• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • FLIPKART QUICK HYPERLOCAL FASTEST DELIVERY SERVICE LAUNCHED IN HYDERABAD SS

Flipkart Quick: ఆర్డర్ చేసిన గంటన్నరలో డెలివరీ... ఫ్లిప్‌కార్ట్ కొత్త సర్వీస్

Flipkart Quick: ఆర్డర్ చేసిన గంటన్నరలో డెలివరీ... ఫ్లిప్‌కార్ట్ కొత్త సర్వీస్

Flipkart Quick: ఆర్డర్ చేసిన గంటన్నరలో డెలివరీ... ఫ్లిప్‌కార్ట్ కొత్త సర్వీస్ (image: Flipkart)

Flipkart Quick | హైదరాబాద్‌లో హైపర్ లోకల్ ఫాస్టెస్ట్ డెలివరీ సర్వీస్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ క్విక్ ద్వారా ఏమేం కొనొచ్చో తెలుసుకోండి.

  • Share this:
    ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు ఆర్డర్ చేస్తే డెలివరీ రావడానికి కనీసం ఒక్కరోజైనా పడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో సేమ్ డే డెలివరీ చేస్తుంటాయి ఇ-కామర్స్ కంపెనీలు. కానీ ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్ చేసిన గంటన్నరలో డెలివరీ చేస్తామంటూ కొత్త సర్వీస్‌ని ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ క్విక్ పేరుతో ఈ సర్వీస్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న హైపర్ లోకల్, సూపర్ ఫాస్ట్ సర్వీస్ ఇది. ఈ సర్వీస్ పరిధిలోకి వచ్చే ప్రొడక్ట్స్‌ని ఆర్డర్ చేస్తే కేవలం 90 నిమిషాల్లో ఇంటికి వస్తాయి. గతంలోనే దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ సర్వీస్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఫ్లిప్‌కార్ట్. హైదరాబాద్‌లో కూడా ఫ్లిప్‌కార్ట్ క్విక్ ట్రయల్ సక్సెస్ అయింది. దీంతో ఈ సర్వీస్‌ను అధికారికంగా ప్రారంభించింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, పూణెలో ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్ అధికారికంగా ప్రారంభమైంది.

    ఫ్లిప్‌కార్ట్‌ క్విక్ ద్వారా నిత్యావసర వస్తువుల్ని ఆర్డర్ చేసి వెంటనే తెప్పించుకోవచ్చు. కోవిడ్ 19 ని ఎదుర్కోవడానికి కావాల్సిన వస్తువులు, నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు, బేబీ కేర్ ప్రొడక్ట్స్, మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్‌ని ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్ ద్వారా ఆర్డర్ చేసిన గంటన్నరలో పొందొచ్చు. మొదటి ఆర్డర్‌పై డెలివరీ ఉచితం. ఆ తర్వాత రూ.499 కన్నా ఎక్కువ ఆర్డర్లపై ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడైనా ఆర్డర్స్ చేయొచ్చు. కస్టమర్లకు వీలైనంత త్వరగా ప్రొడక్ట్స్‌ని డెలివరీ చేసేందుకు షాడోఫ్యాక్స్ లాంటి లాజిస్టిక్స్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది ఫ్లిప్‌కార్ట్.

    JioFiber Free Trial: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? జియోఫైబర్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ వివరాలివే

    Poco M2 Reloaded: పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ వచ్చేసింది... ధర రూ.10,000 లోపే


    ఫ్లిప్‌కార్ట్ హైపర్ లోకల్ డెలివరీ సర్వీస్ అయిన ఫ్లిప్‌కార్ట్ క్విక్ 2020లో బెంగళూరులో మొదటిసారిగా ప్రారంభమైంది. స్థానికంగా ఉండే ఫ్లిప్‌కార్ట్ హబ్స్ నుంచి కస్టమర్లకు ప్రొడక్ట్స్‌ని వీలైనంత త్వరగా డెలివరీ చేస్తోంది ఫ్లిప్‌కార్ట్. బెంగళూరులో సక్సెస్ అయిన ఈ సర్వీస్‌ను దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా లాంఛ్ చేయడం విశేషం. తాజాగా హైదరాబాద్, ఢిల్లీ, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, పూణెలో ఫ్లిప్‌కార్ట్ క్విక్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు కసరత్తు జరుగుతోంది. త్వరలో ముంబై, కోల్‌కతా లాంటి మెట్రో నగరాల్లో ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్ ప్రారంభం కానుంది.

    Moto G60: అదిరిపోయే ఫీచర్స్‌తో మోటోరోలా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర రూ.13,999 నుంచి

    WhatsApp: వాట్సప్ వాడేవాళ్లు అస్సలు ఈ తప్పులు చేయొద్దు

    ఇప్పటికే బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ లాంటి సంస్థలు హైపర్ లోకల్ సేవల్ని అందిస్తున్నాయి. వీటితో పాటు స్విగ్గీ, జొమాటో, అమెజాన్ లాంటి కంపెనీలు కూడా తక్కువ సమయంలోనే కస్టమర్లకు ప్రొడక్ట్స్ డెలివరీ చేసేందుకు పోటీపడుతున్నాయి. ఇప్పుడు ఈ సంస్థలకు పోటీ ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్ ప్రారంభమైంది.
    Published by:Santhosh Kumar S
    First published: