Flipkart కస్టమర్లకు బంపరాఫర్..100 మంది లక్కీ కస్టమర్లకు ఉచిత స్మార్ట్ ఫోన్ అవకాశం

బిగ్ బిలియన్ డేస్ సమయంలో స్మార్ట్ ఫోన్ కొన్న వారిలో నుండి 100 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. విజేతలకు వారు స్మార్ట్ ఫోన్ కొనడానికి చెల్లించిన మొత్తాన్ని క్యాష్ బ్యాక్ రూపంలో తిరిగి చెల్లిస్తారు.

news18-telugu
Updated: October 21, 2020, 4:08 PM IST
Flipkart కస్టమర్లకు బంపరాఫర్..100 మంది లక్కీ కస్టమర్లకు ఉచిత స్మార్ట్ ఫోన్ అవకాశం
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
పండుగ సీజన్లో భాగంగా ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం Flipkart ‘బిగ్ బిలియన్ డేస్’ పేరుతో సేల్ను కొనసాగిస్తోంది. ఇంకా ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేల్ ముగింపు సమయంలో అద్భుతమైన ఆఫర్తో ముందుకొచ్చింది Flipkart . ఆఫర్లో భాగంగా ఫ్లిప్కార్ట్ సైట్ నుంచి మొబైల్ కొన్న వినియోగదారులకు ‘ఫోన్ ఫర్ ఫ్రీ’ పేరుతో 100 శాతం మనీ-బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 20 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు స్మార్ట్ ఫోన్ కొన్న కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.

కాగా బిగ్ బిలియన్ డేస్ సమయంలో స్మార్ట్ ఫోన్ కొన్న వారిలో నుండి 100 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. విజేతలకు వారు స్మార్ట్ ఫోన్ కొనడానికి చెల్లించిన మొత్తాన్ని క్యాష్ బ్యాక్ రూపంలో తిరిగి చెల్లిస్తారు. అయితే, వారు ఈ–గిఫ్ట్ వోచర్ను మాత్రమే అందుకుంటారు. నగదు లేదా ఇతర రూపాల్లో వారికి క్యాష్ బ్యాక్ చెల్లించబడదని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. Flipkart టర్మ్స్ అండ్ కండీషన్స్ పేజీలో పేర్కొన్న దాని ప్రకారం ప్రతి 3000వ, 6000వ, 9000వ మరియు అదే సీక్వెన్స్లోని కస్టమర్లను విజేతగా ఎన్నుకుంటారని వివరిస్తుంది.

కాగా ఈ విజేతల జాబితా నవంబర్ 30న ప్రకటించబడుతుందని Flipkart పేర్కొంది. Flipkart ప్రకటించిన100 శాతం మనీ బ్యాక్ ఆఫర్ తమిళనాడులోని వినియోగదారులకు మినహా భారతదేశం అంతటా అందుబాటులో ఉంటుంది.

అయితే, ఈ ఆఫర్ రీసెల్లర్స్ కు మాత్రం వర్తించదు. డెలివరీ అయిన ఆర్డర్కు మాత్రమే ఈ వర్తిస్తుందని, రద్దు చేయబడిన ఆర్డర్లకు వర్తించదని కంపెనీ ప్రమోషనల్ పోస్టర్లో పేర్కొంది. బిగ్ బిలియన్ డేస్ సేల్లో భాగంగా ఆపిల్, శామ్సంగ్, గూగుల్, ఒప్పో, షియోమి, వివోతో పాటు ఇతర బ్రాండ్ల నుండి పలు రకాల స్మార్ట్ ఫోన్లకు డిస్కౌంట్లు, ఆఫర్లను ఫ్లిప్కార్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Published by: Krishna Adithya
First published: October 21, 2020, 4:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading