పేమెంట్స్ చేసేందుకు, డబ్బులు ట్రాన్స్‌ఫర్ (Money Transfer) చేసేందుకు యూపీఐ యాప్స్ ఉపయోగించేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఫోన్‌పే, గూగుల్ పే (Google Pay), పేటీఎం లాంటి యాప్స్ ద్వారా పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. తరచూ యూపీఐ పిన్ మార్చాలని బ్యాంకుల తరచూ సూచిస్తుంటాయి. గూగుల్ పే యాప్‌లో యూపీఐ పిన్ ఎంటర్ చేయడం చాలా సింపుల్. ఈజీ స్టెప్స్‌తో యూపీఐ పిన్ మార్చవచ్చు.
సాధరణంగా గూగుల్ పే యాప్ ఇన్‌స్టాల్ చేసి రిజిస్టర్ చేసినప్పుడే యూపీఐ పిన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అయితే మోసాలను అడ్డుకోవడం కోసం తరచూ యూపీఐ పిన్ మార్చాలని చెబుతుంటారు నిపుణులు. ఎక్కువ రోజుల పాటు ఒకే యూపీఐ పిన్ వాడటం మంచిది కాదు. యూపీఐ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినంత ఈజీగా గూగుల్ పేలో యూపీఐ ఐడీ మార్చవచ్చు. ఎలాగో ఈ స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.
Credit Card: ఇక క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించే తేదీని మీరే నిర్ణయించుకోవచ్చు
Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి.
Step 2- హోమ్ స్క్రీన్‌లో టాప్ రైట్‌లో ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేయండి.
Step 3- ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి.
Step 4- మీరు యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ కనిపిస్తుంది.
Step 5- మీరు ఏ అకౌంట్‌కు యూపీఐ ఐడీ మార్చాలనుకుంటే ఆ అకౌంట్ సెలెక్ట్ చేయండి.
Step 6- అకౌంట్ వివరాలు ఓపెన్ అవుతాయి.
Step 7- ఆ తర్వాత టాప్ రైట్‌లో త్రీడాట్స్ పైన క్లిక్ చేయాలి.
Step 8- Change UPI PIN పైన క్లిక్ చేయాలి.
Step 9- మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పిన్ ఎంటర్ చేయాలి.
Step 10- ఆ తర్వాత కొత్త పిన్ నెంబర్ ఎంటర్ చేసి యూపీఐ పిన్ మార్చాలి.
iQOO 9T 5G: కాసేపట్లో ఐకూ 9టీ సేల్... వారికి రూ.4,000 డిస్కౌంట్
మీరు మార్చిన యూపీఐ పిన్ గుర్తుంచుకోవాలి. ఎక్కడా రాసిపెట్టకూడదు. గూగుల్ పే ద్వారా పేమెంట్స్ చేయాలన్నా, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా యూపీఐ పిన్ ఎంటర్ చేయడం తప్పనిసరి. మీరు డబ్బులు ఎవరికైనా పంపాలనుకుంటేనే యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. మీరు డబ్బులు స్వీకరించాలనుకుంటే మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. యూపీఐ ఐడీ, క్యూఆర్ కోడ్, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఉపయోగించి పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google pay, Personal Finance, UPI