Flipkart Trolled: ఫ్లిప్‌కార్ట్‌ను ఉతికారేస్తున్న నెటిజన్లు... చేసిన తప్పు అలాంటిది మరి

Flipkart Trolled: ఒక్కోసారి ఎంతో ప్రజాభిమానం పొందిన కంపెనీలు కూడా తప్పులు చేస్తుంటాయి. ఫ్లిప్‌కార్ట్‌పై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఫెస్టివల్ సీజన్‌లో పెద్ద దెబ్బే.

news18-telugu
Updated: October 10, 2020, 7:31 AM IST
Flipkart Trolled: ఫ్లిప్‌కార్ట్‌ను ఉతికారేస్తున్న నెటిజన్లు... చేసిన తప్పు అలాంటిది మరి
Flipkart Trolled: ఫ్లిప్‌కార్ట్‌ను ఉతికారేస్తున్న నెటిజన్లు... చేసిన తప్పు అలాంటిది మరి (File)
  • Share this:
Trolling on Flipkart: ఓవైపు అమెరికాకు చెందిన అమెజాన్ ఈ కామర్స్ సంస్థ... మన అమెజాన్... మన దుకాణం అంటూ... భారతీయులకు దగ్గరయ్యేందుకు గట్టిగా ప్రయత్నిస్తుంటే... భారతదేశానికి చెందిన ఫ్లిప్‌కార్ట్ భారీ తప్పిదం చేసి... భారతీయల ఆగ్రహావేశాల్ని చూస్తోంది. ఇన్నాళ్లూ ఫ్లిప్‌కార్ట్‌ని వెనకేసుకొచ్చిన వారు సైతం... ఒక్కసారిగా రివర్స్ అయ్యారు. కరోనా తర్వాత... ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ కంపెనీకి... తాజా పరిమాణం షాకిచ్చినట్లైంది. చేసిన తప్పుకి క్షణాపణ చెప్పినా... ట్రోలింగ్ ఆగట్లేదు. అసలేమైందంటే... కంపెనీకి చెందిన ఓ సర్వీస్ ఎగ్జిక్యూటివ్... ఓ కస్టమర్‌కి చెప్పిన సమాధానమే ఈ వివాదం చెలరేగడానికి కారణమైంది. "మేం నాగాలాండ్‌కి వస్తువులను డెలివరీ చెయ్యలేం. ఎందుకంటే... మేం ఇండియాలో మాత్రమే సర్వీసులు అందిస్తున్నాం" అని ఆ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. అంతే... అది కాస్తా అగ్గి రాజేసింది. నాగాలాండ్ ఉన్నది ఇండియాలోనే కదా... మరి అలా ఎందుకు చెప్పారన్నది వివాదాస్పదం అయ్యింది.

"ఏం నాగాలాండ్‌కి ఎందుకు డెలివరీ చెయ్యరు? ఈశాన్య రాష్ట్రాలను ఫ్లిప్‌కార్ట్ వేరేగా చూస్తోందా?" అని నాగాలాండ్‌కి చెందిన ఓ కస్టమర్ అడిగితే... "అలాంటిదేమీ లేదు. మా దగ్గర మీరు షాపింగ్ చేయాలనే ఆసక్తి కలిగివుండటంపై ఆనందం వ్యక్తం చేస్తున్నాం. కాకపోతే... ఇండియాలో లేని ప్రాంతాలకు మేం మా సేవల్ని అందించలేం" అని ఫ్లిప్‌కార్ట్ సమాధానం ఇచ్చినట్లు ఆ కస్టమర్... ట్వీట్ చేశారు.

Flipkart Trolled: ఫ్లిప్‌కార్ట్‌ను ఉతికారేస్తున్న నెటిజన్లు... చేసిన తప్పు అలాంటిది మరి


దీనిపై వరుసపెట్టి ట్రోలింగ్ వస్తుండటంతో... విషయం ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం దాకా వెళ్లింది. అసలేం జరిగిందో తెలుసుకుంది. కొంప మునిగిందని భావించిన కంపెనీ... వెంటనే తన తప్పును తెలుసుకుంది. "మేం క్షమాపణ కోరుతున్నాం... ఇంతకుముందు పొరపాటు జరిగింది. మేం దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాం. నాగాలాండ్‌లోని ప్రాంతాలకు కూడా అందిస్తున్నాం. అందుబాటులో ఉన్న అవకాశాల ద్వారా మేం మీకు సేవలు అందించేందుకు సంతోషంగా ఉన్నాం" అని ఫ్లిప్‌కార్ట్ సమాధానం ఇచ్చుకుంది.






ఈ మొత్తం వ్యవహారాన్ని తెలుసుకున్న ఓ నెటిజన్ ఇలా అన్నారు. "చాలా దారుణం. అందుకే... భూగోళ శాస్త్రం ముఖ్యమైనది. దాన్ని స్కూల్ విద్యలో తప్పనిసరి చెయ్యాలి" అన్నారు. ఇంకా చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు.
Published by: Krishna Kumar N
First published: October 10, 2020, 7:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading