పాన్, ఆధార్ నెంబర్లు లింక్ (PAN-Aadhaar Link) చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరో మూడు నెలల గడువు ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డ్ (PAN Card) హోల్డర్లకు ఊరట లభించినట్టైంది. 2023 మార్చి 31 గా ఉన్న గడువును 2023 జూన్ 30 వరకు పొడిగించడం మరో మూడు నెలలు అవకాశం లభించింది. అప్పట్లోగా రూ.1,000 జరిమానా చెల్లించి పాన్, ఆధార్ లింక్ చేయొచ్చు. అయితే ఇప్పటికే రూ.1,000 ఫైన్ కట్టినవారు పాన్ ఆధార్ లింక్ చేయలేకపోతున్నారు. వారికి సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. రూ.1,000 ఫీజు చెల్లించినా తాము పాన్, ఆధార్ లింక్ చేయలేకపోతున్నామని సోషల్ మీడియాలో కంప్లైంట్ చేస్తున్నారు.
పాన్, ఆధార్ లింక్ కాకపోవడానికి ప్రధాన కారణం పేరు మ్యాచ్ కాకపోవడమే. అంటే పాన్ కార్డులో, ఆధార్ కార్డులో పేరు ఒకేలా ఉండాలి. ఆదాయపు పన్ను శాఖ డేటా బేస్‌లో, ఆధార్ డేటాబేస్‌లో పేర్లు మ్యాచ్ అయితేనే పాన్, ఆధార్ నెంబర్లు లింక్ అవుతాయి. పాన్ కార్డ్ , ఆధార్ కార్డుల్లో పేర్లు వేర్వేరుగా ఉంటే ఈ రెండు నెంబర్లు లింక్ కావడం సాధ్యం కాదు.
LIC Policy: రూ.50 లక్షల రిటర్న్స్ కావాలా? ఈ ఎల్ఐసీ పాలసీ మీకోసమే
ఒకవేళ నేమ్ మిస్‌మ్యాచ్ కారణంతో పాన్, ఆధార్ లింక్ కాకపోతే వెంటనే రెండు కార్డులపై పేర్లు ఒకేలా ఉండేలా మార్పు చేయాలి. సరైన పేరు రెండు కార్డులపై ఉండేలా చూసుకోవాలి. ఆధార్ కార్డులో పేరు సరిగ్గా ఉన్నప్పుడు, ఆధార్‌లో ఉన్నట్టుగానే పాన్ కార్డులో పేరు మార్చుకోవాలి. ఒకవేళ పాన్ కార్డులో పేరు కరెక్ట్‌గా ఉంటే ఆధార్ కార్డులో పేరు మార్చుకోవాలి. ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చుకోవాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. పేరు మాత్రమే కాదు, పుట్టిన తేదీ మ్యాచ్ కాకపోయినా పాన్, ఆధార్ లింక్ కాదు.
ఇక సాంకేతిక సమస్యల కారణంగా పాన్, ఆధార్ లింక్ కావట్లేదు. రూ.1,000 పేమెంట్ చేసిన వెంటనే పాన్, ఆధార్ లింక్ చేయడానికి ప్రయత్నించడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇ-పే ట్యాక్స్ ద్వారా పేమెంట్ చేస్తే ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అప్‌డేట్ కావడానికి కొంత సమయం పడుతుంది. అందుకే పేమెంట్ పూర్తి చేసిన 4-5 రోజుల తర్వాతే పాన్, ఆధార్ లింక్ చేయడానికి ప్రయత్నించాలి.
Medicine Prices: అలర్ట్... ఏప్రిల్ 1 నుంచి 384 మందుల ధరలు పెరగనున్నాయి
పేమెంట్ పూర్తి చేసిన నాలుగైదు రోజుల తర్వాత కూడా మీరు పాన్, ఆధార్ లింక్ చేయలేకపోతే మైనర్ హెడ్ కోడ్ 500 కింద పేమెంట్ చేశారో లేదో చెక్ చేయాలి. ఒకవేళ మీరు పొరపాటుగా పేమెంట్ చేస్తే రీఫండ్ రాదన్న విషయం గుర్తుంచుకోవాలి. మీరు సరిగ్గానే పేమెంట్ చేసినా, పాన్-ఆధార్ లింక్ చేయడం సాధ్యం కాకపోతే గ్రీవెన్స్ లేదా కాంటాక్ట్ హెల్ప్‌డెస్క్‌లో కంప్లైంట్ చేయొచ్చు. మీరు మళ్లీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీ సమస్య పరిష్కారం అయిన తర్వాత పాన్, ఆధార్ నెంబర్లు లింక్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AADHAR, PAN card, Personal Finance