మీరు ఎక్కువగా ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుంటారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎంకు ఎక్కువగా వెళ్తుంటారా? రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి. మీరు రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే. ఎస్‌బీఐ ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్‌ను ఈ ఏడాది జనవరి 1న ప్రారంభించింది. ఎస్‌బీఐకి చెందిన అన్ని ఏటీఎంలల్లో ఈ సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ఎవరైనా రూ.10,000 కన్నా ఎక్కువ డబ్బులు డ్రా చేయాలంటే తప్పనిసరిగా ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే. అయితే ఇప్పటికీ ఈ సెక్యూరిటీ ఫీచర్‌పై ఎస్‌బీఐ ఖాతాదారులకు అవగాహన తక్కువే. మరి ఎస్‌బీఐ ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
An all new OTP based cash withdrawal system has been in effect since 1st Jan 2020 at all our ATMs. Protect yourself from unauthorized transactions across all SBI ATMs from 8 PM to 8 AM.#SBI #StateBankOfIndia #ATM #OTP #Safety #TransactSafely #SBIATM #Cash #Withdrawal pic.twitter.com/5aJL93Re7Z
— State Bank of India (@TheOfficialSBI) July 10, 2020
ముందుగా ఏటీఎంలో మీ కార్డు స్వైప్ చేయాలి.
రూ.10,000 లోపు ఓటీపీ అవసరం లేదు.
రూ.10,000 కన్నా ఎక్కువ అమౌంట్ ఎంటర్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఏటీఎం స్క్రీన్ పైన ఓటీపీ విండో ఓపెన్ అవుతుంది.
అందులో మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.
మీరు సరైన ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అవుతాయి.
కార్డు మోసాలను తగ్గించేందుకు తగ్గించేందుకు అదనంగా ఆథెంటిఫికేషన్ ప్యాక్టర్‌ను యాడ్ చేసింది ఎస్‌బీఐ. ఒకవేళ కార్డు పోగొట్టుకున్నా మీ కార్డుతో ఎవరైనా డబ్బులు డ్రా చేయడానికి ట్రై చేస్తే మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అయితే రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్ పనిచేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ATM, Bank, Banking, Business, BUSINESS NEWS, Personal Finance, Sbi, State bank of india