Nirmala Sitharaman : కరోనా దెబ్బతో భారత జీడీపీ సున్నా అయ్యే చాన్స్...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి ప్రతికూలంగాగానీ లేదా సున్నాకి దగ్గరగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

news18-telugu
Updated: October 27, 2020, 11:51 PM IST
Nirmala Sitharaman : కరోనా దెబ్బతో భారత జీడీపీ సున్నా అయ్యే చాన్స్...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల
నిర్మల సీతారామన్ (credit -twitter - ANI)
  • Share this:
కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి ప్రతికూలంగాగానీ లేదా సున్నాకి దగ్గరగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-జూన్) మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో 23.9 శాతం భారీ సంకోచం ఉండటమే దీనికి ప్రధాన కారణమన్నారు. మహమ్మారి కారణంగా పూర్తి లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని రంగాలు కోలుకుంటున్నాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో పునరుజ్జీవనం కనిపించే సంకేతాలు కనిపిస్తున్నాయని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ చెప్పారు. మంగళవారం జరిగిన సెరావీక్ 4 వ వార్షిక ఇండియా ఎనర్జీ ఫోరంలో ఆర్థిక మంత్రి ప్రసంగించారు. ప్రాథమిక రంగంలో రికవరీ సిగ్నల్స్ కనిపించాయన్నారు. గ్రామీణ రంగం బాగా పనిచేస్తున్నదని, ఆటో అమ్మకాలు మంచి వృద్ధిని సాధించాయని తెలిపారు. భారతదేశంలో ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైనందున డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. మూడు, నాలుగో త్రైమాసికంలో మరింత సానుకూల వృద్ధి సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం 2019 ఏప్రిల్-ఆగస్టుతో పోల్చితే 2020 ఏప్రిల్-ఆగస్టులో కొవిడ్‌-19 ఉన్నప్పటికీ 13 శాతం వృద్ధిని సాధించిందని ఆమె వెల్లడించారు.

ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి ప్రభుత్వ వ్యయంపై ప్రభుత్వం దృష్టి సారించిందని సీతారామన్ తెలిపారు. దేశం యొక్క ఇంధన అవసరాల గురించి మాట్లాడిన సీతారామన్.. సమర్థమైన గ్యాసిఫికేషన్ భారత ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుందని చెప్పారు. జీవ ఇంధనాల సమర్థ వినియోగాన్ని దేశం చూస్తున్నదని, అణుశక్తి కోసం ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం చేసుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉన్నదని తెలిపారు.
Published by: Krishna Adithya
First published: October 27, 2020, 11:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading