news18-telugu
Updated: July 28, 2020, 6:52 PM IST
Flipkart: ఆర్డర్ చేస్తే 90 నిమిషాల్లో హోమ్ డెలివరీ... ఫ్లిప్‌కార్ట్ కొత్త సర్వీస్
(ప్రతీకాత్మక చిత్రం)
ఫ్లిప్‌కార్ట్‌లో ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్ న్యూస్. 'ఫ్లిప్‌కార్ట్ క్విక్' పేరుతో సరికొత్త సర్వీస్ లాంఛ్ చేసింది. కస్టమర్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసిన 90 నిమిషాల్లో హోమ్ డెలివరీ చేస్తామంటోంది ఫ్లిప్‌కార్ట్. స్థానికంగా ఫ్లిప్‌కార్ట్ హబ్స్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌ని మీరు ఆర్డర్ చేస్తే 90 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాయి. కస్టమర్లు 90 నిమిషాలు లేదా 2 గంటల స్లాట్ ఎంచుకోవచ్చు. కస్టమర్లు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత దగ్గర్లో ఉన్న ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో ఆర్డర్ ప్లేస్ అవుతుంది. మీకు దగ్గర్లో ఉన్న ప్లిప్‌కార్ట్ హబ్‌ను గుర్తించేందుకు, లొకేషన్ మ్యాపింగ్ కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించనుంది ఫ్లిప్‌కార్ట్. బెంగళూరులో ప్రారంభమైన 'ఫ్లిప్‌కార్ట్ క్విక్' సర్వీస్ త్వరలో మిగతా నగరాల్లో కూడా ప్రారంభం కానుంది.

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, పనతూర్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, బీటీఎం లేఅవుట్, బనశంకరి, కేఆర్ పురం, ఇందిరానగర్‌లో లాంఛ్ అయింది. నిత్యావసర సరుకులు, వస్తువులు, పాల ఉత్పత్తులు, మాంసం, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్, స్టేషనరీ ఐటమ్స్, హోమ్ యాక్సెసరీస్ లాంటి 2,000 ఉత్పత్తులను మొదటి దశలో డెలివరీ చేయనుంది ఫ్లిప్‌కార్ట్. ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఎప్పుడు ఆర్డర్ చేసినా 90 నిమిషాల్లో ఆ వస్తువులను ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇందుకోసం కస్టమర్లు మినిమమ్ డెలివరీ ఫీజ్ రూ.29 చెల్లించాల్సి ఉంటుంది.
Published by:
Santhosh Kumar S
First published:
July 28, 2020, 6:52 PM IST