• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • FOLLOW THESE ONLINE OR OFFLINE STEPS FOR TO LINK AADHAAR WITH POST OFFICE SAVINGS SCHEMES NS GH

Aadhaar - Post Office Savings Schemes: పోస్ట్ ఆఫీస్ పథకాలకు ఆధార్ తప్పనిసరి.. ఎలా లింక్ చేయాలంటే..

Aadhaar - Post Office Savings Schemes: పోస్ట్ ఆఫీస్ పథకాలకు ఆధార్ తప్పనిసరి.. ఎలా లింక్ చేయాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

Link Aadhaar With Post Office Savings Schemes: ఇటీవలి కాలంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఆధార్ కార్డు లింక్ ని తప్పనిసరి చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో పోస్టల్ పేమెంట్ బ్యాంకు కూడా చేరింది.

  • Share this:
ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారింది. ఏ ప్రభుత్వ పథకాలను పొందడానికైనా ఆధార్ తప్పనిసరిగా మారింది. ఇటీవలి కాలంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఆధార్ కార్డు లింక్ ని తప్పనిసరి చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో పోస్టల్ పేమెంట్ బ్యాంకు కూడా చేరింది. పోస్టల్ శాఖ అందిస్తున్న సేవింగ్ స్కీమ్ లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా ఆయా ఖాతాలతో లింక్ చేయాలని పోస్టల్ శాఖ పేర్కొంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చేసే పోస్టాఫీసు డిపాజిట్లు, పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అందిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్రా (కేవీపీ) వంటి వివిధ సేవింగ్ స్కీమ్ లలో పెట్టుబడులకు ఆధార్ తప్పనిసరి చేసింది. ఇప్పటికీ, ఆధార్ కార్డు లేని వ్యక్తులు తమ ఆధార్ ఎన్ రోల్ మెంట్ సంఖ్యతో కూడా ఖాతా తెరవొచ్చని తెలిపింది. వివిధ పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలతో ఆధార్ లింక్ చేయడానికి ఆఫ్ లైన్, ఆన్ లైన్ రెండు విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా సులభంగా మీ ఖాతాలకు ఆధార్ లింక్ చేయవచ్చు.

ఆఫ్‌లైన్ విధానంలో ఆధార్ లింక్
1. మీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ పాస్ బుక్, ఆధార్ కార్డుతో మీ సమీప భారతీయ పోస్ట్ ఆఫీస్ శాఖను సందర్శించండి.
2. పోస్టాఫీసు ప్రతినిధి నుంచి ఆధార్- లింకింగ్ దరఖాస్తు ఫారం తీసుకోండి. దానిని పూర్తిగా నింపండి.
3. ఆ తర్వాత మీ ఆధార్ కాపీని దరఖాస్తు ఫారంతో అటాచ్ చేసి సమర్పించండి.
4. మీ దరఖాస్తును ధృవీకరించి, మీకు రసీదును అందజేస్తారు.
5. పోస్టాఫీసు ద్వారా మీ దరఖాస్తు ఆమోదం పొందిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.

ఆన్‌లైన్ విధానంలో ఆధార్ లింక్
1. మీ ఆధార్‌ను మీ పోస్ట్ ఆఫీస్ ఖాతాతో లింక్ చేయడానికి మీ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ కి చెందిన నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌ను సందర్శించండి.
2. మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లను ఉపయోగించి మీ నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ అవ్వండి.
3. హోమ్‌పేజీలో "ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో ఆధార్ నంబర్ రిజిస్ట్రేషన్" ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, 'కన్ఫర్మ్' పై క్లిక్ చేయండి.
4. మీ ఆధార్‌ను లింక్ చేయాలనుకుంటున్న మీ ఇండియన్ పోస్ట్ బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి. తర్వాత మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి.
5. హోమ్‌పేజీలోని "ఎంక్వైరీ" ఆప్షన్ ద్వారా మీ ఆధార్ నంబర్ లింక్ రిక్వెస్ట్ పూర్తయిందో లేదో తనిఖీ చేసుకోండి.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు