Union Budget 2020: సామాన్యుడి చేతికే సంపద...న్యూస్18 ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్...

Union Budget 2020: సామాన్యుడి చేతికే సంపద...న్యూస్18 ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్...

ప్రజల చేతుల్లో ఎక్కువ మొత్తంలో సంపదను ఉంచడమే మా ప్రణాళిక అని తెలిపారు. దీంతోపాటు ప్రతీ వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ను రూపొందించామని నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తెలిపారు.

  • Share this:
    కేంద్ర బడ్జెట్ 2020-2021(Union Budget 2020) ప్రవేశ పెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెట్‌వర్క్ 18 ఎండీ అండ్ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఆర్థిక వ్యవస్థలో వినియోగికత పెంచడమ బడ్జెట్ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే ప్రజల చేతుల్లో ఎక్కువ మొత్తంలో సంపదను ఉంచడమే మా ప్రణాళిక అని తెలిపారు. దీంతోపాటు ప్రతీ వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్(Union Budget 2020)ను రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ప్రధాని మోదీ రూ.100 లక్షల కోట్లు మౌలిక సదుపాయాలపై ఖర్చు పెట్టాలని ఆదేశించారు. అయితే వీటి కల్పన కోసం డబ్బును ఖర్చు పెట్టబోతున్నాము. దీంతో పాటు పారదర్శకత, నమ్మకం, వేగవంతమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించడం ద్వారా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా కదులుతున్నారు. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుదల కోసం రూ.6 లక్షల కోట్లను బడ్జెట్ లో కేటాయింపులు చేశాం. స్టాక్ మార్కెట్లో నష్టాలు కేవలం తాత్కాలికం మాత్రమే. సోమవారం మార్కెట్లు బడ్జెట్‌ను పాజిటివ్‌గా స్పందిస్తాయని ఆశిస్తున్నారు. పలు అంతర్జాతీయ సావరీన్ ఫండ్స్ భారత్ ను సురక్షిత పెట్టుబడుల గమ్యస్థానంగా భావిస్తున్నాయి. ఇండియా రేటింగ్స్ కేవలం ఆర్థిక గణాంకాల వల్ల మాత్రమే దిగజారడం లేదు. కొంత ఆర్థిక వ్యవస్థలోని సర్దుబాట్ల వల్ల తగ్గుదల చూపుతున్నాయని తెలిపారు.

    అలాగే కొత్త పన్నుల విధానం ద్వారా మరింత సులభతరంగా మారనుందని, దీని ద్వారా ప్రజల నిర్ణయానికి వారి పొదుపును వదిలివేశాం. తద్వారా వారే తమ పొదుపు భవితను నిర్ణయించుకుంటారన్నారు. దీంతో పాటు కొత్త పన్నుల విధానంలో సైతం కొన్ని మినహాయింపులు కొనసాగుతున్నాయి. నూతన పన్ను శ్లాబుల విధానంతో పన్ను చెల్లింపుదారుల చేతుల్లో డబ్బు మిగులుతుందని ఆశిస్తున్నాం. దానిని వారు ఇష్టారీతిని వినియోగించుకునే అవకాశం కల్పించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. సీఏఏ ఆందోళనలు విదేశీ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపవు. దేశ ప్రతిష్టను ఏ మాత్రం ప్రభావితం చేయలేవన్నారు. అలాగే కొత్త బడ్జెట్ సామాన్యులకు ఊరట కల్గిస్తోందని, ఉపాధి రంగంపై కూడా దృష్టి సారించిందని తెలిపారు. దీంతో పాటు ఉపాధి వేతన జీవులకు బడ్జెట్ ద్వారా సంపద మిగిల్చుకొని వినియోగించుకునే అవకాశం కల్పించిందన్నారు. ఆరోగ్య రంగానికి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు.

    అలాగే ప్రజలు సంక్లిష్ట పన్ను విధానాలతో సతమతం అవుతున్నారు. అందుకు సులభతరమైన విధానాలతో పాటు వడ్డీ, అలాగే పెనాల్టీల గొడవల నుంచి ఉపశమనం కల్పించే అవకాశం కల్పిస్తున్నాము. ఏయిర్ ఇండియా, ఎస్‌సీఐ, కాంకర్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఈ సంవత్సరం నుంచే మొదలవుతుంది. దీని ద్వారా రూ.2.10 లక్షల కోట్ల ఆదాయం సమకూర్చాలని చూస్తున్నాం. భారతీయ ఉత్పత్తిదారులు అలాగే చిన్న ట్రేడర్స్ ఈ కామర్స్ కంపెనీలు ఇఛ్చే డిస్కౌంట్ల ద్వారా బాగా నష్టపోతున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

    Published by:Krishna Adithya
    First published: