హోమ్ /వార్తలు /బిజినెస్ /

WhatsApp Pay: వాట్సాప్ పే వాడుతున్నారా? రూ.51 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇలా గెలుచుకోండి

WhatsApp Pay: వాట్సాప్ పే వాడుతున్నారా? రూ.51 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇలా గెలుచుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

డిజిటల్ (Digital) చెల్లింపుల యాప్స్‌లో కూడా పై వరుసలో నిలవాలని వాట్సాప్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా అత్యంత ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది.

మెసేజింగ్ అప్లికేషన్లలో ఎదురులేని యాప్‌గా వాట్సాప్ (WhatsApp) ఏక ఛత్రాధిపత్యం వహిస్తోన్నప్పటికీ.. పేమెంట్ యాప్స్‌ (Payment apps)కు మాత్రం వీసమెత్తు పోటీ ఇవ్వలేకపోతోంది. అయితే డిజిటల్ (Digital) చెల్లింపుల యాప్స్‌లో కూడా పై వరుసలో నిలవాలని వాట్సాప్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా అత్యంత ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఆఫర్ (Offer) ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే అవైలబుల్ లో ఉంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.21.20.3 యాప్‌లో ‘గివ్‌ క్యాష్‌, గెట్‌ రూ.51’ అనే బ్యానర్ కనిపిస్తోంది. త్వరలోనే ఇది అందరి యూజర్ల (Users)కు అందుబాటులోకి రావచ్చని సమాచారం.

ఐదు వేర్వేరు కాంటాక్టులకు..

ఈ ఆఫర్ ప్రకారం బీటా యూజర్లు తమకు నచ్చిన ఐదు వేర్వేరు కాంటాక్టులకు (5 different contacts) డబ్బులు సెండ్ చేసి రూ.51 క్యాష్‌బ్యాక్‌ను అందుకోవచ్చు. అయితే ఫలానా మొత్తంలో డబ్బులు సెండ్ (send) చేయాలని వాట్సాప్ ఎలాంటి నిబంధనలు తీసుకురాలేదు. దీని అర్థం యూజర్లు కేవలం రూ.1 తన స్నేహితుడికి పంపించినా.. రూ.51 క్యాష్‌బ్యాక్‌ (cash back)ను సంపాదించవచ్చు. గరిష్ఠంగా మొదటి ఐదు లావాదేవీ (transactions)లకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది కాబట్టి యూజర్లు ప్రతి లావాదేవీకి రూ.51 చొప్పున మొత్తం రూ. 255 క్యాష్‌బ్యాక్‌ (cash back)ను సొంతం చేసుకోవచ్చు. పేమెంట్ (payment) పూర్తయిన క్షణాల్లోనే క్యాష్‌బ్యాక్‌ మొత్తం అకౌంట్‌లో జమ అవుతుంది. ఈ అమౌంట్ యూజర్ వాట్సాప్ పే సర్వీస్‌తో రిజిస్టర్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్‌ (bank account)లో జమ అవుతుంది.

యూజర్ల సంఖ్యను పెంచుకోవాలని..

ఈ క్యాష్‌బ్యాక్‌ గూగుల్ పే (google pay) తన ప్రారంభ దశలోనే తీసుకొచ్చిన ఆఫర్ ను పోలి ఉంటుంది. అప్పట్లో గూగుల్ పే స్క్రాచ్ కార్డు (scratch card) రూపేణా ఆఫర్స్ ప్రకటించిన పెద్ద ఎత్తున యూజర్లను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వాట్సప్ పే కూడా అదే తరహాలో యూజర్ల సంఖ్యను పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.

వాట్సాప్ చాట్ ఓపెన్ చేసి..

యూజర్లు వాట్సాప్ పే సెటప్ (WhatsApp pay set up) చేసుకోవడం చాలా సులభం. ఇందుకు యూజర్లు మొదటగా ఏదైనా వాట్సాప్ చాట్ ఓపెన్ చేసి.. మెసేజ్ కంపోజ్ బాక్స్ లో కనిపిస్తున్న రూపీ(₹) ఐకాన్ (Icon) పై క్లిక్ చేయాలి. తరువాత పేమెంట్ మెథడ్ సెలక్షన్ కొరకు "get started" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఆపై మీ స్క్రీన్ పై బ్యాంక్ నేమ్స్ ఒక లిస్టులా కనిపిస్తాయి. అయితే మీ వాట్సాప్ నంబర్ అనేది మీ బ్యాంకుతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ అయ్యి ఉండాలి. బ్యాంకు సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అయిన తర్వాత వెరిఫికేషన్ (verification) నిమిత్తం ఒక మెసేజ్ అందుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికే యూపీఐ పిన్ (UPI PIN) కలిగి ఉన్నట్లయితే.. ఆ పిన్ ఎంటర్ చేస్తే వాట్సాప్ పే సర్వీస్ యాక్టివేట్ (Activate) అవుతుంది. ఒకవేళ మీరు మొదటిసారి యూపీఐ (UPI) వాడుతున్నట్లయితే కొత్తగా పిన్ సెటప్ (PIN setup) చేసుకోవాల్సి ఉంటుంది.

First published:

Tags: BUSINESS NEWS, Cash, Whatsapp

ఉత్తమ కథలు