CNBC-TV18 IBLA 2020: కరోనా వైరస్‌తో మన ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ముప్పు లేదు...నిర్మలా సీతారామన్

కరోనా వైరస్‌కు సంబంధించి ప్రస్తుతం ‘పెద్ద సమస్య’ కాదని దాని ప్రభావం ఇంకా ఏ రంగంపై పడలేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు.

news18-telugu
Updated: February 28, 2020, 7:33 PM IST
CNBC-TV18 IBLA 2020: కరోనా వైరస్‌తో మన ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ముప్పు లేదు...నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
  • Share this:
ముంబై వేదికగా వ్యాపార రంగంలో అత్యున్నత పురస్కారాలను అందించే ఇండియా బిజినెస్ లీడర్ షిప్ అవార్డ్స్ (CNBC-TV18 IBLA 2020) కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌కు సంబంధించి ప్రస్తుతం ‘పెద్ద సమస్య’ కాదని దాని ప్రభావం ఇంకా ఏ రంగంపై పడలేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, కరోనావైరస్ కారణంగా తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి ఆకస్మిక ప్రణాళిక దాదాపు సిద్ధంగా ఉందని. కరోనావైరస్ ప్రభావం పడే వివిధ రంగాలతో సమగ్ర సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నారు.

అంతేకాదు జి 20 సదస్సులో చాలా మంది గ్లోబల్ ఇన్వెస్టర్లను కలుసుకున్నామని, వారంతా తమ భారత్ వైపు విస్తరించాలని కోరుకుంటున్నారని, ఈ విషయం తనకు గ్లోబల్ ఇన్వెస్టర్లే చెప్పినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారతదేశం వివిధ అంతర్జాతీయ సంస్థల పెట్టుబడుల వృద్ధిని పెంచుకునేందుకు సరైన ప్రదేశం. అంతేకాదు దేశీయంగా ఎవరికైతే తక్షణ సాయం కావాలో వారికి తాము సహకారం అందిస్తామని, అలాగే బ్యాంకులు సైతం సిద్ధంగా ఉన్నాయని నిర్మలా పేర్కొన్నారు. బ్యాంకులు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. అయితే మొదట ఉన్న ఇబ్బందులను నేరుగా పరిష్కరించుకోవాలని అలాగే. తాజా రుణాలు తీసుకునే ముందు నిరర్ధక ఆస్తుల (ఎన్‌పిఎ)ను అంతం చేయాలని ఆమె అన్నారు. ఒత్తిడికి గురైన కంపెనీలు మరియు నష్టాల్లోని పరిశ్రమలకు సహాయపడటం కోసం వ్యవస్థను ముక్కలు చేయలేమన్నారు. అలాగే క్యూ3 జిడిపి సంఖ్యల నుండి ఆశ్చర్యం కలగించలేదన్నారు. జీడీపీ సంఖ్యలు ఆర్థిక వ్యవస్థలో కొంత స్థిరంగా ఉన్నాయని సూచిస్తున్నందుకు సంతోషకరమన్నారు.



First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు