లో పడుతున్నారు. రెంట్ కట్టడం డబ్బును వృథా చేయడం అనే సామాజిక ఒత్తిడి సాధారణంగా ప్రజలను ఇంటిని కొనుగోలు చేయాలనే వైపు నెడుతోంది. ఇంటిని ఎప్పుడు కొనుగోలు చేయవచ్చు? లోన్ తీసుకోవడం మంచిదేనా? వంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం.
ఇటీవల గృహ రుణ రేట్లు చాలా పడిపోయాయి. 6.5 శాతం అనేది పోస్ట్-టాక్స్ రేట్లను పరిగణనలోకి తీసుకుంటే ఇంకా తక్కువ. తక్కువ రుణ రేట్లు కారణంగా లోన్ తీసుకొని ఇల్లు కొనగలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వివిధ కారణాల వల్ల భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పాలసీ రేటు పెంపుదలతో గృహ రుణ రేట్లను దాదాపు 8.5 శాతానికి పెరిగాయి. ఇంకా రేట్లు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి రుణాలపై పూర్తిగా ఆధారపడి ఇంటిని కొనుగోలు చేయడం సులువుకాదు.
PAN Card: వారి పాన్ కార్డ్ చెల్లదు... ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక
భావోద్వేగాలను పక్కన పెడితే, ఇంటి కొనుగోలు నిర్ణయం ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ఎంత డౌన్ పేమెంట్ చెల్లించగలరు?, రెండు ఎంత EMI చెల్లించగలరు?
హోమ్ లోన్ని ఎంచుకున్నప్పుడు, రుణదాత కస్టమర్ దాదాపు 20 శాతం పెట్టాలని కోరుకుంటారు. రూ.75 లక్షలతో ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే, కస్టమర్ రూ.15 లక్షలు (20 శాతం) సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు రూ.15 లక్షలను ఏర్పాటు చేసుకోలేకపోతే.. కేవలం రూ. 12 లక్షలు ఉంటే, బ్యాంక్ గృహ రుణంగా రూ.48 లక్షలు మాత్రమే ఇస్తుంది. కాబట్టి హోమ్ లోన్ బడ్జెట్ రూ.60 లక్షలు ఉండాలి. ఇక్కడ కోరుకున్న విధంగా రూ.75 లక్షలు సాధ్యం కాదు.
Bank Charges: ఆ అకౌంట్ ఉన్నవారికి డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు
రుణదాతలు నెలవారీ ఆదాయంలో 40 శాతం EMIగా చెల్లించేలా రుణాన్ని ఇస్తారు. ఇందులో అన్ని రకాల ఈఎంఐలను లెక్కిస్తారు. నెలవారీ ఆదాయం రూ.80,000 అయితే.. రూ.75 లక్షల ఇంటి కోసం 20 శాతం డౌన్‌పేమెంట్ కోసం రూ. 15 లక్షలను ఏర్పాటు చేయగలిగితే, రుణదాత 40 శాతం EMI/ఆదాయ నియమానికి సరిపోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో 40 శాతం నెలకు రూ.32,000 అవుతుంది. 20 సంవత్సరాల లోన్ కాలవ్యవధికి 8 శాతం వడ్డీ లెక్కిస్తే రూ.39- రూ.40 లక్షలు మాత్రమే చెల్లించగలరు. కాబట్టి రూ.40 లక్షల లోన్, రూ.15 లక్షల డౌన్ పేమెంట్ ఇప్పటికీ రూ.75 లక్షల ఇంటికి సరిపోదు.
మరింత డౌన్‌పేమెంట్ సిద్ధం చేసుకోవడం ద్వారా లోన్ లభిస్తుంది. లేదా తక్కువ ఖర్చుతో కూడిన ఇంటిని ఎంచుకోవాలి. ఇంట్లోని భార్యా, భర్త సంపాదిస్తుంటే.. రుణ అర్హతను పెంచుకోవడానికి జాయింట్ లోన్ తీసుకోవచ్చు.
Wedding Insurance: వివాహ వేడుకకూ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు... రూల్స్ ఇవే
డౌన్ పేమెంట్ కోసం పొదుపు చేసిన మొత్తాన్ని ఉపయోగించడం సరైన పనికాదు. ఎల్లప్పుడూ అత్యవసర పరిస్థితుల కోసం కొంత డబ్బును దాచి ఉంచాలి. ఇన్సూరెన్స్ కవర్ చేసిన అంశాలకు డబ్బు అవసరం అవుతుంది. ఏదైనా సమస్యతో కొంత కాలం ఉద్యోగాన్ని కోల్పోతే ఏం చేయాలి? ఆదాయం ఆగిపోయినప్పుడు.. ఈఎంఐలు చెల్లించడం కష్టమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో సేవ్ చేసిన డబ్బు ఉపయోగపడుతుంది. నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే.. EMIలకు మాత్రమే కాకుండా, ఇంటిని స్వాధీనం చేసుకునే వరకు చెల్లించే అద్దెకు కూడా డబ్బు కేటాయించాలని గుర్తించాలి. సామాజిక ఒత్తిడితో ఇంటి కొనుగోలు నిర్ణయానికి రాకూడదు. అన్ని రకాలుగా సిద్ధమైనప్పుడే ముందడుగు వేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Home loan, Housing Loans, Personal Finance