ఇంట్లోకి టీవీ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఫ్లిప్‌కార్ట్‌లో మాన్సూన్ అప్లయెన్సెస్ ధమాకా పేరుతో సేల్ జరుగుతోంది. జూల్ 14న మొదలైన సేల్ జూలై 19న ముగుస్తుంది. హోమ్ అప్లయెన్లెస్పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. తక్కువ ధరకే టీవీలను అమ్ముతోంది. ఎల్ఈడీ టీవీలతో పాటు స్మార్ట్‌టీవీలను మంచి డిస్కౌంట్‌తో కొనొచ్చు. అంతేకాదు ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేసేవారికి అదనంగా 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఇటీవల టీవీల ధరలు బాగా తగ్గిన సంగతి తెలిసిందే. వాటిపై మళ్లీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. కాబట్టి గతంతో పోలిస్తే తక్కువ ధరకే ఎల్ఈడీ, స్మార్ట్‌టీవీలను కొనొచ్చు.
SBI: రాత్రి వేళ ఏటీఎంకు వెళ్తున్నారా? ఓటీపీతో డబ్బులు డ్రా చేయండి ఇలా
CIBIL score: మీ క్రెడిట్ స్కోర్ తక్కువుందా? అయినా లోన్ తీసుకోవచ్చు ఇలా
ఫ్లిప్‌కార్ట్ మాన్సూన్ అప్లయెన్సెస్ ధమాకా సేల్‌లో 32 అంగుళాల టీవీ ప్రారంభ ధర రూ.7,999. ఒకవేళ రూ.10,000 కన్నా ఎక్కువ ధర ఉన్న టీవీ కొంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై కనీసం రూ.10,000 పేమెంట్ చేస్తేనే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. రూ.1,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఉదాహరణకు ఈ సేల్‌లో సాంసంగ్ 32 అంగుళాల హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీ ధర రూ.12,499. ఎస్బీఐ కార్డుతో కొంటే రూ.1250 తగ్గుతుంది. అంటే రూ.11,250 ధరకే కొనొచ్చు. సాంసంగ్, థామ్సన్, వీయూ, కొడాక్, ఎంఐ, రియల్మీ టీవీలపై ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:July 17, 2020, 11:20 IST