ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా? అప్‌లోడ్ చేసే ప్రాసెస్ ఇదే

ITR Filing Process | ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ముందు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంకు అకౌంట్ వివరాలు, ఫామ్ 16, మీ పెట్టుబడుల సమాచారం మీ దగ్గర సిద్ధంగా ఉంచుకోవాలి.

news18-telugu
Updated: July 12, 2019, 11:17 AM IST
ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా? అప్‌లోడ్ చేసే ప్రాసెస్ ఇదే
ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా? అప్‌లోడ్ చేసే ప్రాసెస్ ఇదే (News18 Creative by Mir Suhail)
news18-telugu
Updated: July 12, 2019, 11:17 AM IST
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సీజన్ మొదలైంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. గడువు దగ్గరపడుతుండటంతో ట్యాక్స్ పేయర్స్‌లో హడావుడి మొదలైంది. ప్రస్తుతం 2018-19 ఆర్థిక సంవత్సరం (అసెస్‌మెంట్ ఇయర్ 2019-20) ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. జూలై 31 వరకు గడువు ఉంది కదా అని చివరి నిమిషంలో కంగారుపడకుండా ముందే జాగ్రత్తగా, తప్పులు లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం మంచిది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ముందు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంకు అకౌంట్ వివరాలు, ఫామ్ 16, మీ పెట్టుబడుల సమాచారం మీ దగ్గర సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాతే ఆన్‌లైన్‌లో రిటర్న్స్ ఫైల్ చేయడం మొదలుపెట్టాలి. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ప్రాసెస్ పార్ట్-ఏ, పార్ట్-బీ అని రెండు భాగాలుగా ఉంటుంది. మరి ఆ ప్రాసెస్ తెలుసుకోండి.

ITR Filing: Part-A


ముందుగా www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. Download సెక్షన్‌లో IT Return Preparation Software పైన క్లిక్ చేయండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి. అసెస్‌మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసి ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ అయిన జిప్ ఫైల్‌లో ఐటీఆర్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్‌లో మీ ఆదాయం, పన్ను చెల్లింపులు, డిడక్షన్స్ లాంటి వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయండి. వాటితో పాటు వ్యక్తిగత వివరాలు, పన్ను చెల్లింపులు లేదా టీడీఎస్ లాంటివి ఎంటర్ చేయండి. వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేశారో లేదో ఓసారి సరిచూసుకోవడం మంచిది. డేటా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత 'Calculate' పైన క్లిక్ చేయండి. మీరు చెల్లించాల్సిన పన్ను లేదా రీఫండ్ వివరాలు తెలుస్తాయి. ఒకవేళ పన్ను చెల్లించాల్సి ఉంటే వెంటనే పన్ను చెల్లించేయండి. ఆ తర్వాత మళ్లీ వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేసి 'Calculate' చేయాలి. మీరు చెల్లించాల్సిన పన్ను సున్నా వచ్చేవరకు ఈ ప్రాసెస్ చేయాలి. తర్వాత జెనరేట్ పైన క్లిక్ చేసి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ డేటాను XML ఫార్మాట్‌లో కంప్యూటర్‌లో సేవ్ చేయాలి.

ITR Filing: Part-B


ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఇ-ఫైల్‌లోకి వెళ్లి 'Upload Return' పైన క్లిక్ చేయాలి. ఐటీఆర్ వివరాలు, అసెస్‌మెంట్ ఇయర్ సరిగ్గా సెలెక్ట్ చేయాలి. పార్ట్-ఏలో సేవ్ చేసిన ఎక్స్ఎంఎల్ ఫైల్ అప్‌లోడ్ చేయాలి. దాంతో పాటు మీ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్-DSC అప్‌లోడ్ చేయాలి. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ఇ-ఫైలింగ్‌తో రిజిస్టరై ఉండటం తప్పనిసరి. చివరగా సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ఉపయోగించకపోతే ITR-V కనిపిస్తుంది. ITR-V డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకవేళ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్‌తో ఐటీఆర్ ఫైల్ చేస్తే రిటర్న్ ఫైలింగ్ పూర్తయినట్టే. ఒకవేళ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయకపోతే ITR-V ప్రింట్ తీసుకొని, సంతకం చేసి 120 రోజుల్లో సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌కు పంపాలి.



Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో

Loading...
ఇవి కూడా చదవండి:

PAN-Aadhaar Link: ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డు చెల్లదు... ఆగస్ట్ 31 డెడ్‌లైన్

Passport: పాస్‌పోర్ట్‌కు అప్లై చేస్తున్నారా? ఈ నకిలీ సైట్లతో జాగ్రత్త

Good News: ఆధార్ కాంటెస్ట్ గడువు పొడిగింపు... రూ.30,000 గెలుచుకోండి ఇలా
First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...