Home /News /business /

FOLLOW THESE TEN BEST TIPS TO SAVE YOUR MONEY NS

Money Saving Tips: డబ్బులు ఆదా చేసుకోవడానికి 10 టిప్స్.. తప్పక పాటించండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కారణంగా ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే.. ఈ పది చిట్కాలను పాటించి డబ్బులను ఆదా చేసుకోండి.

  కరోనా నేపథ్యంలో అనేక మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. లక్షలు, వేలల్లో వేతనాలు ఉన్న అనేక మంది ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోవడంతో ఏం చేయాలో అర్థం కాక అవస్థలు పడుతున్నారు. వ్యాపాస్థులు సైతం లాక్ డౌన్ తో ఆదాయాన్ని కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. దినసరి కూలీలకు సైతం ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ఇలాంటి వారు ఇబ్బందులు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని వారు సైతం ఖర్చులు తగ్గించి పొదుపు చేయడం ద్వారా భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చని వారు సూచిస్తున్నారు వారు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి.

  1. బయటకు వెళ్లినప్పుడు వాటర్ బాటిల్ కొనడం దాదాపు అంతా చేసే పనే. అయితే ఎక్కడికైనా వెళ్లే సమయంలో వెంట వాటర్ బాటిల్ తీసుకు వెళ్తే.. డబ్బులను సేవ్ చేసుకోవడంతో పాటు.. ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

  2. ప్రయాణాలు చేసినప్పుడు స్నాక్స్ కూడా కొంటూ ఉంటాం. అయితే.. ఈ కరోనా సమయంలో ఇంటి నుంచి స్నాక్స్ కూడా తీసుకెళ్తే మనీ సేవ్ అవడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ కరోనా సమయంలో ఇంటి ఆహారం మేలని వైద్యులు చెబుతున్నారు.

  3. మద్యం మరియు ధూమపానం మానేస్తే వారానికి సరాసరిగా రూ. 800 నుంచి రూ. 1000 వరకు ఆదా చేయొచ్చు.

  4. లాక్ డౌన్ తో అంతా ఇళ్లల్లోనే ఉంటుండడంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే.. జాగ్రత్తగా వ్యవహరిస్తే విద్యుత్ వినియోగాన్ని 30 శాతం మేర తగ్గించవచ్చు. సాధారణంగా అన్ని గదులల్లో లైట్లు, ఫ్యాన్లు ఆన్ చేసి ఉంచడం చాలా మందికి అలవాటు. అలా చేయకుండా ఎప్పటికప్పుడు ఎవరూ లేని రూంలలో లైట్లను, ఫ్యాన్లను ఆఫ్ చేయాలి. ఇంకా హీటర్, వాటర్ కు సబంధించిన మోటార్ లు లాంటివి ఆన్ చేసి మర్చిపోతూ ఉంటాం. వాటిని ఆన్ చేయగానే నిర్ణీత సమయానికి అలారం పెట్టుకోవాలి. విద్యుత్ ని తక్కువగా వినియోగించుకునే కొత్త కొత్త లైట్లు, పరికరాలు వచ్చాయి. ప్రస్తుతం వాడుతున్న వాటి స్థానంలో ఆ పరికరాలను వాడుకోవాలి.

  6. కూరగాయలు.. ఇటీవలి కాలంలో కూరగాయలను పెద్ద బ్రాండ్ ఉన్న దుకాణాల్లో కొనడం అధికమైంది. అక్కడ అధికంగా ధరలు ఉంటాయి. దీనికి బదులుగా మార్కెట్లో కొనడం ద్వారా తక్కువ ధరకు, నాణ్యమైనవి లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా మనతో పాటు చిన్న చిన్న అమ్మకం దారులకు కూడా మేలు చేకూరుతుంది.

  7. రీఛార్జ్ ఆఫర్లు: స్మార్ట్ ఫోన్ వాడే వారిలో అనేక మంది వ్యాలిడిటీ, డేటా ఇలా ఏదో ఓ అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. రీఛార్జ్ చేసుకునే సమయంలో మనం ఎంత డేటా వాడుతాం.. కాల్స్ ఎంత మేర మాట్లాడుతాం తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మనం డేటా చాలా తక్కువ వాడితే అందుకు తగిన ప్లాన్ ను ఎంచుకోవాలి. దీంతో ప్లాన్ ఖర్చు తగ్గుతుంది.

  8. వాహనాలు: ప్రయాణాలు చేసే సమయంలో ఖర్చును చాలా తగ్గించుకోవచ్చు. అనవసరంగా ఒక్కరికే కారును వాడడం ఖర్చుతో పాటు కాలుష్యాన్ని కూడా పెంచుతుంది. ఇలాంటి సమయంలో బైక్ వాడడం మేలు. కుదిరనప్పుడు ప్రజా రవాణాను కూడా వాడడం వలన ఖర్చును తగ్గించుకోవచ్చు.

  9. బిల్లు చెల్లింపు: ఈ-వ్యాలెట్లు హల్ చల్ చేస్తున్న రోజులువి. ఈ తరుణంలో కరెంటు బిల్లు, ఫోన్ బిల్, క్రెడిట్ కార్డు బిల్, గ్యాస్ బుకింగ్, సినిమా టికెట్ల బికింగ్ ను ఈ వ్యాలెట్ ల ద్వారా చేయడం ద్వారా క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ను పొందొచ్చు. పెట్రోల్ బంకుల్లోనే ఫోన్ పే లాంటి యాప్ ల ద్వారే పే చేస్తే క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ కామర్స్ వెబ్ సైట్లలో ఏదైనా వస్తువును కొనుగోలు చేసే సమయంలో ఆ వస్తువుకు సంబంధించిన ఆఫర్లను పూర్తిగా చెక్ చేసుకోవాలి. ఉదాహరణకు ఎస్బీఐ కార్డుతో క్యాష్ బ్యాక్ లభిస్తుందని తెలిస్తే ఆ కార్డు ఉన్న ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని పేమెంట్ చేస్తే తగ్గింపును అందుకోవచ్చు.

  10. ఫుడ్ డెలివరీ యాప్ లలో ఆర్డర్ చేసిన సమయంలోనూ ఆఫర్లను చెక్ చేయాలి. బెస్ట్ ఆఫర్ ను ఎంచుకుంటే సాధ్యమైనంత మేర తగ్గింపును అందుకోవచ్చు.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bussiness Tips, Money, Save Money

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు