హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF: ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫ‌ర్ చాలా ఈజీ.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

EPF: ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫ‌ర్ చాలా ఈజీ.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాస్తవానికి ఈపీఎఫ్ (EPF) ట్రాన్స్‌ఫ‌ర్ అనుకున్నంత ఈజీ కాదన్న మాట వాస్త‌వ‌మే. అయితే ఈ సింపుల్ స్టెప్స్‌ను ఫాలో అయితే ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎంతో ఈజీ తెలుసుకోండి..

ఈపీఎఫ్ (EPF) ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం అనుకున్నంత ఈజీ కాద‌నే మాట వాస్త‌వ‌మే కానీ ఇక్క‌డ చెబుతున్న ఈజీ స్టెప్స్‌ని ఫాలో అయితే ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎంతో ఈజీ. ఇందులో ఎలాంటి క‌న్య్ఫూజ‌న్ అవ‌స‌రం లేదు. వీటిని ఫాలో అయితే స‌రిపోతుంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (EPFO) ‌మీ పీఎఫ్ ను ఆన్‌లైన్ ద్వారా బ‌దిలీ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది. అయితే ఈ ట్రాన్స్‌ఫ‌ర్ వ్య‌వ‌హారం అంతా రిటైర్మెంట్ ఫండ్ బాడీ సూచించిన ప్ర‌కార‌మే జ‌రుగుతుంది. దీని ప్ర‌కార‌మే ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్‌ను బ‌దిలీ చేయ‌ద‌ల‌చుకుంటే ఇక్క‌డ చెబుతున్న సుల‌వైన మార్గాల‌ను ఫాలో అవ్వండి అంతే! మీరే స్వయంగా మీ పీఎఫ్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేయొచ్చు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ అనేది ప్ర‌పంచంలో అతి పెద్ద‌ సోష‌ల్ సెక్యూరిటీ ఆర్గ‌నైజేష‌న్‌గా గుర్తింపు పొందింద‌ని ఈ సంస్థ న‌డుపుతున్న క్లయింట్లను బ‌ట్టి, ఇది చేసే ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్ల బ‌ట్టీ ఈ విష‌యాన్ని ఈపీఎఫ్ ఓ స్వ‌యంగా ప్ర‌‌క‌టించింది. 2016-17 వార్షిక రిపోర్టును గ‌మ‌నిస్తే ఈ సంస్థ స‌భ్య‌త్వానికి సంబంధించి 19.34 కోట్ల అకౌంట్లు ఇందులో ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది.

ఎంప్లాయర్‌, ఎంప్లాయీ ఇద్ద‌రూ క‌ల‌సి ఉద్యోగ‌స్థుని అంటే స‌ద‌రు ఎంప్లాయి నెల జీతంలోని బేసిక్ శాల‌రీ, డియ‌ర్నెస్ అల‌వెన్సు(DA)ల మొత్తంలో 12 శాతాన్ని ప్ర‌తి నెలా ఆ ఎంప్లాయీ ఈపీఎఫ్ అకౌంట్లో జ‌మ చేస్తారు. అయితే ఈపీఎఫ్‌, పీఎఫ్‌ల‌కు కంట్రిబ్యూట్ చేయాలంటే ఈపీఎఫ్ చ‌ట్టం కింద రిజిస్ట‌ర్ అయిన కంపెనీ లేదంటే సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగ‌స్థుల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే, ఉమంగ్ యాప్ (UMANG App)ను ఉప‌యోగించి మీ ఈపీఎఫ్ అకౌంట్‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టుకోవ‌చ్చు. ఇందులో మీ పాస్‌బుక్‌ను చూసుకోవ‌చ్చు. మీ క్ల‌యిమ్ గురించి విన‌తులు పంపొచ్చు. అలాగే ముందుగా మీరు చేసుకున్న క్లెయిమ్‌కు సంబంధించిన స్టేట‌స్‌ను తెలుసుకోవ‌చ్చు. ఇంకా చాలా వ్య‌వ‌హారాలు ఈ యాప్‌ని ఉప‌యోగించి చేయ‌వ‌చ్చు.

ఆన్‌లైన్లో మీరు ఈపీఎఫ్ ట్రాన్స్‌ప‌ర్ చేసుకోవ‌డానికి ఈ సులువైన స్టెప్స్ ఫాలో అవ్వండి

-యూనిఫైడ్ మెంబ‌ర్ పోర్ట‌ల్‌ను ద‌ర్శించండిః https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/

-అక్క‌డ మీ యుఏఎన్ (UAN), పాస్‌వార్డ్ తో లాగిన్ అవ్వండి.

-(UAN) అనేది యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నంబ‌ర్‌. ఇది ప్ర‌తి వినియోగ‌దారునికీ ప్ర‌త్యేకంగా కేటాయించే యూనిక్ నంబ‌ర్‌.

-లాగిన్ అయిన త‌ర్వాత‌, ఆన్‌లైన్ స‌ర్వీసెస్‌కు వెళ్లాలి. అక్క‌డ `వ‌న్ మెంబ‌ర్‌- వ‌న్ ఈపీఎఫ్ అకౌంట్ (ట్రాన్‌ఫ‌ర్ రిక్వెస్ట్‌) (One Member – One EPF Account (Transfer Request) అనే ఆఫ్ష‌న్ పైన క్లిక్ చేయాలి.

-త‌ర్వాత‌, వ్య‌క్తిగ‌త స‌మాచారం (‘Personal Information’)ను, ప్ర‌స్తుత ఉద్యోగానికి సంబంధించిన పీఎఫ్ అకౌంట్‌ను వెరిఫై చేసుకోండి.

-గెట్ డిటైల్స్ ( ‘Get Details’)పై క్లిక్ చేయండి. అప్ప‌డు అంత‌కుముందు ఉద్యోగానికి సంబంధించిన పిఎప్ అకౌంట్ వివ‌రాలు క‌నిపిస్తాయి.

-త‌ర్వాత‌, అక్క‌డున్న అటెస్టింగ్ ఫారం కోసం గ‌తంలో ప‌నిచేసిన ప్రీవియ‌స్‌ ఎంప్లాయ‌ర్‌ని గానీ, ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న క‌రెంట్ ఎంప్లాయ‌ర్‌ని గానీ సెలెక్ట్ చేసుకోవాలి.

-దీని త‌ర్వాత‌, గెట్ ఓటీపీ (‘Get OTP’)పై క్లిక్ చేయాలి. దీనితో మీ యూఏఎన్‌ (UAN) రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది.

-అప్ప‌డు ఓటీపీని ఎంట‌ర్ చేసి, స‌బ్మిట్ (‘Submit’)పైన క్లిక్ చేయాలి.

అంతే మీరు చేయాల‌నుకున్న ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫ‌ర్ ప‌ని పూర్త‌యిన‌ట్లే.

First published:

Tags: Employees Provident Fund Organisation, EMPLOYMENT, EPFO

ఉత్తమ కథలు