Flipkart Republic Day Sale: జనవరి 20 నుంచి 22 వరకు ఫ్లిప్‌‌కార్ట్‌‌లో రిపబ్లిక్ డే సేల్

Flipkart Republic Day Sale | జనవరి 20 నుంచి 22 వరకు జరిగే సేల్‌లో ఏఏ ఆఫర్లు ఉంటాయో ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్, యాప్‌లో తెలుసుకోవచ్చు. కొన్ని డీల్స్ వివరాలను వెల్లడించింది ఫ్లిప్‌కార్ట్. ఎస్‌బీఐ కార్డులతో ట్రాన్సాక్షన్స్ చేసేవారికి 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

news18-telugu
Updated: January 16, 2019, 7:22 PM IST
Flipkart Republic Day Sale: జనవరి 20 నుంచి 22 వరకు ఫ్లిప్‌‌కార్ట్‌‌లో రిపబ్లిక్ డే సేల్
Flipkart Republic Day Sale: జనవరి 20 నుంచి 22 వరకు ఫ్లిప్‌‌కార్ట్‌‌లో రిపబ్లిక్ డే సేల్
  • Share this:
ఫ్లిప్‌కార్ట్‌‌లో మళ్లీ ఆఫర్ సేల్ ప్రారంభం కాబోతోంది. జనవరి 20 నుంచి 22 వరకు రిపబ్లిక్ డే సేల్ నిర్వహించబోతోంది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్‌లో అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ లాంటి కేటగిరీల్లో డీల్స్ కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి. ఎప్పట్లాగే షావోమీ, హానర్, ఏసుస్, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై మంచి ఆఫర్లు ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఎలక్ట్రానిక్స్‌, యాక్సెసరీస్‌పై 80శాతం వరకు, టీవీలు, అప్లయెన్సెస్‌పై 75 శాతం వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్స్‌పై 70 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అంతే కాదు 3 వస్తువులు కలిపి కొంటే 10శాతం, 4 వస్తువులు కలిపి కొంటే 15 శాతం తగ్గింపు ఆఫర్లున్నాయి.

జనవరి 20 నుంచి 22 వరకు జరిగే సేల్‌లో ఏఏ ఆఫర్లు ఉంటాయో ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్, యాప్‌లో తెలుసుకోవచ్చు. కొన్ని డీల్స్ వివరాలను వెల్లడించింది ఫ్లిప్‌కార్ట్. ఎస్‌బీఐ కార్డులతో ట్రాన్సాక్షన్స్ చేసేవారికి 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ప్రతీ 8 గంటలకోసారి బ్లాక్ బస్టర్ డీల్స్ రీఫ్రెష్ అవుతాయి. జనవరి 20 అర్థరాత్రి రెండు గంటల నుంచి రష్ హవర్స్ ఎక్స్‌ట్రా డిస్కౌంట్స్, ప్రతీరోజు రూ.1,450 కొనుగోలుపై 10 శాతం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు 26 శాతం, రూ.1950 కొనుగోలుపై అదనంగా 5 శాతం తగ్గింపు లభిస్తుంది.


ఇవి కూడా చదవండి:

SANKRANTI 2019: వాట్సప్‌లో సంక్రాంతి స్టిక్కర్లు ఇలా పంపండి

Paytm Petrol Offer: పేటీఎంతో పెట్రోల్ కొంటే రూ.7,500 క్యాష్ బ్యాక్

Donkey's Milk Soap: గాడిద పాల సబ్బుకు ఫుల్ డిమాండ్... ధర రూ.499#10YearChallenge: పదేళ్లలో సెలబ్రిటీలు ఎలా మారిపోయారో ఫోటోల్లో చూడండి
Published by: Santhosh Kumar S
First published: January 16, 2019, 7:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading