Flipkart Sale: ఏసీ, ఫ్రిజ్, కూలర్లపై డిస్కౌంట్... ఇంకొన్ని గంటలే ఆఫర్

Flipkart Super Cooling Days Sale | ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై కొన్నవారికి 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

news18-telugu
Updated: April 14, 2019, 7:13 AM IST
Flipkart Sale: ఏసీ, ఫ్రిజ్, కూలర్లపై డిస్కౌంట్... ఇంకొన్ని గంటలే ఆఫర్
Flipkart Sale: ఏసీ, ఫ్రిజ్, కూలర్లపై డిస్కౌంట్... ఇంకొన్ని గంటలే ఆఫర్
news18-telugu
Updated: April 14, 2019, 7:13 AM IST
వేసవి వేడి తట్టుకోలేకపోతున్నారా? ఇంట్లోకి ఏసీ కొనాలనుకుంటున్నారా? కొత్త ఫ్రిజ్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఫ్లిప్‌కార్ట్‌లో 'సూపర్ కూలింగ్ డేస్' సేల్ మొదలైంది. గత నెలలోనే 'కూలింగ్ డేస్' సేల్ నిర్వహించింది ఫ్లిప్‌కార్ట్. ఇప్పుడు 'సూపర్ కూలింగ్ డేస్' పేరుతో సమ్మర్ స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. ఇప్పటికే మొదలైన సేల్ ఏప్రిల్ 14న ముగుస్తుంది. ఏసీ, ఫ్యాన్స్, కూలర్స్, రిఫ్రిజిరేటర్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. కొన్ని ప్రొడక్ట్స్‌పై 65% వరకు తగ్గింపు ఇవ్వడం విశేషం. అంతేకాదు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై కొన్నవారికి 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

Read this: WhatsApp: వాట్సప్‌లో వీడియోను ఆడియోగా ఇలా మార్చేయండి

ఫ్లిప్‌కార్ట్‌ 'సూపర్ కూలింగ్ డేస్' సేల్ ఆకట్టుకుంటున్న ఆఫర్లు ఇవే...



'సూపర్ కూలింగ్ డేస్' సేల్‌లో మార్‌క్యూ, లాయిడ్, డైకిన్, ఎల్‌జీ, సాంసంగ్, వోల్టాస్ లాంటి బ్రాండ్లకు చెందిన స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ, ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు పొందొచ్చు. బ్లూస్టార్, ఎల్‌జీ, సాంసంగ్‌తో పాటు అనేక బ్రాండ్ల ప్రొడక్ట్స్‌పై ఆఫర్లు అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ప్రారంభ ధర రూ.6,999 కావడం విశేషం. ఫ్యాన్ ప్రారంభ ధర రూ.899 కాగా, ఏసీ ప్రారంభ ధర రూ.19,999. డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ప్రారంభ ధర రూ.17,490.



Yamaha MT-15: యమహా కొత్త బైక్ ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:
Loading...
SBI Good News: గుడ్ న్యూస్... వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

Zomato: జొమాటోలో సింగిల్ ఆర్డర్‌ బిల్లు రూ.1.8 లక్షలు... 415 బాక్సుల డెలివరీ

UPSC Jobs: మొత్తం 965 ఖాళీలు... మొదలైన దరఖాస్తు ప్రక్రియ
First published: April 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...