Flipkart Big Diwali sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళి సేల్లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. బెస్ట్ డీల్స్​పై ఓలుక్కేయండి

Flipkart Big Diwali saleలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు..

దీపావళి పండుగ సీజన్​ ప్రారంభమవ్వడంతో ఈ–కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ బిగ్ దీవాళి సేల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్​లో స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది.

  • Share this:
దీపావళి పండుగ సీజన్​ ప్రారంభమవ్వడంతో ఈ–కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ బిగ్ దీవాళిసేల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్​లో స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్​ అక్టోబర్ 23తో ముగుస్తుంది. కాగా, ఇటీవల నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగియగానే మరో సేల్​ నిర్వహిస్తుండటం విశేషం.ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళిసేల్​లో బెస్ట్​ డీల్స్, ఆఫర్లను పరిశీలిద్దాం.

1. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళి సేల్‌ (Flipkart Big Diwali Sale)లో పోకో ఎఫ్ 3 జీటీపై భారీ డిస్కౌంట్​ అందిస్తోంది. పోకో (Poco) ఎఫ్​3 జీటీ 6జీబీ ర్యామ్​ వేరియంట్​ అసలు ధర రూ .26,999 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ .25,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

2. ఫ్లిప్​కార్ట్​ బిగ్​ దీవాళి సేల్​లో రియల్​మీ (Realme) జీటీ మాస్టర్ ఎడిషన్​పై భారీ డిస్కౌంట్​ అందిస్తోంది. దీని అసలు ధర రూ. 25,999 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ .21,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ ఆఫర్ ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్స్​పై​ మాత్రమే వర్తిస్తుంది.

3. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్‌లో, ఐఫోన్ 12పై కూడా భారీ ఆఫర్​ అందుకోవచ్చు. దీని అసలు ధర రూ .65,900 వద్ద ఉండగా.. రూ. 11 వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అంటే, కేవలం రూ. 54,999 వద్ద ఇది అందుబాటులో ఉంటుంది.

4. ఫ్లిప్‌కార్ట్ దీవాళి సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 12 మినీని డిస్కౌంట్​పై కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.59,900 ఉండగా.. దీన్ని కేవలం రూ .37,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

5. ఫ్లిప్​కార్ట్​లో గూగుల్​ పిక్సెల్​ 4a స్మార్ట్​ఫోన్​పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం దీన్ని రూ. 25,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

6. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళి సేల్ ఆఫర్‌లో భాగంగా శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62ను కేవలం రూ .17,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

7. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్‌లో మోటరోలా మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్, ఎడ్జ్ 20 స్మార్ట్​ఫోన్లను వరుసగా రూ. 20,499, రూ .27,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

8. ఫ్లిప్​కార్ట్​లో ఏసర్ ఆస్పైర్ 7 కేవలం రూ. 49,990 ధర వద్ద లభిస్తుంది. ఈ ఎంట్రీ లెవల్ గేమింగ్ ల్యాప్‌టాప్​లో 10 వ జెన్ ఇంటెల్ కోర్ i5 CPU, 8GB RAM, Nvidia GTX 1650 GPU వంటివి అందించింది.

9. ఫ్లిప్‌కార్ట్ దీవాళి సేల్‌లో ప్రిడేటర్ హీలియోస్ 300పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్​ను ప్రస్తుతం రూ .1,19,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 11వ జెన్ ఇంటెల్ హెచ్ సిరీస్ కోర్ i7 CPU, ఎన్విడియా RTX 3060 GPU, 16 జీబీ ర్యామ్​, 165Hz QHD IPS డిస్‌ప్లేతో వస్తుంది.

Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

10. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్​లో గూగుల్ పిక్సెల్ బడ్స్ ఎ -సిరీస్ ఇయర్​బడ్స్​ను కేవలం రూ .6,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. కాగా, ధరల తగ్గింపు, ఇతర ఆఫర్లు కాకుండా, ఫ్లిప్‌కార్ట్ ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published: