హోమ్ /వార్తలు /బిజినెస్ /

Insurance Claim: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఆలస్యం అవుతుందా..? ఇవి పాటిస్తే ఫాస్ట్‌గా అయ్యే ఛాన్సెస్..!!

Insurance Claim: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఆలస్యం అవుతుందా..? ఇవి పాటిస్తే ఫాస్ట్‌గా అయ్యే ఛాన్సెస్..!!

ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఆలస్యం అవుతుందా..?

ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఆలస్యం అవుతుందా..?

ప్రజలు సాధారణంగా వేగవంతంగా పనులు పూర్తి కావాలని కోరుకుంటారు. సేవలు కూడా వేగంగా అందాలని భావిస్తుంటారు. ఇదే ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు సెటిల్‌మెంట్‌లకు వర్తిస్తుంది. ఇన్సూరెన్స్‌ అనేది నష్టాన్ని భర్తీ చేసేదిగా భావిస్తారు. అందువల్ల, నష్టపోయినప్పుడు, తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వీలైనంత త్వరగా క్లెయిమ్ సెటిల్‌ కావాలని కోరుకుంటారు.

ఇంకా చదవండి ...

ప్రజలు సాధారణంగా వేగవంతంగా పనులు పూర్తి కావాలని కోరుకుంటారు. సేవలు కూడా వేగంగా అందాలని భావిస్తుంటారు. ఇదే ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు సెటిల్‌మెంట్‌లకు వర్తిస్తుంది. ఇన్సూరెన్స్‌ అనేది నష్టాన్ని భర్తీ చేసేదిగా భావిస్తారు. అందువల్ల, నష్టపోయినప్పుడు, తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వీలైనంత త్వరగా క్లెయిమ్ సెటిల్‌ కావాలని కోరుకుంటారు. కొన్ని సమయాల్లో డబ్బు కోసం వేచి ఉండటం కష్టంగా ఉంటుంది. అయితే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు ఆలస్యం కావడానికి అత్యంత సాధారణ కారణాలు, ఆలస్యాన్ని నివారించడానికి మార్గాలను తెలుసుకుందాం.

* అవసరమైన పత్రాలను సమర్పించకపోవడం

క్లెయిమ్ ప్రాసెసింగ్ కోసం అవసరమైన అన్ని పత్రాలను అర్థం చేసుకోవడం, ఏర్పాటు చేయడం, సమర్పించడం అనేది ఇన్సూరెన్స్‌ తీసుకొన్న వ్యక్తులకు సాధారణమైన, ప్రధానమైన సవాలు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) కూడా ఇన్సూరెన్స్ కంపెనీ టర్న్‌అరౌండ్ సమయం(TAT) అవసరమైన అన్ని పత్రాలను చివరిగా సమర్పించిన రోజు నుంచి మాత్రమే ప్రారంభమవుతుందని చెబుతోంది. దీని కారణంగా అనేక క్లెయిమ్‌లు ఆలస్యం అవుతాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ వాస్తవ అవసరాలను అర్థం చేసుకోవడం ఉత్తమ మార్గం.

- ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్లను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి.

- కంపెనీని లేదా ఏజెంట్‌ని సంప్రదించి.. అవసరమైన పత్రాల గురించి తెలుసుకోవాలి

- తదుపరి ప్రశ్నలు ఎదురుకాకుండా, ఆలస్యం తలెత్తకుండా అన్ని పత్రాలను ఒకేసారి సమర్పించాలి.

* బహిర్గతం చేయకపోవడం, అసంపూర్ణ సమాచారాన్ని అందించడం

ఇన్సూరెన్స్‌ కంపెనీలకు వాస్తవాలు, పూర్తి సమాచారం అవసరం. పాలసీ తీసుకునే సమయంలో, క్లెయిమ్‌ను సమర్పించేటప్పుడు, అందించిన సమాచారం తప్పు లేదా అసంపూర్తిగా ఉందని కంపెనీ గుర్తించిన వెంటనే పనులు ఆగిపోతాయి. పాలసీ కొనుగోలుకు సంబంధించి లేదా క్లెయిమ్‌కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని దాచలేదని నిర్ధారించుకోవాలి.

ఇదీ చదవండి: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. సైన్యమే దేశాన్ని చేతుల్లోకి తీసుకోనుందా.. విస్తుపోయే నిజాలు ఇవే !


* సర్వేయర్, ఇన్వెస్టిగేటర్‌కు సహకరించకపోవడం

క్లెయిమ్‌ను ధృవీకరించడానికి, అనేక సందర్భాల్లో, ఇన్సూరెన్స్‌ కంపెనీలు సర్వే నిపుణుడిని లేదా ఇన్వెస్టిగేటర్‌ని నియమిస్తాయి. ఆలస్యాన్ని నివారించడానికి, ఇన్సూరెన్స్‌ చేసిన వ్యక్తి ఎటువంటి ఆలస్యం లేకుండా సర్వేయర్‌ను కలుసుకుని, కోరిన అన్ని పత్రాలను అందించాలి. లేకపోతే, అది రెండు సమస్యలను సృష్టిస్తుంది. ఒకటి ఇది క్లెయిమ్‌ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. రెండు ఇన్సూరెన్స్‌ చేసిన వ్యక్తి ప్రక్రియను ఎందుకు ఆలస్యం చేస్తున్నాడనే దానిపై సర్వేయర్ మనస్సులో సందేహం వస్తుంది.

* క్లెయిమ్‌ ప్రక్రియను ఎలా వేగవంతం చేయాలి

- క్లెయిమ్ ఎక్కడ ఆగిపోయిందో తెలుసుకోవడానికి ఏజెంట్‌ని సంప్రదించాలి. ఏజెంట్‌లకు ఇన్సూరెన్స్‌ కంపెనీతో సత్సంబంధాలు ఉంటాయి. క్లెయిమ్ వాస్తవంగా ఎక్కడ ఆగిపోయిందనే వివరాలు తెలియజేస్తారు.

- చాలా కంపెనీలు/TPAలు తమ క్లయింట్‌లకు లాగిన్ యాక్సెస్‌ను అందిస్తాయి. కాబట్టి, వారి ఆన్‌లైన్ పోర్టల్‌లను సందర్శించడం ద్వారా, క్లెయిమ్‌లో ఆలస్యానికి గల వివరాలు తెలుస్తాయి. దానికి పరిష్కారాన్ని కనుగొనవచ్చు.

- సంబంధిత బృందానికి క్రమం తప్పకుండా ఇమెయిల్‌లు రాయాలి. అప్‌డేట్‌ల గురించి తెలుసుకోవాలి.

- క్లెయిమ్ ప్రాసెస్‌లో పాల్గొన్న పార్టీలతో, అంటే కంపెనీ, ఇన్వెస్టిగేటర్, సర్వేయర్, TPA మొదలైన వారితో నిరంతరం కమ్యూనికేషన్‌ను కొనసాగించాలి.

- IRDA ఎల్లప్పుడూ పాలసీదారుల ప్రయోజనాలను రక్షిస్తుంది. అందువల్ల, క్లెయిమ్‌లలో విపరీతమైన జాప్యం గురించి ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IGMS) ప్లాట్‌ఫారమ్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

Published by:Mahesh
First published:

Tags: Claim, General insurance, Insurance

ఉత్తమ కథలు