Home /News /business /

Medplus IPO: డిసెంబర్‌ 13న మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ IPO.. షేర్ ధర ఆ రేంజ్‌లో ఉండే ఛాన్స్..

Medplus IPO: డిసెంబర్‌ 13న మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ IPO.. షేర్ ధర ఆ రేంజ్‌లో ఉండే ఛాన్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Medplus: ఈ IPOలో రూ.5 కోట్ల విలువైన షేర్లను సంస్థ ఉద్యోగులకు రిజర్వ్ చేశారు. అర్హులైన ఉద్యోగులకు తుది ఆఫర్‌ ధరపై రూ.78 డిస్కౌంట్‌తో షేర్లు అందిస్తారు. ఈ ఇష్యూ ద్వారా సేకరించే మొత్తాన్ని సంస్థకు మెటిరీయల్‌ సబ్సిడరీగా వ్యవహరిస్తున్న ఆప్టివాల్‌ వర్కింగ్‌ కేపిటల్‌ అవసరాలకు ఉపయోగిస్తారు.

ఇంకా చదవండి ...
భారతదేశపు రెండో అతి పెద్ద ఫార్మసీ రిటెయిల్‌ అయిన మెడ్‌ప్లస్‌ హెల్త్ సర్వీసెస్‌, డిసెంబర్‌ 13న ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (IPO)కు వస్తోంది. ఈ ఐపీఓలో సంస్థ ఈక్విటీ షేర్‌ ధరను రూ.780-796 గా నిర్ణయించారు. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1398.29 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ ఆలోచన. ఇందులో భాగంగా కొత్తగా రూ.600 కోట్ల విలువైన షేర్స్ జారీ చేయడంతో పాటు వాటాదారులు రూ.798.29 కోట్ల విలువైన తమ షేర్స్ విక్రయిస్తున్నారు. ఈ IPOలో పెట్టుబడి పెట్టదలిచిన వారు కనీసం 18 షేర్లకు బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 18 గుణిజాల్లో బిడ్‌ దాఖలు చేయవచ్చు. డిసెంబర్‌ 13న మొదలయ్యే ఈ IPO, డిసెంబర్‌ 15 వరకు ఉంటుంది.

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌లో ప్రస్తుతం ప్రమోటర్లు గంగడి మధుకర్‌ రెడ్డి, అజైల్‌మెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, లోన్‌ ఫారో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కలిపి 43.16 శాతం వాటా ఉంది.వాటాదారుల్లో షోర్‌ ఫార్మా LLC, నాట్కో ఫార్మా, టైమ్‌ క్యాప్‌ ఫార్మా ల్యాబ్స్‌, A.రాఘవరెడ్డి, K.ప్రకృతి, నవదీవ్‌ పత్యాల్‌, సంగీతా రాజు, R.వెంకటరెడ్డి, TK కురియన్, నిత్యా వెంకటరమణి, అతుల్‌ గుప్తా, మనోజ్‌ జైస్వాల్‌, రాహుల్‌ గార్గ్‌, కొల్లెన్‌గోడ్‌ రామనాథన్‌ లక్ష్మీనారాయణ, బిజో కురియన్ వంటివారు – OFS ద్వారా తమ వాటాలు విక్రయిస్తున్నారు.

ఈ IPOలో రూ.5 కోట్ల విలువైన షేర్లను సంస్థ ఉద్యోగులకు రిజర్వ్ చేశారు. అర్హులైన ఉద్యోగులకు తుది ఆఫర్‌ ధరపై రూ.78 డిస్కౌంట్‌తో షేర్లు అందిస్తారు. ఈ ఇష్యూ ద్వారా సేకరించే మొత్తాన్ని సంస్థకు మెటిరీయల్‌ సబ్సిడరీగా వ్యవహరిస్తున్న ఆప్టివాల్‌ వర్కింగ్‌ కేపిటల్‌ అవసరాలకు ఉపయోగిస్తారు.

మెడ్‌ప్లస్‌ సంస్థను 2006లో స్థాపించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 200 ప్రదేశాల్లో 2,165 స్టోర్స్‌ ఈ సంస్థకు ఉన్నాయి. ఇందులో 45 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే ఉండటం విశేషం.

18 నెలల క్రితం లక్ష పెట్టుబడి పెడితే.. ఇప్పుడు దాని విలువ అక్షరాల కోటి రూపాయలు.. 106 రెట్లు పెరిగిన షేర్ ధర

ఆర్గనైజ్డ్‌ రంగంలో ప్రతి రిటెయిల్‌ స్టోర్‌ రోజువారీ ఆదాయం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. అదే అవ్యవస్థీకృత రంగంలో ఇది రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకే ఉంటుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్రలో మెడ్‌ప్లస్‌ సంస్థకు స్టోర్స్‌ ఉన్నాయి. ఔషధాలతో పాటు, ఆరోగ్య ఉత్పత్తులను వీటిలో విక్రయిస్తారు.

ఈ ఆఫర్‌లో సగం వరకు అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు ప్రత్యేకంగా కేటాయించారు. రిటెయిల్‌ పెట్టుబడిదారులకు 35 శాతం, మిగిలిన 15 శాతాన్ని సంస్థాగతేతర పెట్టుబడిదారులకు కేటాయిస్తారు.

24.58 శాతం వాటాతో లావెండర్‌ రోజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలో అతి పెద్ద వాటాదారుగా ఉంది. సంస్థను నెలకొల్పిన గంగడి మధుకర్‌ రెడ్డికి సంస్థలో 13.75 వాటా ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో మెడ్‌ప్లస్‌ రూ.63.11 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.1.79 కోట్లు ఎక్కువ. సెప్టెంబర్‌ 2021తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరంపు తొలి అర్ధ వార్షిక సమయంలో కంపెనీ రూ.66.36 కోట్ల లాభాన్ని అందుకుంది.

Farmers Agitation End: రైతు సంఘాల కీలక నిర్ణయం.. ఏడాదిగా చేస్తున్న ఆందోళనలు విరమణ
ఈ ఇష్యూకు యాక్సిస్‌ క్యాపిటిల్‌, క్రెడిట్‌ సూయిస్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా) ఎడిల్‌వైజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, నోమూరా ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా) సంస్థలు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: IPO

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు