news18-telugu
Updated: October 18, 2019, 3:49 PM IST
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్
ఫ్లిప్‌కార్ట్ మరో అద్భుత ఆఫర్‌తో ముందుకు వస్తోంది. ఇప్పటికే ఒకసారి బిగ్ దివాళి సేల్ నిర్వహించిన ఈ ఈకామర్స్ సంస్థ.. మరోసారి అదే ఆఫర్లతో బిగ్ దివాళి సేల్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ దివాళీ సేల్'లో ఎప్పట్లాగే స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. టీవీలు, అప్లయెన్సెస్ విభాగంలో 50,000 పైగా ప్రొడక్ట్స్‌పై 75% వరకు డిస్కౌంట్స్ అందించనుంది ఫ్లిప్‌కార్ట్. ఎలక్ట్రానిక్స్‌పై 90 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. 3 కోట్లకు పైగా ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ, ప్రొడక్ట్స్ ఎక్స్ఛేంజ్ లాంటి సదుపాయాలుంటాయి. ఫ్యాషన్ ప్రొడక్ట్స్ పైనా 50-80% వరకు, ఫర్నీచర్‌పై 40-80% వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్స్‌పై 90% వరకు తగ్గింపు అందించనుంది.

అక్టోబర్ 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ ఆఫర్లు
బిగ్ దివాళి సేల్ పేరుతో 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఐదు రోజులపాటు సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్ ఇటీవల నిర్వహించిన సేల్‌ను మిస్ అయిన వారికి ఇది మరో అద్భుత అవకాశం. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్స్క్రైబర్లకు ఆదివారం రాత్రి 8 గంటల నుంచే ఈ సేల్ అందుబాటులోకి రానుంది.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
October 18, 2019, 3:34 PM IST