హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2021 Speech Live Updates: వారికి ఇది నిరాశే.. కానీ తప్పడం లేదు.. బడ్జెట్ ప్రసంగంలో నిర్మల కామెంట్స్

Budget 2021 Speech Live Updates: వారికి ఇది నిరాశే.. కానీ తప్పడం లేదు.. బడ్జెట్ ప్రసంగంలో నిర్మల కామెంట్స్

పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్

పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్

ఉదయం 11 గంటల సమయంలో నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) బడ్జెట్ (Union Budget 2021) ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. కరోనా మహమ్మారి విజృంభనను గుర్తుచేసిన ఆమె, ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయని ఎవరూ ఊహించలేదన్నారు. అదే సమయంలో ఓ రంగం వారికి నిరాశేనని చెబుతూనే..

ఇంకా చదవండి ...

  పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదువుతున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆమె, పలు కీలక నిర్ణయాల గురించి వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి గురించి కూడా నిర్మలమ్మ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోందనీ, త్వరలోనే దీని బారి నుంచి ప్రజలంతా సురక్షితంగా బయటపడతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కొవిడ్ 19 వ్యాక్సినేషన్ల కోసం బడ్జెట్ లో ఏకంగా 35 వేల కోట్ల నిధిని కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అవసరం అయితే ఈ నిధిని మరింత పెంచుతామని ఆమె హామీ ఇచ్చారు. ఇదే సమయంలో బహిరంగ మార్కెట్లో, ప్రైవేటు రంగానికి ఈ కొవిడ్ వ్యాక్సిన్లను వినియోగంలోకి తెచ్చే విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు

  ’కరోనా వ్యాక్సిన్లను ప్రస్తుతానికి ప్రవేటు రంగానికి అందుబాటులో ఉంచడం లేదు. వ్యాక్సినేషన్లకు ప్రేవేటు రంగాన్ని దూరంగానే ఉంచాలని నిర్ణయించాం. ఇది వారికి నిరాశ కలిగించవచ్చు. కానీ దేశ ప్రజల శ్రేయస్సు కోసం తప్పడం లేదు. మొదటి విడతగా ఇస్తున్న కరోనా వ్యాక్సిన్ల ఒక్కో డోసు ధర 255 రూపాయలుగా నిర్ణయించాం. బడ్జెట్లో కేటాయించిన మొత్తం రెండు డోసులకు గానూ ఏకంగా 68.6 కోట్ల మంది భారత ప్రజలకు సరిపోతుంది. అవసరాన్ని బట్టి ఆ మొత్తాన్ని ఇంకా పెంచుతాం‘ అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తేల్చిచెప్పారు.

  అంతే కాకుండా కరోనా వ్యాక్సినేషన్ల గురించి కూడా ఆమె వ్యాఖ్యానించారు. ’ప్రజల సంక్షేమం కోసం ’ఆత్మ నిర్భర్ యోజన‘ ను ప్రవేశపెడుతున్నాం. దీనికి 61,180 కోట్ల రూపాయల నిధిని కేటాయిస్తున్నాం. ఆరేళ్ల ఇంత మొత్తాన్ని ఈ పథకం కోసం ఖర్చు పెడతాం. దేశవ్యాప్తంగా 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లను నెలకొల్పుతున్నాం. భారత్ లో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందిస్తున్నారు. మరో రెండు వ్యాక్సిన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో మరింత మంది భారతీయులకు వ్యాక్సిన్లను అందించబోతున్నాం. మన శాస్త్రవేత్తలు రూపొందించిన వ్యాక్సిన్లు కేవలం మన కోసమే కాకుండా దాదాపు వంద దేశాలకు సరఫరా చేస్తున్నాం. ఇది అంతర్జాతియంగా భారత్ ఖ్యాతిని పెంచుతోంది‘ అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Budget 2021, Narendra modi, Nirmala sitharaman, Union Budget 2021

  ఉత్తమ కథలు