Home /News /business /

FM NIRMALA SITHARAMAN PRESS CONFERENCE ON ANTRIX DEVAS DEAL MK

FM Nirmala Sitharaman: Devas-Antrix కుంభకోణం కాంగ్రెస్ ఫలితమే...దేశ ప్రయోజనాలను యూపీఏ తాకట్టు పెట్టింది... నిర్మల ధ్వజం

nirmala sitharaman

nirmala sitharaman

పదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన దేవాస్-యాంట్రిక్స్ కేసుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం విలేకరుల సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ క్రోనీ కాపిటలిజాన్ని పెంచి పోషించిందని విమర్శించారు. ఈ కేసుకు సంబంధించిన అవకతవకలకు గత యూపీఏ ప్రభుత్వమే కారణమని, ఇది దేశానికి జరిగిన మోసమని ఆమె అన్నారు.

ఇంకా చదవండి ...
    Devas-Antrix : యాంట్రిక్స్‌-దేవాస్‌ ఒప్పందం ద్వారా దేశ భద్రత విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం రాజీ పడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  ధ్వజమెత్తారు. అంతేకాదు దేశానికి జరిగిన ఈ మోసానికి కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఒప్పందం గురించి అప్పటి యూపీఏ ప్రభుత్వం కేబినెట్‌కు కూడా తెలియజేయలేదని ఆర్థిక మంత్రి అన్నారు. యూపీఏ ప్రభుత్వ చర్యల వల్లే నేడు మోదీ ప్రభుత్వం అనేక అంతర్జాతీయ న్యాయస్థానాల్లో పోరాడుతోందన్నారు. ఇదిలా ఉంటే పదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన దేవాస్-యాంట్రిక్స్ కేసుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం విలేకరుల సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ క్రోనీ కాపిటలిజాన్ని పెంచి పోషించిందని విమర్శించారు. ఈ కేసుకు సంబంధించిన అవకతవకలకు గత యూపీఏ ప్రభుత్వమే కారణమని, ఇది దేశానికి జరిగిన మోసమని ఆమె అన్నారు. అప్పటి ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు దాదాపు 11-12 ఏళ్లు పట్టిందని ఆమె పేర్కొన్నారు. 2005లో Devas-Antrix ఒప్పందం జరిగినప్పుడు అప్పుటి యూపీఏ ప్రభుత్వం ఉందని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది ఒక మోసపూరిత ఒప్పందమని, దీన్ని రద్దు చేసేందుకు 6 ఏళ్లు పట్టిందని గుర్తు చేశారు. ఈ వ్యవహారం తీవ్రస్థాయికి చేరి బాధ్యుడైన కేంద్ర మంత్రిని అరెస్టు చేయాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేశారు. అయితే Devas-Antrix డీల్ కేబినెట్ ఆమోదం కూడా పొందలేదని ఆమె గుర్తు చేశారు. Devas-Antrix ఒప్పందాలను ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదించాల్సిన అవసరం లేదని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ 24 ఫిబ్రవరి 2011న చెప్పినట్లు గుర్తుచేశారు. అయతే కేవలం రెండు ఉపగ్రహాలను ప్రయోగించే విషయం మాత్రమే అప్పటి కేబినేట్ మంత్రివర్గం నోటీసులో ఉందని ఆమె తెలిపారు. ఈ డీల్ నిజానికి మోసమని సీతారామన్ అన్నారు. ఈ మోసానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతీ దశలోనూ న్యాయస్థానంలో పోరాడిందని ఆమె గుర్తు చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పోరాటానికి దిగినట్లు ఆమె గుర్తు చేశారు.

    కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశ భద్రత కోసం వినియోగించిన ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను విక్రయించేందుకు అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడిందని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు.

    అసలు ఏంటీ S-band spectrum ?
    S-బ్యాండ్‌లు 2 నుండి 4 GHz వరకు స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీలలో భాగం. ఇది ప్రత్యేకంగా ఎయిర్ నిఘా రాడార్, వాతావరణ రాడార్, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ఉపరితల నౌక రాడార్ కోసం ఉపయోగిస్తారు. దానిలో కొంత భాగం కమ్యూనికేషన్ ఉపగ్రహంగా ఉపయోగిస్తారు. దీనిని NASA స్పేస్ షటిల్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగిస్తారు.

    దేవాస్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది
    ఇదిలా ఉంటే సోమవారం, దేవాస్ మల్టీమీడియా దాని మాతృ సంస్థ దేవాస్ ఎంప్లాయీస్ మారిషస్ అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. NCLT, NCLAT వ్యతిరేకంగా దేవాస్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, రెండు అప్పీలేట్ ట్రిబ్యునల్స్ దేవాస్ మల్టీమీడియాను మూసివేయాలని ఆదేశించాయి. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇదిలా ఉంటే ఈ కేసు చాలా సంవత్సరాల క్రితం ISROకు చెందిన Antrix Corp, దేవాస్ మల్టీమీడియా మధ్య జరిగిన ఉపగ్రహ ఒప్పందానికి సంబంధించినది. ఆ ఒప్పందం 2011లో రద్దయ్యింది. ఒప్పందం రద్దు అయిన తర్వాత, దేవాస్ తన నష్టాన్ని భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ విషయం అంతర్జాతీయ న్యాయస్థానానికి సైతం వెళ్లింది. అక్కడ దేవాస్ గెలిచంది. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టు దేవాస్‌కు 1.3 బిలియన్ డాలర్లు చెల్లించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ మొత్తాన్ని రికవరీ కోసం దేవాస్‌కు చెందిన విదేశీ వాటాదారులు కెనడా, అమెరికా సహా పలు దేశాల్లో భారత ప్రభుత్వంపై దావా వేశారు.

    ఇదిలా ఉంటే కెనడియన్ క్యూబెక్ ప్రావిన్స్‌లోని అక్కడి సుపీరియర్ కోర్ట్ నవంబర్ 24, డిసెంబర్ 21 తేదీలలో ఈ కేసుకు సంబంధించి రెండు ఉత్తర్వులు ఇచ్చింది. వీటిలో భారత ప్రభుత్వానికి చెందిన  ఏఏఐ, ఎయిర్ ఇండియా ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను అనుసరించి, AAIకు చెందిన 6.8 మిలియన్ (సుమారు రూ. 51 కోట్లు), ఎయిర్ ఇండియాకు చెందిన 30 మిలియన్ (సుమారు రూ. 223.5 కోట్లు) విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ఈ ఆస్తులు కెనడియన్ ప్రావిన్స్ క్యూబెక్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) వద్ద ఉంచారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Nirmala sitharaman

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు