హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Balance: మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? ఆధార్ నెంబర్‌తో తెలుసుకోండి ఇలా

Bank Balance: మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? ఆధార్ నెంబర్‌తో తెలుసుకోండి ఇలా

Bank Balance: మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? ఆధార్ నెంబర్‌తో తెలుసుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Balance: మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? ఆధార్ నెంబర్‌తో తెలుసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Bank Account Balance | బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఆధార్ నెంబర్‌తో (Aadhaar Number) కూడా మీ సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లి పాస్‌బుక్ అప్‌డేట్ చేయాల్సి వచ్చేది. అది కూడా ఓ అరగంట పాటు క్యూలో నిలబడి సేవింగ్స్ అకౌంట్ (Savings Account) పాస్‌బుక్ అప్‌డేట్ చేయించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ సాయంతో క్షణాల్లో బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ (Bank Account) బ్యాలెన్స్ తెలుసుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. మిస్డ్ కాల్ ఇచ్చి తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. బ్యాంక్ యాప్‌లో కూడా సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుస్తుంది. వాట్సప్‌లో కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.

మీ ఆధార్ నెంబర్ (Aadhaar Number) ద్వారా కూడా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అంటే బ్యాంక్ అకౌంట్ వివరాలు అవసరం లేదు. ఆధార్ నెంబర్ ఉంటే చాలు. మీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంతో తెలుస్తుంది. బ్యాలెన్స్ తెలుసుకోవడానికి బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. 12 అంకెల ఆధార్ నెంబర్‌ను మొబైల్ నెంబర్‌కు, బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేస్తే చాలు. ఈ సర్వీస్ స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్ లేనివారికి ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ సర్వీస్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

Voter ID Aadhaar Link: ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేశారా? ఈ సింపుల్ స్టెప్స్‌తో చేయండి

ఆధార్ నెంబర్‌తో బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోండి ఇలా


Step 1- మీ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్‌లో *99*99*1# డయల్ చేయాలి.

Step 2- ఆ తర్వాత 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 3- వెరిఫికేషన్ కోసం ఆధార్ నెంబర్‌ను మరోసారి ఎంటర్ చేయాలి.

Step 4- మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ స్క్రీన్ పైన ఫ్లాష్ మెసేజ్ రూపంలో కనిపిస్తుంది.

మీరు ఈ సర్వీస్ విజయవంతంగా వాడుకోవాలంటే మీ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయాలి. దీంతో పాటు మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి. అదే మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్‌కు కూడా లింక్ అయి ఉండాలి. ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇంటర్నెట్ అవసరం లేకుండా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి సులువుగా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు.

Google Pay UPI PIN: గూగుల్ పే యూపీఐ పిన్ మార్చి సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టండి ఇలా

ఆధార్ నెంబర్‌తో మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా, బ్యాంక్ అకౌంట్‌కు మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయకపోయినా, బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోయినా ఈ సర్వీస్ ఉపయోగించడం సాధ్యం కాదు. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసిన తర్వాత ఆధార్ నెంబర్‌తో మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Aadhaar Card, AADHAR, Bank account, Personal Finance

ఉత్తమ కథలు