HOME »NEWS »BUSINESS »follow these tips for to get home loans with lowest interest rates ns gh

Home loans: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే.. తక్కువ వడ్డీకే రుణాలు పొందండిలా..

Home loans: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే.. తక్కువ వడ్డీకే రుణాలు పొందండిలా..
ప్రతీకాత్మక చిత్రం

వడ్డీ రేట్లను బట్టి హోమ్‌ లోన్‌ను ఇచ్చే సంస్థలను ఎంచుకోవాలంటున్నారు. తక్కువ డబ్బుతో ఆస్తులను కొనుగోలు చేసే సాధనమైన హోమ్ లోన్‌ను ‘హెల్తీ లోన్’ అంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఉంటాయి.

  • Share this:
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అతి తక్కువ హోమ్ లోన్ రేట్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వడ్డీ రేట్లను బట్టి హోమ్‌ లోన్‌ను ఇచ్చే సంస్థలను ఎంచుకోవాలంటున్నారు. తక్కువ డబ్బుతో ఆస్తులను కొనుగోలు చేసే సాధనమైన హోమ్ లోన్‌ను ‘హెల్తీ లోన్’ అంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గడం, కరోనా తరువాత ప్రాపర్టీలకు డిమాండ్ పెరగడం, బిల్డర్లు ఆఫర్లు ఇస్తుండటంతో హోమ్ లోన్‌లను ఎంచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలో హౌసింగ్ ప్రాజెక్టులు నిర్మాణాలను వాయిదా వేసేలా కనిపిస్తున్నాయి. అందువల్ల కస్టమర్లు రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీని కొనుగోలు చేయడం మంచిదని ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్‌ సూచిస్తున్నారు. రిటైల్ లోన్స్‌పై వడ్డీ రేట్లను తగ్గించాలని లిస్టెడ్ కమర్షియల్ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో 2019 అక్టోబరు నుంచే వీటికి సంబంధించిన బెంచ్ మార్క్ అమల్లో ఉంది. కొన్ని కమర్షియల్ బ్యాంకులు ఆర్బిఐ రెపో రేటును ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్‌గా నిర్దేశించుకున్నాయి. ప్రస్తుతం కొన్ని కమర్షియల్ బ్యాంకులు కస్టమర్లకు అతి తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్లను అందిస్తున్నాయి.

తక్కువ వడ్డీ ఎలా పొందవచ్చు?


అతి తక్కువ వడ్డీతో హోమ్ లోన్ పొందడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఎలాంటి లోన్‌కైనా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కస్టమర్ల క్రెడిట్ స్కోరునే ఆధారంగా తీసుకుంటాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేటు కంటే ఎక్కువగా నిర్దేశించే అవకాశం ఉంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించే కస్టమర్లకు మెరుగైన క్రెడిట్ స్కోరు ఉంటుంది. వీరికి తక్కువ వడ్డీతో లోన్ లభించే అవకాశం ఉంది. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నవారికి హోమ్‌ లోన్ వడ్డీ రేట్లు ఎక్కువగా విధించవచ్చు. అందువల్ల క్రెడిట్ స్కోరు కనీసం 900 ఉండేలా ముందునుంచి జాగ్రత్తలు తీసుకోవాలి.

మహిళల పేరుతో తీసుకోవాలి
సాధారణంగా జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా హోమ్ లోన్ తీసుకుంటూ, వారిని ప్రైమరీ అప్లికెంట్‌గా పేర్కొంటే తక్కువ రేటుతో హోమ్ లోన్ పొందవచ్చు. చాలా బ్యాంకులు మహిళలకు తక్కువ వడ్డీ రేటుతో హోమ్ లోన్లను అందిస్తాయి. అందువల్ల వారినే ప్రైమరీ అప్లికెంట్‌గా పేర్కొని లబ్ధి పొందవచ్చు. ప్రస్తుత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ఎక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇస్తుంటే, తక్కువ వడ్డీ విధించే ఇతర సంస్థకు లోన్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కానీ చెల్లించాల్సిన వడ్డీ మొత్తంలో ఎక్కువ తేడాలు ఉంటేనే ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. హోమ్ లోన్ అమౌంట్ పెరిగేకొద్దీ రుణదాతలకు క్రెడిట్ రిస్క్ కూడా పెరుగుతుంది. అందువల్ల సంస్థలు అధిక వడ్డీ రేటును విధిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని, డౌన్ పేమెంట్ ఎక్కువగా చెల్లిస్తూ, లోన్ అమౌంట్ తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫలితంగా వడ్డీ రేటు కూడా తగ్గుతుంది.
Published by:Nikhil Kumar S
First published:January 08, 2021, 20:38 IST