Home /News /business /

Budget 2021 Speech Live Updates: కరోనా వ్యాక్సిన్ల గురించి గుడ్ న్యూస్.. ఆత్మ నిర్భర ప్యాకేజీపై నిర్మలా సీతారామన్ ప్రకటన..

Budget 2021 Speech Live Updates: కరోనా వ్యాక్సిన్ల గురించి గుడ్ న్యూస్.. ఆత్మ నిర్భర ప్యాకేజీపై నిర్మలా సీతారామన్ ప్రకటన..

నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫొటో)

నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫొటో)

ఉదయం 11 గంటల సమయంలో నిర్మలా సీతారామన్ FM Nirmala Sitharaman) బడ్జెట్ (Union Budget 2021) ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. కరోనా మహమ్మారి విజృంభనను గుర్తుచేసిన ఆమె, ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయని ఎవరూ ఊహించలేదన్నారు.

    పార్లమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. అంతకుముందు బడ్జెట్ ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మొదటిసారిగా పేపర్ లెస్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెడుతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజానీకానికి తాజా బడ్జెట్ పై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటల సమయంలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. కరోనా మహమ్మారి విజృంభనను గుర్తుచేసిన ఆమె, ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయని ఎవరూ ఊహించలేదన్నారు. కరోనా వల్ల కలిగిన కష్టాల నుంచి అన్ని రంగాలను రక్షించేందుకు ఇప్పటికే రెండు మూడు మినీ బడ్జెట్లను అమలు చేశామని ఆమె గుర్తు చేశారు.

    అంతే కాకుండా కరోనా వ్యాక్సినేషన్ల గురించి కూడా ఆమె వ్యాఖ్యానించారు. ’ప్రజల సంక్షేమం కోసం ’ఆత్మ నిర్భర్ యోజన‘ ను ప్రవేశపెడుతున్నాం. దీనికి 61,180 కోట్ల రూపాయల నిధిని కేటాయిస్తున్నాం. ఆరేళ్ల ఇంత మొత్తాన్ని ఈ పథకం కోసం ఖర్చు పెడతాం. దేశవ్యాప్తంగా 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లను నెలకొల్పుతున్నాం. భారత్ లో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందిస్తున్నారు. మరో రెండు వ్యాక్సిన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో మరింత మంది భారతీయులకు వ్యాక్సిన్లను అందించబోతున్నాం. మన శాస్త్రవేత్తలు రూపొందించిన వ్యాక్సిన్లు కేవలం మన కోసమే కాకుండా దాదాపు వంద దేశాలకు సరఫరా చేస్తున్నాం. ఇది అంతర్జాతియంగా భారత్ ఖ్యాతిని పెంచుతోంది‘ అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.

    కాగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న బడ్జెట్ ను దేశమంతటా ఉత్కంఠగా చూస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత అంచనాలు ఈ బడ్జెట్ పై ఉన్నాయి. కరోనా మహమ్మారి వలన దాదాపుగా అన్ని రంగాలు కూడా కకావిలకం అయ్యాయి. లక్షలాది మంది పౌరులు ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగం పెరిగిపోయింది. పారిశ్రామిక రంగాలన్నీ షట్ డౌన్ అయ్యి, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఈ తరుణంలో వస్తున్న కేంద్ర బడ్జెట్ అన్ని రంగాలను ఊరిస్తోంది. తమకు బడ్జెట్ లో ఏమేం మేలు జరగబోతోందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Budget 2021, Indian parliament, Narendra modi, Nirmala sitharaman, Union Budget 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు