Personal Savings: సేవింగ్స్ పెంచుకోవాలని అనుకుంటున్నారా? వెంటనే ఈ 5 పనులు చేయండి

Ideas for Savings: ఆదాయాన్ని పెంచడం ఒక్కటే మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి పరిష్కారం కాదు. ఎప్పుడైతే సేవింగ్స్‌ను మొదలుపెడతారో అప్పుడే ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలరు.

news18-telugu
Updated: September 30, 2020, 9:07 PM IST
Personal Savings: సేవింగ్స్ పెంచుకోవాలని అనుకుంటున్నారా? వెంటనే ఈ 5 పనులు చేయండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మనం తెలిసి తెలియకుండానే అనవసర ఖర్చులు పెడుతుంటాం. ఎప్పుడైతే అనవసర ఖర్చులను తగ్గించుకుంటామో అప్పుడే మన సేవింగ్స్‌ను పెంచుకోగలమని గుర్తించుకోవాలి. మీ ఆదాయాన్ని పెంచడం ఒక్కటే మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి పరిష్కారం కాదు. మీరు ఎప్పుడైతే సేవింగ్స్‌ను మొదలుపెడతారో అప్పుడే మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలరు. పదవీ విరమణ తర్వాత మీ జీవితం ఇబ్బందులు లేకుండా సాగాలన్నా, అత్యవసర నిధిని సృష్టించుకోవాలన్నా మీ జీవనశైలిలో చిన్న మార్పులు చేయడం. మీరు చేసే చిన్న మార్పు పెద్ద ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడతాయని గుర్తించుకోండి.

అవసరాన్ని మేరకే వస్తువలను కొనండి

ఇతరులను ఆకట్టుకోవడానికి, మీ ఆర్థిక స్థితిని చూపించుకోవడానికి అవసరం లేకున్న వస్తువులను కొనకూడదు. ఇది మీ జేబును ఖాళీ చేయడమే కాకుండా మిమ్మల్ని మీ ఆర్థిక లక్ష్యాల నుండి దూరం చేస్తుంది. ఉదాహరణకు మీరు నిర్ధిష్టమైన బ్రాండెడ్ వాచ్‌ను ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం వంటివి తగ్గించుకోవాలి. అలా కాకుండా అవసరం మేరకు తక్కువ ఖర్చులో వచ్చే వాచ్‌ను కొనుక్కోవడం వల్ల మీరు ఎక్కువ సేవింగ్స్ చేసుకోగలుగుతారు.

స్వంత వాహనాన్ని వాడటం తగ్గించండి
మీ రోజూవారి ఖర్చులు తగ్గించుకోవాలంటే మీ స్వంత వాహనాన్ని వాడటం కంటే ప్రజా రవాణాని ఉపయోగించడం మంచిది. దీని వల్ల మీరు మీ స్వంత వాహనానికయ్యే పెట్రోల్ లేదా డీజిల్ మరియు నిర్వహణ ఖర్చును ఆదా చేయగలుగుతారు. కాబట్టి అవసరం మేరకే మీ స్వంత వాహనాన్ని ఉపయోగించండి. మీరు చేసే ఈ చిన్న సేవింగ్ మీ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. అంతే దీనర్థం మీరు మీ స్వంత వాహనం ఉపయోగించడాన్ని పూర్తిగా నివారించాలని కాదు దానికి బదులు ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ఎక్కువ సేవింగ్స్ చేసుకోగలుగుతారు.

బయట తినడం తగ్గించండి
ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం ద్వారా మెరుగైన ఆరోగ్యంతో పాటు మీ రోజువారీ సేవింగ్స్‌ను పెంచుకోవచ్చు. తరచుగా రెస్టారెంట్స్లో భోజనం చేయడం వంటి వాటితో ఖర్చులు పెరుగుతాయి. అంతేకాక బయట తినే ఆహారం కారణంగా తరచుగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా వైద్య ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవడంతో డబ్బు ఆదా అవడంతో పాటు వైద్య ఖర్చులను తగ్గించుకోవచ్చు.తరచుగా షాపింగ్ చేయకండి
తరచూ షాపింగ్ చేయడం మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది, కానీ మీ నెలవారీ సేవింగ్స్‌ను ఇది హాని కలిగించే ప్రమాదం ఉంది. అందువల్ల అనవసర ఆర్భాటాలకు పోకుండా అవసరం మేరకే షాపింగ్ చేయండి. అవసరం మేరకే షాపింగ్ చేయడం ద్వారా మీ సేవింగ్స్‌ను పెంచుకోవచ్చు.

వర్చువల్ పేమెంట్స్‌ను తగ్గించండి
ప్రజలు తమ చేతిలో నుండి డబ్బులు ఖర్చు చేయడంలో జాగ్రత్తగా ఉంటారు. మీ జేబులో నుండి డబ్బు ఖర్చు చేసినప్పుడు, డబ్బు తగ్గడాన్ని మీరు గమనించవచ్చు. ఇది మీ ఖర్చు పట్ల మీకు మరింత స్పృహ కలిగిస్తుంది. మరోవైపు, క్రెడిట్ కార్డ్, ఇతర వర్చువల్ పేమెంట్స్ ద్వారా చేసే ఖర్చులు మీకు కన్పించవు. వర్చువల్ పేమెంట్స్ చాలా సులభమైనప్పటికీ, దీని వల్ల మీరు అవసరానికంటే ఎక్కువగా ఖర్చు చేసే ప్రమాదముంది. అందువల్ల సాధ్యమైనంతవరకు నగదు చెల్లింపులకే ప్రాధాన్యత ఇవ్వండి. మీ జీవన శైలిలో ఈ సరళమైన మార్పులను అవలంబించి, ఆర్థికంగా ఒత్తిడి లేని జీవితాన్ని ఆస్వాదించండి.
Published by: Kishore Akkaladevi
First published: September 30, 2020, 9:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading