FLIPKART LAUNCHES 45 MINUTE GROCERY DELIVERY HERE FULL DETAILS NS
Flipkart Quick Delivery: ఫ్లిప్కార్ట్ మరో సంచలనం.. ఇక 45 నిమిషాల్లోనే డెలివరీ.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ (Flipkart) మరో సంచలనానికి తెర లేపింది. కేవలం 45 నిమిషాల్లోనే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా (Corona) మహమ్మారి మానవ జీవితంలో అనేక మార్పులను తీసుకువచ్చింది. ఆన్లైన్ సేవల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కరోనాకు ముందు చాలా పరిమితమైన సంఖ్యలో ఆన్లైన్ గ్రాసరీ(grocery) సేవలను వివిధ సంస్థలు అందించేవి. అయితే కరోనా అనంతరం ఆ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. స్విగ్గీ ఇన్స్టామర్ట్, బిగ్ బాస్కెట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తదితర అనేక సంస్థలు ఆన్లైన్ గ్రాసరీ సేవలను అందిస్తోంది. ముఖ్యంగా చాలా తక్కువ సమయంలో డెలివరీలు చేస్తూ స్విగ్గీ ఇన్స్టామర్ట్ ఇతర సంస్థలకు సవాల్ విసురుతోంది. పది, పదిహేను నిమిషాల్లోనే డెలివరీలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తూ కస్టమర్లకు మెరుగైన సేవలను అందిస్తోంది స్విగ్గీ ఇన్స్టామార్ట్. అయితే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్(Flipkart) సైతం తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఆర్డర్ చేసిన 45 నిమిషాల్లోనే డెలవరీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఈ రకమైన సేవలు ప్రారంభించింది ఫ్లిప్ కార్ట్.
ఇదిలా ఉంటే.. 15 నుంచి 20 నిమిషాల్లో డెలివరీ చేయడం లాంగ్ టైమ్ లో సరైన బిజినెస్ మోడల్ కాదని ఫ్లిప్కార్ట్ ప్రతినిధి కృష్ణమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థిరమైన బిజినెస్ మోడల్ లో 30 నుంచి 45 నిమిషాల డెలివరీ సర్వీసులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్, బెంగళూరులో ఫ్రెష్ వెజిటబుల్స్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఫ్రూట్ డోర్ డెలివరీ సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అనేక ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తామని వివరించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.