హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Budget 2021-22: ఈ సారి బహీ ఖాతా లేదు..Ipad తో పార్లమెంట్ చేరుకున్న నిర్మల

Union Budget 2021-22: ఈ సారి బహీ ఖాతా లేదు..Ipad తో పార్లమెంట్ చేరుకున్న నిర్మల

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు పార్లమెంట్‌కు చేరుకోనున్నారు. నిర్మల ఈసారి ఎర్రటి తొడుగు ఉన్న ఐప్యాడ్ తీసుకెళ్లారు.

    కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడి లో పెట్టేందుకు 2021-22 బడ్జెట్‌ పై అన్ని వర్గాల ప్రజలు, సెక్టార్లు భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నాయి. కొద్ది సేపటి క్రితమే కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు పార్లమెంట్‌కు చేరుకోనున్నారు. గత ఏడాది బహీ ఖాతాలో పార్లమెంటులో బడ్జెట్ దస్త్రాలను పట్టుకెళ్లిన నిర్మల ఈసారి ఎర్రటి తొడుగు ఉన్న ఐప్యాడ్ తీసుకెళ్లారు. కాగా 2019లో నిర్మల సీతారామన్ తొలి బడ్జెట్‌ ప్రకటన సందర్భంగా బడ్జెట్‌ కాగితాలను తోలు బ్యాగులో పార్లమెంటుకు తీసుకువచ్చే సంప్రదాయాన్ని తోసిపుచ్చారు. వ్యాపారస్తులు ఉపయోగించే ఎర్రని వస్త్రం చుట్టిన ‘బహీ ఖాతా’లో బడ్జెట్‌ను పార్లమెంటుకు తీసుకువచ్చారు. ఈ సారి ఆ బహీ ఖాతా ప్లేసులో ఐప్యాడ్ వచ్చి చేరింది.

    ఇదిలా ఉంటే ఈ సంవత్సరం కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ప్రజల జీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు (సోమవారం) ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

    First published:

    Tags: Budget 2021, Union Budget 2021

    ఉత్తమ కథలు