బాబు జోక్ వేశాడు... 16 గంటలు ఆగిపోయిన విమానం... ఏమన్నాడంటే...

Bangalore : అసలే ఉగ్రవాద పేలుళ్లతో అందరూ టెన్షన్ పడుతుంటే... ఆ కుర్రాడు వేసిన జోక్‌ నవ్వు తెప్పించకపోగా... మరింత టెన్షన్ పెంచింది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 25, 2019, 6:59 AM IST
బాబు జోక్ వేశాడు... 16 గంటలు ఆగిపోయిన విమానం... ఏమన్నాడంటే...
సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం
  • Share this:
జోక్ వేస్తే విమానం ఆగిపోవడం ఎప్పుడైనా విన్నారా... అది కూడా 16 గంటలపాటూ. ఇది చిత్రమే. జరిగింది ఎక్కడో కాదు మన దేశంలోనే. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచీ ఆ విమానం సింగపూర్ వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులంతా విమానం ఎక్కారు. మరో పావు గంటలో అంటే ఉదయం 1.20 సమయంలో అది టేకాఫ్ కావాల్సి ఉంది. విమానం ఎక్కిన ప్రయాణికులు నిద్రపోయేందుకు సిద్ధమవుతున్ సమయంలో... ఓ కుర్రాడు తన సీట్ నుంచీ లేచాడు. నా బ్యాగులో గన్ ఉంది (ఐ హ్యావ్ ఏ గన్ ఇన్ మై బ్యాగ్) అంటూ లైట్‌గా నవ్వాడు. గన్ అనే పదం వినపడగానే ఎయిర్ హోస్టెస్‌లు అదిరిపడ్డారు. విమాన సిబ్బంది... వెంటనే ప్రయాణికులందర్నీ (173 మంది) విమానం దింపేశారు. అక్కడికీ ఆ కుర్రాడు చెబుతూనే ఉన్నాడు. తానూ జోక్ చేశాననీ, తన దగ్గర గన్ లేదనీ... అయినా సరే సిబ్బంది వినిపించుకోలేదు. ప్రయాణికులు కూడా అతని బ్యాగ్‌లో గన్ ఉండే ఉంటుంది, గన్ కాకపోతే మరేదైనా మారణాయుధం ఉండే ఉంటుంది అనుకుంటూ... బ్యాగ్ చెక్ చేసిన తర్వాతే విమానాన్ని టేకాఫ్ చెయ్యాలని కోరారు.

అలా మొదలైన టెన్షన్ గంటల తరబడి కొనసాగింది. ఆ కుర్రాణ్ని ఎయిర్‌పోర్ట్‌లోని పోలీసు అధికారులకు అప్పగించారు. వాళ్లు అతన్ని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి... నువ్వు ఎవరు, ఎక్కడి నుంచీ వచ్చావు, సింగపూర్ ఎందుకెళ్తున్నావు, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా ఇలా రకరకాల ప్రశ్నలు వేశారు. అతను చెప్పే సమాధానాలు బట్టీ కొత్త కొత్త ప్రశ్నలు వేశారు.

బాంబు స్క్వాడ్ టీమ్స్ విమానంలో లగేజీని చెక్ చేశాయి. ఆ కుర్రాడి లగేజీలో గిటార్ ఉంది కానీ గన్ మాత్రం లేదు. ఇతర ఆయుధాలు కూడా లేవు. బట్ అతను ఆ గన్‌ను మరెవరి లగేజీలోనైనా వేసి ఉండొచ్చని భావించిన పోలీసులు... మొత్తం చెక్ చెయ్యాలని డిసైడయ్యారు. ఇందుకు ప్రయాణికులు కూడా సరేనన్నారు.

ఇలా మొత్తం చెకింగ్ అంతా పూర్తయ్యేసరికి... మర్నాడు సాయంత్రం 5 గంటలైంది. అప్పటికే సింగపూర్ నుంచీ మరో విమానాన్ని తీసుకొచ్చి... అందులో ప్రయాణికుల్ని ఎక్కించి తీసుకెళ్లారు. తిరిగి అందర్నీ విమానం ఎక్కించి టేకాఫ్ చేసేసరికి సాయంత్రం 5.23 అయ్యింది. ఇలా ఓ పనికిమాలిన జోక్ వల్ల 16 గంటలు ఆలస్యంగా విమానం వెళ్లింది.

 

ఇవి కూడా చదవండి :

ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా... కేంద్రం నుంచీ సంకేతాలు...పైకి హ్యాపీ... లోపల టెన్షన్... చంద్రబాబు, జగన్ ఇద్దరూ అంతే... గెలుపుపై రకరకాల లెక్కలు...

చంద్రబాబుకి సింగపూర్... జగన్‌కు స్విట్జర్లాండ్... వైసీపీ అధినేత ప్లాన్ అదిరిందిగా...

కొత్తిమీర పుదీనా జ్యూస్... వేసవిలో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...
First published: April 25, 2019, 6:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading