హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2021 Speech Live Updates: ఇన్వెస్టర్లకు పండగ.. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలైన గంటలోనే.. ఏకంగా 2.44 లక్షల కోట్లు..

Budget 2021 Speech Live Updates: ఇన్వెస్టర్లకు పండగ.. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలైన గంటలోనే.. ఏకంగా 2.44 లక్షల కోట్లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిర్మలమ్మ (FM Nirmala Sitharaman) ప్రకటనలు భారత స్టాక్ మార్కెట్ కు కొత్త జోష్ ను తీసుకొచ్చాయి. మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెల్త్ కేర్, ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఐటీ వంటి వివిధ రంగాలకు సంబంధించి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలతో సెన్సెక్స్ 900 పాయింట్లు లాభపడింది. దీంతో..

ఇంకా చదవండి ...

  పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుస పథకాలతో జెట్ స్పీడుతో ప్రసంగిస్తోంటే, మరో వైపు మార్కెట్లు కూడా ఫుల్ జోష్ మీదున్నాయి. నిర్మలమ్మ ప్రకటనలు భారత స్టాక్ మార్కెట్ కు కొత్త జోష్ ను తీసుకొచ్చాయి. మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెల్త్ కేర్, ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఐటీ వంటి వివిధ రంగాలకు సంబంధించి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలతో సెన్సెక్స్ 900 పాయింట్లు లాభపడింది. దీంతో 47,263.30 వద్ద గరిష్ట స్థాయిని సూచీ చేరుకుంది. అలాగే 12:23 వద్ద 186.45 పాయింట్లు లాభపడి 13,819.35 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 2 శాతం లాభపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ 11 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 6 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 4 శాతం, హిందాల్కో 3 శాతం చొప్పున లాభపడి టాప్ గెయినర్స్ గానిలిచాయి.

  స్టాక్ మార్కెట్లో జోష్ పెరగడంతో ఇన్వెస్టర్లు ఊహించని రీతిలో లాభపడ్డారు. నిర్మలా సీతారామన్ ప్రసంగం మొదలు పెట్టిన గంటలోపే ఏకంగా 2.44 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు ఆర్జించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంతో గంట వ్యవధిలోనే దాదాపు రెండున్నర లక్షల కోట్ల లాభాన్ని ఇన్వెస్టర్లు ఆర్జించారన్నమాట. ఇదిలా ఉండగా, పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పలు కీలక పథకాలను ప్రకటించారు. కరోనా మహమ్మారి వల్ల కలిగిన నష్టం నుంచి భారత్ త్వరగా తేరుకుని ఆర్థికంగా పరిపుష్టం కావాలన్నదే తమ ఆశ అని ఆమె స్పష్టం చేశారు.

  ఇదే సమయంలో ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు కూడా బాగానే కేటాయింపులు జరిగాయి. తమిళనాడు రాష్ట్రంలో దాదాపు 3500 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి ఏకంగా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను కేటాయించారు. మధురై-కొల్లమ్ కారిడార్, చిత్తూరు-తత్చూరు కారిడార్ ప్రాంతాల్లో ఈ రహదారులు నిర్మాణం జరగనుంది. వచ్చేఏడాది నుంచే ఈ రహదారుల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి. ఇక కేరళ రాష్ట్రానికి కూడా భారీగానే కేటాయింపులు జరిగాయి. దాదాపు 1100 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం 65వేల కోట్లను కేటాయించారు. ముంబై- కన్యాకుమారి కారిడార్ ను కూడా దీనిలో భాగంగానే నిర్మాణం చేయనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా 6700 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 25వేల కోట్ల రూపాయలను వీటికి కేటాయించారు. 19వేల కోట్ల రూపాయలతో అసోంలో రహదారుల నిర్మాణం జరుగనుంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాలకు కేటాయింపులు జరిగినట్టు తెలుస్తోంది.

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Budget 2021, Indian parliament, Narendra modi, Nirmala sitharaman, Union Budget 2021

  ఉత్తమ కథలు