Credit Card Benefits | క్రెడిట్ కార్డు తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే క్రెడిట్ కార్డు అందుబాటులోకి వచ్చింది. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో (Banks) ఒకటైన యాక్సిస్ బ్యాంక్ తాజాగా మరో కొత్త క్రెడిట్ కార్డు (Credit Card) తెచ్చింది. దీని పేరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డు.
ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసే వారికి ఈ క్రెడిట్ కార్డు అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సూపర్ కాయిన్స్ పొందొచ్చు. వీటిని అదనపు తగ్గింపు, డిస్కౌంట్ కోసం ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా కార్డు తీసుకునే వారికి వెల్కమ్ బోనస్ కూడా లభిస్తుంది. ఇందులో భాగంగా 500 సూపర్ కాయిన్లు వస్తాయి. రెండు నెలల యూట్యూబ్ ప్రీమియం ఉచితంగా పొందొచ్చు. ఇంకా మూడు నెలల గానా ప్లస్ లభిస్తుంది. ఏడాది లెన్స్‌కార్ట్ గోల్డ్ మెంబర్షిప్ వస్తుంది. ఇంకా మింత్ర షాపింగ్ చేస్తే అదనంగా రూ. 500 తగ్గింపు పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఫ్లైట్స్ ద్వారా విమాన టికెట్లు బుక్ చేస్తే 15 శాతం తగ్గింపు వస్తుంది.
గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర, ఈరోజు ఎంత తగ్గిందంటే?
ఇంకా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తే అదనంగా రూ. 100 ఖర్చు చేస్తే 12 సూపర్ కాయిన్లు వస్తాయి. ప్లస్ మెంబర్లకు ఇధి వర్తిస్తుంది. అదే ఇతరులకు అయితే 6 కాయిన్లు లభిస్తాయి. ఇతర ఖర్చులపై రూ.100 ఖర్చుపై 2 సూపర్ కాయిన్లు పొందొచ్చు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డు, ఆధార్ కార్డు, కలర్ ఫోటో, పే స్లిప్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.
రూ.330 పొదుపుతో చేతికి రూ.14 లక్షలు.. ఈ 4 స్కీమ్స్‌తో భారీ లాభం!
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డు పొందాలని భావించే వారు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు రూ. 500. కార్డు రిప్లేస్మెంట్ చార్జీలు రూ.100గా ఉన్నాయి. ఫైనాన్స్ ఛార్జీలు నెలకు 3.6 శాతంగా ఉంటాయి. క్యాష్ విత్‌డ్రా ఫీజు 2.5 శాతంగా ఉంటుంది. లేట్ పేమెంట్ ఫీజు రూ. 300 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కొత్త క్రెడిట్ కార్డు పొందాలని భావించే వారు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే వెసులుబాటు లేదు. ఫ్లిప్‌కార్ట్‌లో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేసే వారికి ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axis bank, Credit card, Flipkart