మనం ఎన్నో ఏళ్లుగా ఎగిరే కార్ల (Flying Cars)ను సినిమాల్లో చూస్తున్నాం. వాహన రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నా ఈ ఎగిరే కార్లు చాలాకాలంగా కలలాగానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే రియల్ వరల్డ్‌లో కూడా ఈ ఫ్లయింగ్ కార్లు సక్సెస్‌ఫుల్‌గా టెస్టింగ్ పూర్తి చేసుకుంటూ ఆశ్చర్య పరుస్తున్నాయి. తాజాగా చైనీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ ఎక్స్‌పెంగ్ (Xpeng Inc) తన ఫ్లయింగ్ కారు(Flying Car)ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఎగురవేసింది. ఇదే ఈ ఫ్లయింగ్ కారు మొదటి పబ్లిక్ ఫ్లైట్ (Public Flight) కాగా దీన్ని చూసిన దుబాయ్ నగరవాసులు మంత్రముగ్ధులయ్యారు. ఎక్స్‌పెంగ్ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం తన తొలి ఫ్లయింగ్ కారును టెస్ట్ చేస్తూ ఆకాశంలో 90 నిమిషాల పాటు బహిరంగంగా ఎగురవేసింది.
2025 నాటికి ఎగిరే కార్లలో సామాన్య ప్రజలు ప్రయాణించడం సాధ్యం అవుతుందని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాల్లో ఒకటైన దుబాయ్‌తో సహా ఇతర నగరాల్లో కూడా ప్రజలు ఎగిరే కార్లలో ప్రయాణించొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎగిరే కార్లలో చేసే ప్రయాణాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి కావచ్చు.
దీనివల్ల డబ్బులు బాగా ఉన్నవారు మాత్రమే వీటిలో ప్రయాణించే అవకాశముంటుంది. ఇక Xpeng అభివృద్ధి చేసిన ఈ ఫ్లయింగ్ కారుకు X2 అని పేరు పెట్టారు. ఇది రెండు-సీట్ల ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (eVTOL) కారు. దీనిని ఎనిమిది ప్రొపెల్లర్లు వాహనాన్ని పైకి లేపుతాయి. ఇందులో నాలుగు వైపులా ఒక్కో భాగంలో రెండు ప్రొపెల్లర్లు అమర్చారు.
* ఫీచర్లు, ప్రత్యేకతలు
ఈ అటానమస్ కారు గరిష్ఠ టేకాఫ్ వెయిట్ 760 కిలోలు, ఎంప్టీ వెయిట్ 560 కిలోలు. ఇది గంటకు 130కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ప్రీమియం కార్బన్ ఫైబర్ పదార్థంతో తయారైన దీనికి ఎయిర్‌ఫ్రేమ్ పారాచూట్‌ను అమర్చారు. 35 నిమిషాల ఫ్లైట్ టైమ్ ఆఫర్ చేసే ఈ X2 ఫ్లయింగ్ కారు సోమవారం నాడు దుబాయ్‌లో మానవ రహితంగా విహరించింది.
* దుబాయ్‌లోనే ఎందుకు?
సరికొత్త ఫ్లయింగ్ కారును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు Xpeng దుబాయ్ నగరాన్ని ఎంచుకుంది. ఇక్కడి ప్రజలు తమ కారులో ప్రయాణించేగలిగే ధనవంతుల అనే ఉద్దేశంతో దీనిని సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలు రోడ్డుపై కూడా నడపగలిగేలా సిక్స్త్ జనరేషన్ ఎగిరే కారును కూడా Xpeng కంపెనీ అభివృద్ధి చేస్తోంది.
XPeng వైస్-ఛైర్మన్, ప్రెసిడెంట్ డాక్టర్ బ్రియాన్ గు మాట్లాడుతూ, ఎగిరే కార్లను రియాలిటీగా మార్చడానికి మూడు విషయాల్లో అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. మొదటిది ఎగిరే సామర్థ్యాన్ని పరీక్షించడం, భద్రత వంటి సాంకేతికత తీసుకు రావడమైతే.. రెండవది నిబంధనల ఆమోదం, మూడవది వినియోగదారుల ఆమోదం అని పేర్కొన్నారు. ఇక ఎగిరే కార్ల ధరను ఇంకా నిర్ణయించలేదని.. ఫెరారీ, రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లతో సమానమైన ధరలతో ఇవి అందుబాటులోకి రావచ్చని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Dubai, Flying Car, New cars