హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2021 Speech Live Updates: ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు నిర్మలమ్మ బడ్జెట్ లో భారీగానే కేటాయింపులు

Budget 2021 Speech Live Updates: ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు నిర్మలమ్మ బడ్జెట్ లో భారీగానే కేటాయింపులు

రాబోయే ఆరు నెలల్లో తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఐదు రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman)పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఉంటాయని అంతా ఊహించారు.

ఇంకా చదవండి ...

  అంతా ఊహించినట్టే త్వరలో ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో భారీ స్థాయిలోనే కేటాయింపులు జరిగాయి. రాబోయే ఆరు నెలల్లో తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఐదు రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఉంటాయని అంతా ఊహించారు. అందరి ఊహలకు అనుగుణంగానే నేడు పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ప్రసంగంలో ఈ రాష్ట్రాలకు భారీగానే కేటాయింపులు జరిగాయి. తమిళనాడు రాష్ట్రంలో దాదాపు 3500 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి ఏకంగా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను కేటాయించారు. మధురై-కొల్లమ్ కారిడార్, చిత్తూరు-తత్చూరు కారిడార్ ప్రాంతాల్లో ఈ రహదారులు నిర్మాణం జరగనుంది. వచ్చేఏడాది నుంచే ఈ రహదారుల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి.

  ఇక కేరళ రాష్ట్రానికి కూడా భారీగానే కేటాయింపులు జరిగాయి. దాదాపు 1100 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం 65వేల కోట్లను కేటాయించారు. ముంబై-కన్యాకుమారి కారిడార్ ను కూడా దీనిలో భాగంగానే నిర్మాణం చేయనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా 6700 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 25వేల కోట్ల రూపాయలను వీటికి కేటాయించారు. 19వేల కోట్ల రూపాయలతో అసోంలో రహదారుల నిర్మాణం జరుగనుంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాలకు కేటాయింపులు జరిగినట్టు తెలుస్తోంది.

  ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ల విషయంలో కూడా నిర్మలా సీతారామన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ’కరోనా వ్యాక్సిన్లను ప్రస్తుతానికి ప్రవేటు రంగానికి అందుబాటులో ఉంచడం లేదు. వ్యాక్సినేషన్లకు ప్రేవేటు రంగాన్ని దూరంగానే ఉంచాలని నిర్ణయించాం. ఇది వారికి నిరాశ కలిగించవచ్చు. కానీ దేశ ప్రజల శ్రేయస్సు కోసం తప్పడం లేదు. మొదటి విడతగా ఇస్తున్న కరోనా వ్యాక్సిన్ల ఒక్కో డోసు ధర 255 రూపాయలుగా నిర్ణయించాం. బడ్జెట్లో కేటాయించిన మొత్తం రెండు డోసులకు గానూ ఏకంగా 68.6 కోట్ల మంది భారత ప్రజలకు సరిపోతుంది. అవసరాన్ని బట్టి ఆ మొత్తాన్ని ఇంకా పెంచుతాం‘ అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తేల్చిచెప్పారు.

  First published:

  Tags: Budget 2021, Narendra modi, Nirmala sitharaman, Union Budget 2021

  ఉత్తమ కథలు